వినాయక చవితి పద్యములు/ శ్లోకములు/ దండకము/ మంగళాచరణము - ఓ బొజ్జ గణపయ్య నీ బంటు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1690 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1725 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఇంకొద్ది రోజుల్లో భాద్రపద శుద్ధ చవితి రాబోతోంది మరి. అందరం సిద్ధంగా ఉండాలి వినాయక పూజకు.

చిన్నవి మట్టి వినాయక విగ్రహాలే సుమా, రంగులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు. అసలు పసుపు ముద్ద, బెల్లం ముక్క, ఇంట్లో ఉన్న ఆకులు పువ్వులు చాలు సుమా.

మానసిక నైవేద్యం అతి ముఖ్యమైనది, భగవంతునికి ఇష్టమైనది, బీదవానికి కూడా అందుబాటులో ఉన్నది. కాబట్టి, నోటితో పాటలు పద్యాలు స్పష్టముగా పలుకుతూ పాడటము కూడా, మానసిక నైవేద్యం కిందకి వస్తాయి.

ఆ గంట సేపు, మదిలో చిన్ని వినాయకుని నిలుపుకుని, కన్నీళ్ళతో పాడాలి, పిల్లల చేత పాడించాలి. ఈ లోపు ఈ కింద ఇచ్చిన పద్యాలు పాటలు నేర్చుకోవాలి. పాడటం ఆరోగ్యం అని కూడా మనకు తెలుసు.

భక్తి సంగీతం మాత్రమే. బయట ఎన్ని డాన్సులు వేసినా, గుడి లో పూజలు చేసినా, మనకు మనము కూడా మనసుతో ఇంట్లో పూజ చేయనిదే, వ్రత ఫలము దక్కదు సంపూర్ణముగా.

అన్ని విఘ్నాలు తొలగించే గణపతి. శివుని పుత్రుడు, విష్ణువు కు మేనల్లుడు. ఏ దేవునికి పూజ చేసినా, మొదట వినాయక పూజ చేయనిదే, ఫలితము ఉండదు, ప్రధమ హవిస్సు నైవేద్యం హారతి వినాయకునిదే.

గణాధిపత్య పోటీలో గెలుపునకు, అన్ని పుణ్య నదులలో స్నానం చేసి, ప్రపంచం ను చుట్టి రమ్మంటే ముందుగా, భారీకాయం చిట్టి ఎలుక తో కష్టమైనా, తెలివిగా తల్లి దండ్రులు చుట్టూ తిరిగి, తమ్ముని ఓడించిన ఘనుడు. చూడండి అన్న దమ్ముల మధ్యలో కూడా, పద్దతిగా పోటీ పెట్టారు, పక్షపాతం చూపకుండా.

మరి ఇప్పుడు మనం శివయ్య మరియు గణేషుని భక్తులు గా, ముదుసలి తల్లి దండ్రులకు ఇస్తున్న విలువ ఏమిటి? ఇప్పుడైనా మానవత్వం ఉన్న మనుషులుగా మారదామా? లేదా నటన పూజలని ఒప్పుకుందామా, దాని ఫలితాలను చివరలో పొందుతాము సుమా. మనకు తెలుసు, పంచభూతాలు మనలను వదలవు అని, మరువద్దు.

మంత్రాలు రావు నోటి కి తిరగవు అనకుండా, వారం ముందు నుంచే ప్రయత్నం చేస్తే, పుస్తకాలు దేవులాడో లేక ఫోన్ లో చూసో, సాధన మొదలు పెట్టాలి.

పూజలు దేవుని కోసం కాదు, మన మనసు ఏకాగ్రత తో, నిగ్రహ సాధనకు మాత్రమే. మనల్ని పెంచిన తల్లి దండ్రులు సంతోషపడేది, మన మంచి గుణాలను చూసి, మన ఆస్తిపాస్తులు లేదా వారికి చేసే నమస్కారాలను బట్టి కాదు. తల్లి తండ్రి లాంటి దేవుడు కూడా అంతే కదా?

కళ్ళు చదువు తూ లేదా కళ్ళు మూసుకుని, గొంతుతో పాడే ప్రయత్నం చేసిన, ఉఛ్వాస నిశ్వాస నియంత్రణ తో, మనలో ఆధ్యాత్మిక భావం పెరిగి, అలాగే ధ్యాన ఏకాగ్రత కలుగుతుంది.

మరి, పిల్లలు పెద్దలు, ఈ పాట నేర్చుకోవాలి, పాడి మమ్మల్ని అందర్నీ, భగవంతుని తో పాటుగా ఉత్తేజ పరచి ఆనందింపజేయ ప్రార్ధన.

మన ఇంటికి మనమే బాలు సుశీల జానకి, గాత్రం ముఖ్యం కాదు, భక్తి మనసు ప్రయత్నమే ముఖ్యం.

ఇతరులు వినకపోయినా, మన గురువుల గొంతు వినడానికి, ఈ శిష్యుడు ఎప్పుడూ సిద్ధం.

మరి మంత్రాలతో పాటుగా, తేట తెలుగు లో ఉన్న, ఈ పద్యములు/ శ్లోకములు/ దండకము/ మంగళ హారతి ని కూడా నేర్చుకోవాలి, పాడాలి. మరి మాలాంటి శిష్యులకు అలాగే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి.

మన ధనం హోదా పదవి ఐశ్వర్యం, కరోనా ముందు దిగదుడుపే. కాబట్టి, పరమాత్మ అవసరం ఇప్పుడు అయినా తెలుసుకుందాం.

** వినాయక వ్రత కల్ప పద్యములు/ శ్లోకములు **

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం Shuklambaradaram Vishnu
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ Agajanana Padmarkam
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

గణానాం త్వా గణపతిం హవామహే Gananam Tva Ganapatim
కవిం కవీనా ముపమశ్రవస్తమమ్
జ్యేష్టరాజం బ్రహ్మణాం
బ్రాహ్మణస్పత ఆనం
శృణ్వన్నూతిభి స్సీద సాధనమ్
మహాగణాధిపతయే నమః

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ Bhavasanchita Papaugha
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ॥
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్ ॥
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ॥
ద్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః Sumukhaschaika dantascha
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, Namastubhyam Ganeshaya
ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్
వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.

** విఘ్నేశ్వర/ వినాయక చవితి పద్యములు, ప్రార్థన **

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ Tondamu nekadantamunu
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ toluta navighnamastanuchu
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత
నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయకా!

తలచెదనే గణనాథుని talachedane gananadhuni
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు atukulu kobbari palukulu
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

** శ్రీ వినాయకుని దండకము ** Sri vinayaka dandakamu

శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర, సత్పుణ్య చారిత్ర, భద్రే భవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు

నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు

నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు

నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెలన్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి

పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటి పండున్ మరిన్మంచివౌ ఇక్షు ఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్‌ జేసి,

విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ

యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ

శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగనూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై

బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః

** వినాయక మంగళాచరణము ** Sri vinayaka managalacharanamu

శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకును
వాసిగల దేవతా వంద్యునకును
ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకును
జయమంగళము నిత్య శుభమంగళమ్

నేరేడు మారేడు నెలవంక మామిడి
దూర్వార చెంగల్వ ఉత్తరేణు
వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు
పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

పానకము వడపప్పు పనసమామిడి పండ్లు
దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడి పండ్లు
మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు ॥జయ॥

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ల మీదికి దండుపంపు
కమ్మని నేయుయు కడుముద్ద పప్పును
బొజ్జ నిండుగ దినుచును పొరలుచును ॥జయ॥

వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు
కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసి(కొని)
దండిగా నీకిత్తు ధవళారతి ॥జయ॥

పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు
గంథాల నినుగొల్తు కస్తూరినీ
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున
పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు, భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు, కామరూపునకు శ్రీగణనాథునకు -
జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమున ఎల్లగజ వదనంబు
బాగైన తొండంబు వలపు కడుపు
జోడైన మూషికము పరకనెక్కాడుచు
భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥జయ॥

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు, తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు, బహుబుద్ధీ గణపతికి బాగుగాను -
జయమంగళం నిత్య శుభమంగళం  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1725 General Articles, 86 Tatvaalu
Dt : 31-Aug-2021, Upd Dt : 31-Aug-2021, Category : General
Views : 746 ( + More Social Media views ), Id : 1241 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vinayaka , ganesh , chaturdhi , chaviti , mangalacharanamu , bojjaganapayya , bantu , slokam , padyam , songs , harathi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content