72 యక్ష ప్రశ్నలు, వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

యక్ష ప్రశ్నలు అంటారు, విన్నారా? మెదడుకు మేత, ఆధ్యాత్మిక గని. వేదసారం, ఆ ప్రశ్న జవాబు లోపల ఉంది, సుమా.

మహా భారతం లోని అరణ్య పర్వంలో, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, ధర్మరాజును పరీక్షించటానికి యమధర్మరాజు యక్షుని రూపంలో అడిగిన ప్రశ్నలే, ఈ యక్ష ప్రశ్నలు.

మన వ్యవహారికములో కూడా చిక్కు ప్రశ్నలను, సమాధానం కష్టతరమైన గట్టి ప్రశ్నలకు పర్యాయంగా, యక్ష ప్రశ్నలు అనే మాటను వాడతాము.

పాండవులు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ముందు నకులుడికి ఒక సరస్సు కనిపిస్తుంది. దానిలో దాహం తీర్చుకొని, నీటిని తన అన్నలకు తీసుకువెళ్లాలనుకుంటాడు.

అప్పుడు ఒక అశరీరవాణి/ యక్షుడు , నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే, నీటిని తాగు. లేకపోతే విగతజీవివి అవుతావు అని హెచ్చరిస్తుంది.

దీనిని పట్టించుకోకుండా , నలుడు నీటిని తాగి విగతజీవి అయిపోతాడు. అతనిని వెతుక్కుంటూ వచ్చిన సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా నీటిని తాగి విగతజీవులవుతారు.

చివరకు ధర్మరాజు తన తమ్ముళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. యక్షుడు మాటలు విని- ప్రశ్నలకు సమాధానం చెబుతాడు.

ఆ ప్రశ్నలు, జవాబుల సమాహారమే యక్ష ప్రశ్నలు.. అవి క్లుప్తంగా...

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ? బ్రహ్మం

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం

5. మానవుడు దేని వలన శ్రోత్రియుడగును? వేదం

6. దేని వలన మహత్తును పొందును? తపస్సు

7. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం

8. మానవుడు దేని వలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన

9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మృత్యుభయం వలన

12. జీవన్మృతుడెవరు? దేవతలకూ, అతిథులకూ, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు

13. భూమి కంటే బరువు/ భారమైనది ఏది? జనని /తల్లి రుణం

14. ఆకాశం కంటే పొడవైనది/ ఉన్నతమైనది ఏది? తండ్రి

15. గాలికంటే వేగమైనది ఏది? మనస్సు

16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది.

17. తృణం కంటే దట్టమైనది ఏది? చింత

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయటం వలన

21. జన్మించియు ప్రాణం లేనిది? గుడ్డు

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? రాయి

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? నది

25. రైతుకి ఏది ముఖ్యం? వాన

26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? స్వార్థం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు

27. ధర్మానికి ఆధారమేది? దయదాక్షిణ్యం

28. కీర్తికి ఆశ్రయమేది? దానం

29. దేవలోకానికి దారి ఏది? సత్యం

30. సుఖానికి ఆధారం ఏది? శీలం

31. మనిషికి దైవిక స్నేహితుడు / బంధువులెవరు? భార్య / భర్త

32. మనిషికి ఆత్మ ఎవరు? కుమారుడు

33. మానవునకు జీవనాధారమేది? మేఘం

34. మనిషికి దేనివల్ల సంతసించును? దానం

35. లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం

36. సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం

37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు

39. ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో

40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? యాగకర్మ

41. లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు

42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు

43. లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ఞానం

44. శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు

45. మనిషి దేనిని విడచి స్వ్రజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో...

46. తపస్సు అంటే ఏమిటి? తన వృత్తికుల ధర్మం ఆచరించడం

47. క్షమ అంటే ఏమిటి? ద్వందాలు సహించడం

48. సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం

49. సర్వధనియనదగు వాడెవడు? ప్రియాప్రియాలను సుఖ దుఃఖాలను సమంగా ఎంచువాడు

50. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించగలగడం

51. దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం

52. అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి ఉండటం

53. సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట

54. దుఃఖం అంటే ఏమిటి? అజ్ఞానం కలిగి ఉండటం

55. ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం

56. స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం

57. దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం

58. పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు

59. మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు

60. ఏది కాయం? సంసారానికి కారణమైంది

61. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం

62. డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం

63. ధర్మం, అర్థం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో

64. నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్ని, ధర్మ శాసా్త్రల్నీ, దేవతల్ని, పితృదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు

65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే

66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి

67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు

68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు

69. జీవితం మొత్తము మీద సుఖముగా ఉండే వాడు ఎవరు? ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు

70. ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతి రోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ, మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం

71. లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియయూ, సుఖమూ దుఃఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు

72. స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదుఃఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడై ఎవరైతే ఉంటాడో వానిని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 28-Nov-2019, Upd Dt : 28-Nov-2019, Category : General
Views : 3389 ( + More Social Media views ), Id : 232 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Yaksha prasnalu javabulu , yaksha questions and answers , dharma raju
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content