గరుడ గమన తవ చరణకమల - తనువు పులకరించే విష్ణు గీతం మరియు అర్దము- శృంగేరీ భారతీ తీర్ధ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,130,233; 104 తత్వాలు (Tatvaalu) and views 239,556.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

అహా ఏమీ భాగ్యం ఈ పాట వినడానికి. ఆ పదాల అల్లిక ప్రాస చూడండి, ఎంత అర్ధాన్ని ఎంత గమ్మత్తు గా చెప్పారో, గురు స్వామి వారు.

నన్ను నా తాపముల నుండి, పాపములనుండి విముక్తుని చేయుము దేవా అంటూ, మనోహరముగా రాసిన అలాగె పాడిన పాటను, పలికే లేదా పాడే ప్రయత్నం చేయండి. వాక్సుద్ది కి మంచి పాట.

భాష పై పట్టు లేనిదే, అల్లిక ప్రాస పదాలు పట్టు తప్పుతాయి. మీరు పాడి అందరికి వినిపిస్తారు కదూ, నారాయణ భక్తులుగా?

సాధనతో ఖచ్చితము గా అన్ని పదాలు పలుకవచ్చును. తేలిక పదాలే, కానీ అల్లిక వరుస కారణముగా, ముందు కొంచెము ఇబ్బంది.

గరుడ గమన తవ, చరణ కమల మిహ, మనసి లసతు, మమ నిత్యం! - 2
మనసి లసతు, మమ నిత్యం!!
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ - 2

జలజనయన విధి,నముచిహరణముఖ, విబుధవినుత, పదపద్మ - 2 (1)
విబుధవినుత, పదపద్మ
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ 2

భుజగశయన భవ, మదనజనక మమ, జననమరణ, భయహారీి - 2 (2)
జననమరణ, భయహారీి
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ 2

శంఖచక్రధర, దుష్టదైత్యహర, సర్వలోక, శరణ - 2 (3)
సర్వలోక శరణ
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ 2

అగణిత గుణగణ, అశరణ శరణద, విదళిత సురరిపుజాల - 2 (4)
విదళిత సురరిపుజాల
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ - 2

భక్తవర్యమిహ, భూరి కరుణయా, పాహి భారతీ తీర్థం - 2 (5)
పాహి భారతీ తీర్థం
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ - 2

గరుడ గమన తవ, చరణకమలమిహ, మనసి లసతు, మమ నిత్యం ! 2
మనసి లసతు, మమ నిత్యం !!
మమతాపమ పాకురుదేవ! మమపాపమ పాకురుదేవ 2

అర్దము -

ఓ గరుడ వాహనుడా నీ పాదపద్మములు నా మనసునందు నిత్యము ఉద్దీపనము చేయుము. నన్ను నా తాపములనుండి నా పాపముల నుండి విముక్తి చేయుము.

1. పద్మనేతృడా బ్రహ్మేంద్రాది విబుధ గణముచే వినతులు పొందు పదపద్మములు కలవాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

2. ఆదిశేష తల్ప శయనా మన్మధుని తండ్రీ నా జనన మరణ భయములను తీర్చువాడా నన్ను నా తాపమములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

3. శంఖ చక్రధరుడా, దుష్టులైన రాక్షసుల నుండి సర్వలోకములకు రక్షణము కల్పించు వాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

4. లేక్కలేనన్ని సుగుణములు కలవాడా దీనులకు దిక్కైనవాడా దేవతల వైరులను దునుమువాడా నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

5. నీభక్తుడనైన ఈ భారతీ తీర్థుని మహా కరుణతో రక్షించుము. నన్ను నా తాపములనుండి పాపములనుండి విముక్తుని చేయుము.

Jagadguru Sri Bharati Tirtha Mahaswamiji, Sringeri Sharada Peetham - జగద్గురు శ్రీ భారతీ తీర్ధ మహా స్వామీజీ, శ్రీ శృంగేరీ శారదా పీఠం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,130,233; 104 తత్వాలు (Tatvaalu) and views 239,556
Dt : 24-Mar-2021, Upd Dt : 24-Mar-2021, Category : Songs
Views : 2495 ( + More Social Media views ), Id : 1049 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : garuda , gamana , tava , charanakamalamiha , lyrics , vishnu , song , anthem , bharati tirtha , Sringeri , Sharada , Peetham
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content