అద్భుత మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ - తక్కువ ఖర్చు, ఉత్తమ వైద్యం, నమ్మకం, సకల పరీక్షలు - వెళదాం రండి - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,957,012; 104 తత్వాలు (Tatvaalu) and views 231,110.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

గతము లో మంగళగిరి ఎయిమ్స్ సదుపాయాలు, చార్జీలు, ప్రవేశ అర్హతలు, సౌకర్యాలు గురించి కధనము రాశాము, సరిగ్గ ప్రచారము తెలుగు వారికి అందుబాటులో లేదని, ఎవరూ సమాధానం చెప్పలేదు. లింక్ చూడగలరు. link.

బీజేపీ నాయకులతో ఉన్న పెద్ద తలనొప్పి ఇదే, చేసిన పని కూడా, సరిగా వివరముగా చెప్పి, ప్రజలలోకి తీసుకుని వెళ్ళరు.

* కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం. వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు చూడండి, నిజము వారిని కనుక్కోగలరు. Aiims Mangalagiri - Website, facilities, tests and Contact Numbers.

ప్రవేటు ఆసుపత్రులతో ఇంకా మోసపోకండి, అనవసరపు చార్జీలు పరీక్షలు. దూరాభారము పోవాల్సిన పని లేదు. బ్రహ్మాండమైన సదుపాయాలు ఉన్నాయి, వీడియో చూడండి. అత్యుత్తమ అతి పెద్ద ఆసుపత్రి, తక్కువ పరీక్ష ఖర్చులు, నమ్మకమైన వైద్యం, ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజలు కూడా ధైర్యముగా వెళ్ళ వచ్చు, హైదరాబాద్ చెన్నై అవసరము లేదు. ఇప్పుడు కోవిడ్ వాక్సిన్ కూడా ఇస్తున్నారు.

గత 2 నెలలుగా జరుగుతున్న, కొన్ని కార్యక్రమాలను చూడండి.

* Conducted cancer awareness campaign, screening and counselling programmes on 4th February, the World Cancer Day. కాన్సర్ జాగ్రత్తలు గురించి ప్రచారము, పరీక్షలు, సలహాలు, ఫిబ్రవరి 4 వ తేది, ప్రపంచ కాన్సర్ దినం సందర్భముగా.

* Campus Tour, vaccine, self Brest cancer check up Videos. కాంపస్ టూర్, అంటే భవనాలు వైద్యం, వాక్సిన్, రొమ్ము కాన్సర్ స్వయము గా పరీక్షించుకోవడము వీడియోలు చూడండి. - Feb 21

* The #worldhearingday2021 was celebrated by the department of ENT. IEC material on newborn hearing and noise-induced hearing loss was released by honorable Director Dr. Mukesh Tripathi, Dr. Joy A. Ghoshal and Dr. Rakesh Kakkar. A screening program for Ear are was also conducted. - March 3rd.
ప్రపంచ వినికిడి రోజు సందర్భముగా, చెవికి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయు, మార్చ్ 3 న.

* #COVID19 #CovishieldVaccine is available - March 8, కోవిడ్ వాక్సిన్ అందుబాటులో ఉంది.

ఇప్పుడు సోషల్ మీడియా లో ఓ పోస్ట్ తిరుగుతుంది, మరి ఎంత వరకు కరెక్టో మనకు తెలీదు, మీకు తెలిసిన మాకు తెలియచేయ గ్. ఈ రేట్లు చూడండి ఎంత అందుబాటులో ఉన్నాయో. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఒకసారి వెళ్ళి అన్ని కనుక్కుని తిరిగి రావచ్చు, సదుపాయాలు చూడటానికి, ఇరుగు పొరుగుకు చెప్పవచ్చును.

మంగళగిరి ఎయిమ్స్ యొక్క, యూజర్ చార్జీలు -

* అద్భుతమైన హాస్పిటల్, అతితక్కువ చార్జీలు, ఓపీ కేవలం పదిరూపాయలు, ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో (ఎముకలు), కన్ను, చెవి, ముక్కు, స్కిన్ (చర్మము) లాంటివి చూపించుకోవచ్చు.

* న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు, అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు అంటున్నారు.

* అలాగే కాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం, 75 రూపాయలకే.

* బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు, కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే.

* విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి. లేదా మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు. ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు.

* అత్యంత శుభ్రత, డాక్టర్స్ కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు అంటున్నారు.

USER CHARGES: AIMS MANGALAGIRI
Consultation Fee - Rs.10
Complete Blood Count (Hb%, TLC, DLC) - Rs.135
Fasting & Random Blood Sugar- Rs.24+24
Liver Function Test - Rs.225
Kidney Function Test - Rs.225
Lipid Profile - Rs.200
Thyroid profile - Rs.200
ECG - Rs.50
Chest X-Ray - Rs.60
Mammography -Rs.630
Ultrasonography - Rs.323
Urine Analysis - Rs.35
HIV Rapid Test - Rs.150
HBs Ag Rapid Test - Rs.128
The other available tests rates are with Billing section ( Counter No 06).  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,957,012; 104 తత్వాలు (Tatvaalu) and views 231,110
Dt : 19-Mar-2021, Upd Dt : 19-Mar-2021, Category : Health
Views : 5260 ( + More Social Media views ), Id : 1044 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mangalagiri , aims , hospital , healing , tests , medical , facilities , ent , kovid , corona , cancer
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content