దైవ నామ స్మరణ వలన, లాభం? పిల్లల కు, రోజూ పనులు తో, 20 నిమిషాల ప్రార్ధన? - Devotional - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,579; 104 తత్వాలు (Tatvaalu) and views 226,090.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దైవ నామ స్మరణ వలన, లాభం ఉందా? 50 ఏళ్ల తర్వాత మాత్రమే దైవం అంటారు కొందరు, అప్పుడు దాకా ఉండాలి కదా? పిల్లల కు, రోజూ వారి పనులు తో పాటుగా, 20 నిమిషాల దైవ ప్రార్ధన, మంచిది కదా?

జవాబు, మన కళ్లు ఎదురు గా, అనిత్యమైన మానవ నాయక మరియు వెండితెర నటీ నటుల నామ స్మరణ, పాద సేవలు నిరంతరం జరుగుతున్నవి, మనం చూడలేదా? వారిని ఏమన్నా అంటే, ఊరుకుంటారా?

మంచి మార్పు కు, ఓట్లు కు అక్కరకు రాకపోయినా, పవన్ నామ స్మరణ క్రేజ్, యువతలో కాదనలేని నిజం.

చంద్రన్న, జగనన్న, తెలంగాణా చంద్రన్న, రాహుల్, మోదీ నామ స్మరణ జరుగుతూనే ఉంది కదా?

ఎప్పుడు అయినా, అనుచరులు ను అడిగారా, పై నాయకులు పదవులు కోసం, ప్రాకులాడితే, ప్రాసతో పలుకుతుంటే సాష్టాంగ పడి, మరి నువ్వెందుకు ఉచితం కు, గొంతు చించుకొని అరుస్తూ, రోడ్డు వెంట జనం మీదకు పోతావని?

వారి జవాబు కూడా, ఏదో ఒకరోజు నాకూ ప్రజాసేవ, పదవి దోచుకునే దాచుకునే అవకాశం వస్తుంది ఏమో, అని మనసులో మాట చెప్పవచ్చు.

కాబట్టి మానవ మాత్రుల, నామ జపం స్మరణతో నే, ఏదో వస్తుంది అని ఆశపడుతున్నారు కదా?

మరి సర్వాంతర్యామి అయిన దేవ దేవుని తలిస్తే, ప్రయోజనం ఉండదా? ఇహ మరియు పరలోకంలో మనస్ఫూర్తిగా త్యాగ బుద్ధి తో ఆచరణలో చేస్తూ ఉంటే?

ఇహంలో ఖచ్చితంగా కనీసం మనశ్శాంతి ఉంటుంది. అరిషడ్ వర్గాల కు ప్రపంచ భ్రాంతి కి దూరంగా ఉంచుతుంది. మాయా మోహం కు దూరంగా ఉంటే నే , నిరంతరం ప్రతిక్షణం ధ్యానం జపం నామస్మరణ కుదురుతుంది. లేకపోతే ఎంత ఎదిగినా, నేలను తాకడం, క్షణంలో పని.

ఇక పిల్లల కు, రోజూ 20 నిమిషాలు దైవ నామ స్మరణ తప్పకుండా అలవాటు చేయాలి. చేయకపోతే, వారి మనసు బలహీన పడి, ఎదిగిన తర్వాత సినిమా హీరో హీరోయిన్ ల నామస్మరణ తో, అలాగే మత్తు మందుల నామ భావ స్మరణ లో తేలియాడుతున్నారు, వార్తలు లో కదా.

ఇప్పుడు దైవం కు పూజకు, పిల్లల మనసులో స్ధానం తీరిక సమయం లేదు, కష్టం అండి, చదువు ఆటలు టీవీలు మాత్రమే అని గమ్ముగా ఉంటే, వారికి వయస్సు వచ్చిన తర్వాత, తమకు నచ్చిన స్మరణ లో మునుగుతారు కదా, ఎలాగైనా, తమ బలహీన మనసు ను బట్టి?

మొక్క అయి వంగనిది, మానైన తర్వాత వంగదు, మాట వినదు, దైవ భక్తి అనే కర్ర అంటు కట్టి, కాపాడుకోలేమా. ఆ బాధ్యత మనది కాదా?

చిన్న విషయాలకే అలగడాలు, పారిపోవడాలు, తగవులు, హత్య లు, ఆత్మహత్యలు యువతలో చూస్తున్నాము రోజూ.

ముందు 50-60 ఏళ్ల దాకా ఉంటామని, ఎవరికీ నమ్మకం లేదు. అప్పుడు దాకా ఉన్నా, అలవాటు లేని బండబారి మొద్దబారిన మనసు, మాట వింటుందా?

వారి వాట్సాప్ ఫేస్బుక్ లలో, కని పెంచి తిండి పెట్టిన తల్లి దండ్రులు ఫోటోలు తప్ప, మిగతా అందరివీ ఉంటాయి.

మొదట సినిమా జనం తో మొదలు అయి , తర్వాత ప్రేమ సందేశాలతో పెరిగి, ఆ తర్వాత రాజకీయ నాయకుల బొమ్మలు తో స్ధిర పడుతున్నారు. అదే మీ పిల్లలకు మంచిది అంటే, ఎవరము ఏమి చేస్తాము లే, మీ ఇష్టం మీ కష్టం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,579; 104 తత్వాలు (Tatvaalu) and views 226,090
Dt : 24-Feb-2021, Upd Dt : 24-Feb-2021, Category : Devotional
Views : 1006 ( + More Social Media views ), Id : 988 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : remember , chant , divine name , profit , children , daily puja , 20 minutes , prayer , benefit
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content