అపాయమ్ము దాటడానికుపాయమ్ము - మత్తు వదలరా నిద్దుర మత్తు (శ్రీకృష్ణపాండవీయం) - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,001; 104 తత్వాలు (Tatvaalu) and views 224,449.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sri Krishna Pandaveeyam - Apayammu datadaniki, Mattu Vadalara - NTR, Udaykumar, Varalakshmi, Kosaraju, Ghantasala

సామాజిక చైతన్య బాధ్యతగా, అరిషడ్వర్గం అష్టవ్యసనం కు దూరంగా ఉండమని వేడుకుంటూ, ఇలాంటి పాటలు కూడా మనము పాడాలి, మాటలు రాయాలి, ప్రచారం చెయ్యాలి. తల్లి దండ్రుల సంస్కార పెంపకం ఉన్న ప్రతి ఒక్కరు, వీటిని పది మందికి పంపి, వారి ఆరోగ్యం రక్షణ కోరతారు.

ఇది నిస్వార్ధ మానసిక, శారీరక దైవ నైవేద్యం. ఇది మానవ సేవ మాధవ సేవ కిందకు వస్తుంది, నరుని సేవ నారాయణ సేవ. ఇవి లేకుండా, కపట నటన 2 నాల్కల ధోరణి పూజలు యాత్రలు సున్నా ఫలితమే కాకుండా, పాపము కూడా పెరుగుతుంది నిర్లక్ష్యం లెక్కలేని తనం, ధన లక్ష్మిని అవమానించినందుకు. ఇంట్లో ఒకరు తాగినా మత్తులో ఉన్నా, చూస్తూ ఉన్న, మిగతా కుటుంబ సభ్యులు కూడా, ఆ పాపానికి బాధ్యులే.

భీముడు కాపలా కర్తవ్యాన్ని మరచి కునుకు తీస్తూ ఉంటే, పెద్దాయన వేషంలో క్రిష్ణయ్య మేలుకొలుపుతూ కర్తవ్యాన్ని భోదిస్తారు.

నిద్ర లేదా ఏదైనా మత్తు లేదా నిర్లక్ష్యం వలన, ఎంత నష్టమో, చాలా బాగా వివరిస్తూ, ముద్దు గా మనందరికీ జ్ఞాన బోధ చేస్తారు.

మత్తు అంటే నిద్ర ఒకటే కాదు. బుద్ధి హీనత కూడా, మందు, మాదకద్రవ్యాలు, మోహం, మైకం, మాయ, తెలివితక్కువ తనం, బద్దకం అన్ని అర్థం వస్తాయి.

ప్రాపంచిక మోహం, అరిషడ్వర్గం, అష్టవ్యసనం కూడా మత్తు నే, 60 ఏళ్ళ తర్వాత, బయటకు వస్తే ఆ మత్తులో నుంచి, తోడు ఎవరు ఉండరు, కన్న బిడ్డలే బయటకు నెడతారు. ఆఫీసు, స్నేహితులు, బంధువులు అయినా అంతే. మనకు శరీర అవయవాలు కూడా, రోగాలతో లేదా నిస్సత్తువ తో కదలవు.

ఇది నేటికీ, ఏనాటికీ అయినా, అందరికీ కావాలసిన పాటే మంచి బోధనకు. అచ్చ తెలుగులో, సరళమైన పదాల భగవద్గీత, సామాన్యుల కొరకు.

పెద్దల మాట చద్ది మూటలాగా, ఇది ఎంతో విలువైనది. అన్నగారి హావభావాలు నటన అపూర్వం, ఇంకొకరికి సాధ్యం కానే కాదు.

మీరు మనలాగనే మన సొంత గొంతు తో, శ్వాసక్రియ సాధనకు పాడి వినిపిస్తారు కదూ. అలాగే పాట అర్థం ను నిద్ర/ మత్తు/ మైకం జీవులకు వివరిస్తారు కదూ . .

అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు


మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా - 2
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా||మత్తు వదలరా||

జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు - 2
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు - 2
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు ||మత్తు వదలరా||

సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగక పోతే ఊరక చతికిలబడి పోదురు
కండ బలము తోటే ఘన కార్యము సాధించలేరు
బుద్ధి బలము తోడైతే విజయమ్ము వరింపగలరు
||మత్తు వదలరా||

చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా - 2
పిరికితనము కట్టిబెట్టి, ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు - 2
చెప్పడమే నా ధర్మం వినక పోతే నీ ఖర్మం ||మత్తు వదలరా||

Lyrics: Mattu Vadalara - Sri Krishna Pandaveeyam, Ghantasala for NTR, Udaykumar, Writer Kosaraju Raghavaiah, 1966

Sri Krishna Pandaveeyam, apayammu datadaniki, Mattu Vadalara, ntr, udaykumar, kosaraju, ghantasala
ఎన్టీఆర్, ఉదయకుమార్, వరలక్ష్మి, కొసరాజు, ఘంటసాల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,001; 104 తత్వాలు (Tatvaalu) and views 224,449
Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019, Category : Songs
Views : 8175 ( + More Social Media views ), Id : 118 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Krishna , Pandaveeyam , apayammu , datadaniki , Mattu , Vadalara , ntr , nidra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content