సొంత సుఖం ను కొంత మాని, పెద్ద వయస్సు ముదుసలి తల్లి దండ్రలను దగ్గర ఉంచి బాగా చూడవోయ్ - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 987 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

సొంత లాభం కొంత మానుకుని, పొరుగు వారికి తోడ్పడవోయ్ అనేది పాత మాట, ఎటూ మరచాము. సొంత సుఖం ను కొంత మాని, కనీసం సొంత ముదుసలి లేదా పెద్ద వయస్సు లేదా రోగగ్రస్థ తల్లి దండ్రలను దగ్గర ఉంచి బాగా చూడవోయ్, ఇది నేటి మాట.

మన పిల్లల కు, ఈ కాలము లో కూడా 75 ఏళ్ళు కు కూడా, తోడు ఉంచుకుని, జీవితంలో ఎంత నష్టపోయిన సరే ఎన్ని పోగుట్టుకున్నా సరే, సమాన సౌకర్యాలు ఇచ్చే, మూర్ఖులు (ధన స్వార్ధ వ్యామోహములో ఉన్న ఎక్కువ మంది ద్రుష్టిలో) ఇంకా ఉన్నారు, అని తెలియ చెప్పాలి. తర్వాత తరాల వారు మారాలి, మనల్ని బాగా చూసుకోవాలి.

నాయకులు అయినా, అధికారులు అయినా, కోటీశ్వరులు అయినా, ఓ తల్లి బిడ్డలే. రేపు నడుస్తూ తూలిపడే, కర్ర పట్టి నడిచే, కాటికి పోయే రోజూ, ఎవరమూ తప్పించుకోజాలము.

జీవితంలో ఎన్ని నష్టపోయినా, తప్పు లేదు, కానీ పరమాత్మ మోక్షం ని మాత్రం, వదులు కోవద్దు. అది త్యాగాలు తోనే వస్తుంది, సుఖాలుతో ఐశ్వర్యముతో రాదు. కొవ్వొత్తి లాగా మనము వెలుగు ఇస్తూ, కాలుతు ఉంటే కనీసం సొంత తల్లి దండ్రుల కోసం, అప్పుడు అహంకారం అవమానం ఏదీ మనది కాదు, అంతా ఆ పరమాత్మదే.

అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అనే పాట, మీ అమ్మ గారికి కూడా, సొంతంగా పాడి వినిపిస్తారు కదూ. సొంత తల్లి దగ్గర, రాగాల తప్పులు కు స్వర మాధుర్యానికి సంబంధం లేదు, ఆ అవసరం లేదు, పాడాలని ఆనందింప చేయాలన్న తాపత్రయం ఉంటే చాలు కదా, సాత్వికులకు. మరా మరా అంటే రామ కు బదులు, రాముడు కరుణించాడు.

మన కూతురి ని కూడా, అమ్మా అని పిలుస్తాం కదా ముద్దు గా. మరి 60 ఏళ్ళు వచ్చాక, అమ్మ కూతురు కాదా?

నా కూతురు (75 ఏళ్ల అమ్మ) కి, కాళ్ళు వత్తుతూ ఈ పాట, link లింక్ లోపల ఉంది ఆడియో, మన గార్ధబ స్వరం తో పాడుతుంటే, జోల లాలి పాటలా, ముసి ముసి నవ్వులు నవ్వుతూ, హాయిగా నిదురపోతుంది.

మొన్న దేవాలయం లో పడపోయిన, అంటే దేవుడు భుజాలు పట్టుకుని నెమ్మదిగా నేల పై పడుకోబెట్టిన, సంగతి మీకు తెలుసు, ఎటువంటి బాధ నెప్పులు లేకుండా.

ధనం లేదన్న, కరోనా ఉందన్న, రేపు ఏమిటి అన్న, భయం ఏమీ లేకుండా హాయిగా, ఓ చెయ్యి ఉంది నాకు తోడుగా అని, గుర్తు ధైర్యం ఆ వయస్సు లో, ఆ నిద్ర. మరి మన పిచ్చి ధైర్యం ఏమిటి, ఆ నారాయణుడే, ముసలి బారి నుంచి ఏనుగు ని రక్షించిన, ఆ ఆపద్భాంధవుడే, ఓ దోవ అండ చూపిస్తాడు అని.

తూలిపడే వయస్సు లో, కోట్లు అధికారం హోదా కొరగావు, అభిమానం ప్రేమతో, చేయూత నిచ్చే, నిమిరే చేయి తప్ప. అది కొడుకు లేదా నమ్మకం ఉన్న ఎవరైనా ఒకటే. అది ఎలా దొరుకుతుంది? మనం మంచి మనసు తో, సాత్వికంగా పెరిగి, మన వారిని, పెంచితేనే సుమా.

పాటలో అమ్మ ఎక్కిళ్ళు కూడా ఉన్నాయి, నీళ్ళు తాగుతూ. మీ అమ్మ గారిని కూడా, 60 లేదా 70 ఏళ్ళు తూలిపడే లేదా రోగంతో మంచాన పడే వయస్సు లో, తోడుగా దగ్గర ఇంట్లో ఉంచుకుని, మన సమాన సౌకర్యాలు అందిస్తారు కదూ, శక్తి కొలది వీలైనన్ని సంవత్సరాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1015 General Articles, 46 Tatvaalu
Dt : 24-Jan-2021, Upd Dt : 24-Jan-2021, Category : General
Views : 92 ( + More Social Media views ), Id : 937 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : own selfish , well being , older , elder , parents , close , provide , equal , facilities
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content