Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
చిన్న సినిమాలలోనే కధ కు బలం ఉంటుంది, వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, మన ఇంట్లో కధలాగే ఉంటుంది. కె. ప్రేమ్ రంజిత్ నిర్మాత, దర్శకుడు ఈరంకి శర్మ ల జన్మ ధన్యము, విలువలతో కూడిన ఉత్తమ చిత్రం. లింక్ లో సినిమా ఉంది చూడగలరు.
పెళ్ళి కోసం తపించిపోయిన, ఆ తరం ఆడపిల్లలల జీవితం - నాలాగ ఎందరో. కష్టాలు అన్ని కలబోస్తే, ఏలా ఉంటుందో తప్పకుండా ఈ చిత్రం చూస్తే అర్ధం అవుతుంది. అన్ని చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే, విధి వెక్కిరిస్తే ఎన్ని కన్నీళ్ళు మనల్ని వెంటాడతాయో చూపిస్తుంది.
విలువలు గల అక్క, కాలు జారిన చెల్లి, వీరికి పెళ్ళి చేయాలని బతుకు పోరాటం చేస్తున్న దివ్యాంగుడు నాన్న, కాటేయాలని చూసే బావ, నీతిగల కళ్ళులేని స్నేహితుడు, అబద్దలుతో ఏదో ఒకటి తెచ్చి కట్టబెట్టాలని పెళ్ళిళ్ళ పేరయ్య, నీతిగానే ముందుగానే తమ లోపాలను చెప్పిన అబ్బాయిల పెద్దలు, ఇలా మన చుట్టూ తిరిగే కధలే.
నేడు కూడా మగ, ఆడ లో పెళ్ళి కోసం, అలాగే పిల్లల కోసం పరితపించేవారు ఉన్నారు. చిత్రం ఏమిటి అంటే, పెళ్ళి అయినవారు మరియు పిల్లలు ఉన్నవారు, తర్వాత ఆ కష్టాలు తగవులు అరుపులు భరించలేక, తలపట్టుకు కూర్చున్న వారూ ఉన్నారు, పారిపోయిన వారూ ఉన్నారు, ముదుసలి తల్లి దండ్రులను నిర్దయగా దూరంగా విసిరేసారు, ఎందుకంటే ఎక్కువ గుణ సంబంధం కాని అవసర అవకాశ పెళ్ళిళ్ళు కాబట్టి.
నాలాగ ఎందరో 1978, మే 8న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రేమ్ రంజిత్ నిర్మాణ సారథ్యంలో ఈరంకి శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, ఎమ్మెస్. విశ్వనాధన్ సంగీతం అందించాడు. 1978 నంది అవార్డులులో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (హేమసుందర్) అవార్డులతో పాటు ఈ సినిమాలోని పాటలకు ఉత్తమ నేపథ్య గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకు తొలి నంది అవార్డును వచ్చింది. మొత్తం 7 అవార్డులు.
1) అనుభవా..లకు, ఆ.ది కా.వ్యం, ఆ.డదా.ని జీ.వితం.
అందులో.ని. ప్రతి మలుపూ.., ఆశ నిరాశల నిట్టూ.ర్పు.. ||అనుభవాలకు||
వా.వి వరుసలు, మనసుకు కా.వమ్మా
మనుషులు అల్లిన, మాటల వలలమ్మా - 2 సార్లు
వే.టగాడికి వలపుండదమ్మా, లోబడితే నీ. బ్రతుకుండదమ్మా
నీ కథలో.. ఇది, ఒక తొలి మలుపు
నిను కన్నవారికి, మేలుకొలుపు. ||అనుభవాలకు||
రచన: ఆత్రేయ, గానం: SPB
2) రచన: ఆత్రేయ, గాయని: సుశీల
అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం
అందులో ఇది మొదటి వాక్యం
ముందు రాగల కథకు భాష్యం
దేవుని రాతలు మనుషుల ఆశలు
కలసిన నాడు కళ్యాణ యోగం
కలసిన హృదయాల కల్యాణి రాగం
చిన్నతనాన చిరు హృదయాన
పెద్దలు నాటిన వావీవరుసలు
కన్నెతనాన కన్నులు కలసిన
తొలి నిముషాన తొడిగెను మొగ్గలు
ఇంకా నీకీ సిగ్గెందులకు?
నీ సిగ్గే అందం అతని కళ్ళకు
నింగిని అంటే పొంగుల వయసును
నేలను ఏలే ఊహల మనసును
దేవుడు ఎపుడో రాసున్నాడని
దీవించి కలిపింది మన సంప్రదాయం
మనసుకు చాలమ్మా మమకారం
తనువుకి కావాలి మంగళ సూత్రం
చిత్రం: నాలాగ ఎందరో? (1978), సంగీతం: MS. విశ్వనాథన్
జి. నారాయణరావు, రూప, హేమసుందర్, పి.ఎల్. నారాయణ
Naalaaga Endaro Anubhavalaku Adikavyam Aadadani Jeevitam Narayana Rao, Roopa, Hema Sundar
Anubhavalaku Adikavyam Aadadani Jeevitam (Lyrics: Acharya Aatreya)
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,498; 104 తత్వాలు (Tatvaalu) and views 266,160
Dt : 02-Dec-2022, Upd Dt : 02-Dec-2022, Category : Songs
Views : 943
( + More Social Media views ), Id : 1631
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
naalaaga ,
endaro ,
anubhavalaku ,
adikavyam ,
aadadani ,
jeevitam ,
narayana ,
roopa ,
hemasundar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments