లలిత హారతి / Lalitha Harathi - బంగారు తల్లికిదే నీరాజనం - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1691 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1726 General Articles, 86 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sri Chakrapuramandu stiramaina Sri lalitha pasidi padalakide nirajanam
Paramesvaruni punyabhagala rasi a simha madhyaku ratna nirajanam
Bangaru tallikide nirajanam

శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం 1
పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు రత్న నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయకూ నీరాజనం 2
శ్రీ గౌరి శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహసనేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

కల్పతరువై మమ్ము కాపాడు కరములకు, కనకంబు కాసులతో నీరాజనం 3
పాశంకుశా పుష్ప బాణ చాపధరికి , పరమ పావనమైన నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కల్యాణ సూత్రమునకు నీరాజనం 4
కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

చిరునవ్వులోలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం 5
కలువ రేకులవంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

ముదమార మోమున ముచ్చటగా ధరియించు కస్తూరి కుంకుమకు నీరాజనం 6
చంద్రవంకను శిరోమకుటముగా దాల్చు సౌందర్య లహరికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహలక్ష్మికిదే నీరాజనం 7
శృంగేరి పీటమున సుందరాకారిణి శారదా మాయికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం 8
జన్మ జన్మల తల్లి జగదీశ్వరీ నీకు భక్తి జనులిచ్చేటి నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిదే నీరాజనం 9
ఆత్మార్పణతో నిత్యనీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం
బంగారు తల్లికిదే నీరాజనం

అంబ నీకిదిగో మంగళం త్రికాలమందు దేవి నీకిదిగో మంగళం

Lalitha Harathi Sri Chakrapuramandu stiramaina Bangaru tallikide nirajanam  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1726 General Articles, 86 Tatvaalu
Dt : 01-Dec-2022, Upd Dt : 01-Dec-2022, Category : Songs
Views : 118 ( + More Social Media views ), Id : 1630 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lalitha , harathi , chakrapuramandu , stiramaina , bangaru , tallikide , nirajanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content