అచ్చెన్నాయుడు ప్రశ్నలు - మరి వైకాపా జవాబు? తెదేపా సోషల్ స్ధానిక సమస్యలు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1201 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1231 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

సహజంగా అధికార పార్టీ గురించి, ప్రభుత్వం గురించి, ఎక్కువ కధనాలు ఉంటాయి. ఎందుకంటే వారు అధికారులు నాయకులు తీరును, వెంటనే మార్చగలరు, ప్రజలకు వెంటనే మేలు చేయగలరు.

అలాగని, ప్రతిపక్షాలు ను తక్కువ చేసినట్టు కాదు. తాడిపత్రి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ గురించి, అలాగే ఇతరుల గురించి, మంచి కూడా రాశాము.

గత కధనం లో సూత్రాలు అందరికీ చెప్పాము, అందులో తెదేపా కు కూడా. ఇంచె కూడా ఎవరూ మారలేదు, ప్రతిపక్షాలు. అన్ని పార్టీలు బాగుకు సూత్రాలు పంపాము, ఎవరూ పాటించడం లేదు, తెలిసి కూడా. link.

ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి మాటలు, ఫేస్బుక్ లింక్ లో చూడగలరు.

అచ్చెన్నాయుడు గారు, బాగా మాట్లాడారు. కేవలం 50 శాతం మందికే ఉచితం, మిగతా ధనం పెట్టి కొనాలి. కానీ జగనన్న ప్రభుత్వం గమ్ముగా ఉండి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్ పెట్టిన తర్వాత, ఇప్పుడు తక్కువ సంఖ్య కు పెట్టారు అని. మనిషి బ్రతికి ఉంటే కదా, అమ్మ ఒడి, నాన్న ఆసరా అని.

మీరు లేదా ఏ పార్టీ నాయకులు అయినా, వీడియో లో మాట్లాడిన మాటలను, మీ సెక్రటరీ లేదా కార్యకర్తలు ఎవరన్నా, సోషల్ మీడియా పోస్ట్ తో పాటుగా, ఓ 4 తెలుగు ముఖ్య పాయింట్లు పెడితే, మీడియా కు అలాగే గూగుల్ సెర్చ్ కు, అభిమానులు కు బాగుంటుంది, అని 2 సంవత్సరాల క్రితం చెప్పాము.

మీరెవరూ ఆ జాగ్రత్తలు తీసుకోకుండా, మనకు వచ్చే ఉచిత పబ్లిసిటీ ని వదులు కుంటున్నారు. ఈరోజు రాజమండ్రి ఎంపీ పోస్ట్ చూడండి, స్పష్టంగా తెలుగు లో పాయింట్లు రాశారు వారే.

మరి ఈ ఆరోపణ ల లో, నిజం ఎంత ఉందో, వైకాపా తరపున ఎంపీ విజయ సాయి గట్టి జవాబు ఇవ్వాలని, అభిమానులు కోరుతున్నారు.

ప్రతిపక్షాలు, అలా పద్దతి గా విమర్శలు చేయాలి, ఎదుటివారు ఎంత రెచ్చిపోతున్న కూడా.

యనమల గారో లేక ఎవరో, చంద్రన్న సీఎం అయితే, ఏదో చేసేవారు కరోనా ను, అని చెప్పారు. అలాంటి మాటలు మాట్లాడుతూ, తెదేపా విలువ తగ్గించవద్దు.

పాశ్చాత్య దేశాలు అమెరికా, బ్రిటన్ లే చేతులు ఎత్తేసాయి, మొదటి వేవ్ లోనే. జనం వినే పరిస్థితి లో లేరు, ఎక్కడ కూడా, భూమికి భారం తగ్గించాలి అన్న సత్సంకల్పము తో. వారి ఆశయాన్ని సిద్దించనీయాలి కదా?

మా స్ధానిక చీరాల లేదా ఇతర పట్టణ పార్టీ ఫేస్బుక్ పేజీలు లో, స్ధానిక సమస్యలు, ప్రభుత్వ లేదా ప్రవేటు కరోనా వైద్యశాలల్లో అక్రమాలు, పోలీసు అనుమతి తో సందర్శంచి, ఫోటోలు తో పెట్టగలరు అంటే, ఇంతవరకు బీజేపీ, జనసేన, తెదేపా నాయకులు ఎవరూ ఆ సాహసం చేయడం లేదు.

అంటే అంతా బాగుంది అని మీరు ఒప్పకుంటున్నారా లేక మా స్ధానిక నాయకులు, బద్దకం తో ఇల్లు వదలరు లేదా గట్టి వారు లేరు లేదా, స్ధానిక ఫేస్బుక్ వాడకం తెలీదు, అని 2 ఏళ్లుగా గమ్ముగా ఉన్నారు.

లోకేష్ నైనా ఆంధ్రా లో ముందు ఉండి, పోరాటం చేయమని చెప్పగలరు.

గతంలో జగనన్న బయట ఉన్నారు అని, 40 ఏళ్ల ఇండస్ట్రీ కూడా బయట ఉంటారు, అనడం కరెక్టు కాదు. మన సంస్కారం మన నీతి మనదే.

అలాగే చంద్రన్న, లోకేష్, ఇతర తెదేపా నాయకులు, రాష్ట్రం బయట ఉన్నన్ని రోజుల, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జీతం ను, సీఎం సహాయ నిధికి ఇచ్చి, అధికార వైకాపా నాయకులు ను కూడా అదే చేయమని అడగగలరు, అని అభిమానులు కోరుతున్నారు.

ఇక అధికారంలోకి వచ్చిన కూడా, ప్రభుత్వ పధకాలు కు, మా కుటుంబ పేర్లు పెట్టమని, నొక్కి వక్కాణించి, వైకాపా నాయకులు ను అదే చేయమని అడగగలరు.

మన తెదేపా స్ధానిక నాయకులు ను, స్ధానిక ఫేస్బుక్ లో, ప్రజలను మీ కార్యకర్తలు ను, కరోనా సమయంలో బయటకు రాకుండా ఉండాలి అని, రోజూ బోధిస్తున్న ఫోటో లు వీడియో లు, పెట్టగలరు.

ఆఖరికి అమెరికా తానా నాయకులు కూడా, తెలుగు సంఘ ఎన్నికల కోసం, కరోనా ను లెక్క చేయకుండా, అమెరికా దేశం మొత్తం, గుంపులు గా తిరిగి ప్రచారం చేసారు, అధికార కాంక్షతో.

కాబట్టి, అన్ని పార్టీలు, కనీసం మన పార్టీ కార్యకర్తలు అయినా, కరోనా జాగ్రత్తలు పాటించాలి అని, స్ధానికంగా ప్రచారం చేయగలరు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1231 General Articles, 47 Tatvaalu
Dt : 08-May-2021, Upd Dt : 08-May-2021, Category : Politics
Views : 122 ( + More Social Media views ), Id : 1162 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : achennayudu , vaccine , questions , ycp , answer , tdp , social media , local issues , chandranna , babu , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content