Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Edanthasthula Meda Idi - Yedanthasthula Meda - ANR, Sujatha, Jaya Sudha - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు
ఆస్తులు పాస్తులు లేకపోయినా, హాయిగా సంతోషముగా, పాలూ నీళ్ళలా, కలసి మెలసి తోడు ఉండే, కష్ట నష్టాలను ధైర్యముగా ఎదుర్కునే, గుణ జంటలు ఎన్నో ఉన్నాయి, ఎక్కువగా బీద వారిలో, ఆ తర్వాత మధ్య తరగతిలో. ధనం అధికారం ఆస్తి పెరిగేకొద్దీ, బంధాలు బీటలు వారుతున్నాయి.
భాగస్వామి ఉన్నా లేకపోయినా, పర్లేదు అంటున్నారు. అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లి తండ్రి కొడుకు కూతురు, ఎవరికీ ఎవరంటే లెక్కలేకుండా పోయింది. మేము ఎవరము మాట వినము, అనే దగ్గరికి వచ్చారు.
అప్పు చేసి ఎన్ని ఇళ్ళు, వ్యాపారాలు, ఆస్తులు కొందాము, ఎన్నో ఉద్యోగాలు చేసి వెనకేద్దాము అనే పరుగులలో, ఆలుమగల బంధాలు తెగిపోవడమే కాక, పుట్టిన బిడ్డలను కూడా కుసంస్కారులుగా పెంచుతున్నారు. తెలుగు రాసే, పలికే స్తితి లో కూడా లేని, క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని హీనులుగా పెంచుతున్నారు, తమకే కీడు చేయాలని. ఇక ముదుసలి తల్లి దండ్రులు అత్త మామల గతి అధో గతే.
అన్ని పోగొట్టుకుని, ఏమీ లేక పూరింట్లో పెంకుటింట్లో ఉంటూ, అదే 7 అంతస్తుల మేడ అనుకుంటూ, ఉన్న కాస్త ధనముతోనే నెట్టుకు వస్తు, ఉన్నదానితో కడుపు నింపుకుంటూ, ఈ ఆలు మగలు ఒకరికొకరు ఎలా ధైర్యం చెప్పుకుంటున్నారో చూడండి.
ఇదే మన ఆశల సౌధాల ఏడంతస్తుల మేడ, ఇదిగో అంతో ఇంతో వడ్డించిన విస్తరిది, తినడానికి కొనడానికి ఏమీ లేక పోయినా, ఎల్లప్పుడూ మనకు ఉన్నదొక్కటే. అదేమిటో తెలుసా, నాకు మీరు, మీకు నేను.
పడుచుతనపు ఉడుకును కలిపి, ఉన్న కాసిన్ని గంజి నీళ్ళు ప్రేమగా తాగిస్తుంటే, కుర్ర వలపు వర్ర తనంతో, నోటి రుచికి మిరపకాయ తినిపిస్తుంటే, కంటి నిండా నిద్రకు చాప కన్న చదరే మేలని, నేల మీదనే చతికిలపడి అతుకుతు ఉంటే, బాధ్యత బంధాలతో ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై, నిదరనే నిదర పొమ్మంటుంటే, ఇంతకన్నా అర్ధం చేసుకునే బంధం ఏమి ఉంటుంది. ఇదే మన వెన్నెల మల్లెల మంచమిది, ఎన్నో జన్మల పుణ్య లంచమిది, మూడు పొద్దులు మన ముద్దు ముచ్చటే, నాకు మీరు, మీకు నేను.
పాయసాన ఊరికే గరిటై తిరిగే, ప్రాపంచిక మోహాలలో పరుగులిడే, పాడు బతుకులెందుకు మనకు? పాలలోన నీరై కరిగే, గట్టి గుణ బంధమొకటి చాలును కడకు. కాదంటారా? పిరికితనముతో చావు కన్నా ధైర్యముతో జీవించే బ్రతుకే మేలని, జ్ఞానముతో తెలిసి కలిసి మనము మసులుతు ఉంటే, ఈ లోకములో ప్రేమకన్న పెన్నిధి లేదని, తెలుసుకో, మనసు నీదంటుంటే. ఎండ వానల ఇల్లు ఇది, ఎండని పూపొదరిల్లు ఇది, రేయి పగలు, ఆలు మగలే, ఒకరికొకరు తోడు, నాకు మీరు, మీకు నేను.
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది 2
ఏమీ లేక ఉన్నదొక్కటే...
నాకు మీరు.., మీకు నేను 2
పడుచుతనపు ఉడుకును కలిపి, గంజి నీళ్ళు తాగిస్తుంటే
కుర్ర వలపు వర్రతనంతో, మిరపకాయ తినిపిస్తుంటే - 2 సార్లు
చాప కన్న చదరే మేలని, చతికిలపడి అతుకుతు ఉంటే
ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై, నిదరనే..
ఏయ్ నిదరనే, నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ...
వెన్నెల మల్లెల మంచమిది.., ఎన్నో జన్మల లంచమిది
మూడు పొద్దులు, ముద్దు ముచ్చటే..
నాకు మీరు .., మీకు నేను 2 ||ఏడంతస్తుల||
పాయసాన గరిటై తిరిగే, పాడు బతుకులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే, బంధమొకటి చాలును కడకు - 2 saarlu
చావు కన్నా బ్రతుకే మేలని, తెలిసి కలిసి మసులుతు ఉంటే
ప్రేమకన్న పెన్నిధి లేదని, తెలుసుకో..
ఏయ్ తెలుసుకో, మనసు నీదంటుంటే ఏ ఏ ఏ...
ఎండ వానల ఇల్లు ఇది, ఎండని పూపొదరిల్లు ఇది
రేయి పగలు, ఆలు మగలే...
నాకు మీరు.. మీకు నేను 2 ||ఏడంతస్తుల||
చిత్రం: ఏడంతస్తుల మేడ (1980); సంగీతం: చక్రవర్తి; గీతరచయిత: వేటూరి; నేపధ్య గానం: సుశీల
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2269 General Articles and views 2,600,375; 104 తత్వాలు (Tatvaalu) and views 277,571
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments