ప్రజలతో మమేకం అవుతున్న, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, యువ ఎంపీ మార్గాని భరత్ రామ్ - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,824; 104 తత్వాలు (Tatvaalu) and views 225,174.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జనము తో కలిసి మెలిసే నాయకులు బహు కొద్ది మంది, ఎన్నికల తర్వాత, క్రుతజ్ఞతలు బాధ్యత, పార్టీ పరువు నిలబెట్టడానికి.

నేరు గా అధికారులతో కలసి, వార్డులు తిరుగుతూ, ప్రజల ఇళ్ళకే వెళ్ళి సమస్యలు తెలుసుకునే పరిష్కరించే, అనంత ధర్మవరం ఎమ్మెల్యేని చూసాం.

ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం యువ ఎంపీ గొప్పతనం చూద్దాం. ఈయన కార్యాలయము లోనే, అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలు తీర్చడానికి, తన వంతు క్రుషి చేస్తున్నారు. వీడియో కూడా చూడండి.

శభాష్ ఆదర్శ ఎంపీ గారు, జగనన్న పేరు నిలబెడుతున్నారు.

మిమ్మల్ని చూసి, ఇతర ఎంపీలకు బుద్ది రావాలి, వారు మారి, తమ బాధ్యతలను నిర్వర్తించాలి. సీనియర్లు అంటే, ఇంట్లో ఉండటమో దూరంగా వ్యాపారం చేసుకోవడమో కాదు, ప్రజలతో ఎక్కువ గా కలవాలి.

ఇతర యువ నాయకులు కూడా, ఎంపీ పదవి, అలంకార ప్రాయము కాదు, జనము తో కలసి, వారి హ్రుదయాల్లో, జగనన్న కు చిర స్థానం గా నిలిపే ప్రయత్నం చేయాలి.

మా బాపట్ల ఒంగోల్ ఎంపీలు మాదిరిగా, లక్ష జీతం సౌకర్యాలు తీసుకుంటూ కూడా, అతిధులుగా అప్పుడప్పుడు రాకుండా ప్రజల కన్నీరు తుడవడానికి, నిజమైన బాధ్యత గల నాయకుని గా హీరో లా, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వీలైనన్ని సమస్యలకు మార్గం చూపుతున్నారు.

మరి మీ ఎమ్మెల్యేలు ఇది చూసి, ఆనందపడుతున్నారో మిమ్మల్ని అనుసరిస్తూ లేక ఇంట్ళోనే కూర్చొని ప్రజలకు దూరముగా బాధపడుతున్నారో చూడాలి.

గ్రామ పట్టణ జిల్లా స్థానిక అధికారులతో, ప్రభుత్వ సోషల్ మీడియాలో జగనన్న పధకాల అమలు తీరు, మీ రాజమండ్రి పార్లమెంటరి స్థానము లో, జరిగేటట్లు చూడగలరు. ఇప్పటికే లింక్ లు ఉంటే, పంపగలరు.

****** ముందే ప్రజలకు మీడియాకు ఆహ్వానం :

శనివారం 08.05.2021 తేదీన గౌరవ రాజమహేంద్రవరం ఎంపీ, వైయస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ గారి కార్యక్రమాల వివరాలు.

ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు, గౌరవ ఎంపీ గారి కార్యాలయం నందు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక, రాజన్న రచ్చబండ కార్యక్రమంలో, ప్రజా విజ్ఞప్తులు స్వీకరిస్తారు.

కావున నాయకులు, కార్యకర్తలు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము.గమనిక : మాస్క్లు ధరించండి, సామాజిక దూరం పాటించి, ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యండి.

****** రాజమహేంద్రవరం, మే 7 శుక్రవారం జరిగిన కార్యక్రమ వివరాలు:

ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్న, ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారానికై, తాను దృష్టి సారిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ తెలిపారు.

శుక్రవారం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల, ఎంపి కార్యాలయంలో నిర్వహించిన, రాజన్న రచ్చబండ కార్యక్రమం, ప్రధానంగా ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి, ఎంపి భరత్ రామ్ ఎక్కువ దృష్టి పెట్టారు.

కేన్సర్, తలస్లేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, ఎంపి భరత్ రామ్ ను కలిసి తమ ఆర్ధిక ఇబ్బందులను ఏకరువు పెట్టారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలంటూ ఎంపిని అర్థించారు.

అలాగే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రచ్చబండలో ఎంపి భరత్ ను కోరగా, వెంటనే వారి వివరాలు నమోదు చేసుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయిస్తానని హామీ ఇచ్చారు.

రాజమహేంద్రవరం నగరంలోని స్టేడియం రోడ్డు, బైపాస్ రోడ్డు పై డ్రైనేజీ లోని పూడికను తొలగించి, రోడ్డు పైనే వేసి వదలివేయడంపై, నగర పాలక సంస్థ శానిటరీ శాఖ అధికారులకు, ఫోన్ చేసి సమస్యను వివరించారు.

ప్రస్తుతం కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో, పూడికను రహదారిపై అలా ఉంచడం మంచిది కాదని, వెంటనే ఆ పూడికను తొలగించేందుకు చర్యలు తీసుకోమని ఆదేశించారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,824; 104 తత్వాలు (Tatvaalu) and views 225,174
Dt : 07-May-2021, Upd Dt : 07-May-2021, Category : Politics
Views : 909 ( + More Social Media views ), Id : 1158 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bharat , ram , young , mp , rajahmundry , godavari , district , serving , supporting , helping , people , public , pilli , jagan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content