మీకు చేసిందే గాక, మీ పిల్లలకు, మా ముదుసలితనం? అమ్మ ప్రశ్న- అమ్మ అన్నది Parody - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,392,281; 104 తత్వాలు (Tatvaalu) and views 258,560.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఎన్ని ఏళ్ళు లేదా తరాలు అయినా, మరువలేని ది ఈ పాట. పాత పాటల్లో, స్వరమునకు పదాలకు రాగాలకు మొదటి ప్రాధాన్యత, సంగీతం కు తర్వాత ప్రాధాన్యత. ఇప్పుడు కఠోర సంగీత ధ్వని కి మొదటి తాంబూలం. ఈ రోజుల తో పోలిక గమనించండి, వీడియో పాట కూడా వినండి చూడండి.

1. విదేశాలలో లేదా దేశం లోని నగరాలలో నేడు: ఎక్కువ మంది ఎన్నారై లకి లేదా ఉద్యోగులకి లేదా డబ్బు గల వారికి పనిమనుషులు దొరకడం కష్టం, జీతాలు ఇబ్బంది కూడా. కాబట్టి, కన్న తల్లి(తండ్రి అయినా అంతే) నోరు ఎత్తకుండా విసుక్కోకుండా నమ్మకంగా పని చేసే అంగడిలో దొరకని పని దేవత(కానుపులు, ఇంటిపని, వంటపని, తోటపని, చెత్తపని, కడిగేపని, పిల్లల పెంపకం/కాపలా). అమృతమూర్తి తల్లి తో ఉచిత సేవ చేయించుకోవచ్చు లేదా సొమ్ము మిగుల్చుకోవచ్చు.

2. మిగతా భారతం లో నేడు - ఫీజ్ సొమ్ము వచ్చిందాకా, పెళ్ళి అయిందాకా, అవసరాలు తీరిందాక, ఇదే పాట, ప్రతి నోట, సినిమా నటులనే మరిపించే బిడ్డల అవకాశవాద నటన.

60 వచ్చినా లేక జబ్బు చేసినా, వీలైతే డబ్బులు విదిలించి, పని మనిషితో లేదా చుట్టాలతో
లేదా ఆశ్రమమే దిక్కు మరల ఇదే పాటతో, పై ఇద్దరు నూ.

అసలు వదిలేసే, వారి సంగతి ఇప్పుడు వద్దు లే.

3. పాతకాలం, పిచ్చి రోజులలో నాడు, అసలు పాట ఇది:

అమ్మ అన్నది ఒక కమ్మని మాట | అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
||అమ్మ అన్నది || మమతల మూట

దేవుడే లేడనే మనిషున్నాడు | అమ్మే లేడనువాడు అసలే లేడు - 2 సార్లు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు | తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు ||అమ్మ అన్నది ||

అమ్మంటే అంతులేని సొమ్మురా | అది ఏ నాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా | అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా ||అమ్మ అన్నది ||

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే | అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే - 2 సార్లు
అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది | అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది
అమ్మ అనురాగం ఇకనుంచి నీది నాది ||అమ్మ అన్నది ||

అమ్మ అన్నది పాట , ప్రతి పదం లో ఎంతో అర్థం ఉంది. దగ్గర పెట్టకోవాలి ముదుసలి వారిని.

Amma Annadi Oka Kammani Maata(SPB AND VASANTHA,దాశరథి) - Bullemma Bullodu - 1972 - Telugu Lyrics/తెలుగు సాహిత్యం Chalam, Vijaya Nirmala, Vijaya Lalitha

*మీకు చేసిందే గాక, మీ పిల్లలకు సేవా, మా ముదుసలితనం లో? అమ్మ సూటి ప్రశ్న - అమ్మ అన్నది ఒక కమ్మని, బుల్లెమ్మ బుల్లోడు, Parody*

అమ్మా ఆరోగ్యముగా ఉన్నావా? ఏమ్మా, పర్లేదు, బాగానే ఉంది, తల్లి జవాబు.

ఏమీ లేదమ్మా, బాగోక పోతే, అపోలోలో చూపిద్దామని. ఎందుకమ్మా అంత ఖర్చు ఇప్పుడు, తల్లి ప్రశ్న.

లేదమ్మ, తర్వాత నీకు బాగోపోతే, ఇంకా ఎక్కువ ఖర్చు, అందుకు అడిగా.

సరె బిడ్డా, అసలు విషయం చెప్పు, అవి తర్వాత,

ఏమి లేదమ్మ, వచ్చే నెల డెలివరి, మాకు పని మనుషులు దొరకరు, విదేశం లో, నువ్వు రావాలి, నీ తర్వాత మా అత్త వస్తుంది, పిల్లల సేవకు. ఓ సంవత్సరం పాటు మీకు, రాత్రి పగలు మా సేవ చేసుకునే భాగ్యం కలిగిస్తాము. పిల్లలకు కాకపోతే, ఎవరికి చేస్తారు?

నాన్న ను వదిలి రాను, నాకు కీళ్ళు ఒళ్ళు నెప్పులు కూడా, తల్లి జవాబు

అదేమిటి అమ్మా, రానంటావు, పుట్టింటి వారి బాధ్యత కదా, శాస్త్రం సాంప్రదాయం కదా?

మీ వదిన ముంబాయి తీసుకు వెళ్ళింది, వెట్టి చాకిరి చేయించి పంపింది, సగం వయసు అయిపోయింది. సాంప్రదాయం అంటే, నువ్వు పుట్టింటికి ఇక్కడకు రావాలి, మేము అక్కడకు కాదు. కానీ మీ సంపాదన సౌకర్యాలు విలాసాలు తగ్గ కూడదు. మా ముదుసలి వాళ్ళం విమానాలలో చావాలి, అదేనా మీ ఆలోచన? మరి మీ నాన్నకు దిక్కు ఎవరు?

నాన్న సంగతి దేవుడెరుగు, అక్కడే టీవీ సినిమా చూస్తూ పడి ఉంటారులే. నేను మా ఆయనతో నే ఉంటా, కానీ నువ్వు నాన్న ను వదిలి రావాలి. వస్తే ఆయనను రమ్మను, ఇక్కడ కాపలాకు కావాలి, మా ఆయనతో సరుకులు తేవడానికి, పిల్లలను ఆడించడానికి ఉపయోగమే కదా.

అక్కడే ఎవరినో చూసుకోవే, కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఇద్దరూ ఉద్యోగాలే కదా? అమ్మ ప్రశ్న

ధనం సమస్య కాదమా, పనిమనిషి దొరికినా, పిల్లలను ఆడించి, సమయానికి వెళ్ళి పోతుంది. ఇల్లు చిమ్మి, అంట్లు కడిగి, అన్నం కూర వండి, తోట పని చేసి, రాత్రి పగలు గొడ్డు చాకిరీకి ఒప్పుకోరు. అదే నువ్వు అయితే, వాటితో పాటు గా ఇంటి బండలు కార్పెట్ కూడా, తుడుస్తావు, బూజు దులుపు తావు. ఇంకోటి వారికి నెలకి ఇచ్చే జీతం తో నీకు విమాన టిక్కెట్ వస్తుంది. మిగతా 5 నెలల ధనం మిగిలినట్లే, మేము ఇంకో 3 ఇళ్ళు కొనవచ్చును.

అమ్మాయి, మీకు చేసింది కాకుండా, మరీ మీ పిల్లలకు కూడా చేయమనడం, అదీ మీ ధనం మిగిల్చుకోవడానికి, మమ్మల్ని పని మనుషులు గా తిప్పడం, బాగోలేదు. రేపు, మాకు 60 వచ్చి, రోగము లో ఉంటే, మీ దగ్గర పెట్టుకుని చూస్తారా?

అమ్మో అలాంటి ఆశలు పెట్టుకోకు, నాన్నకు గట్టి గా చెప్పు. ఇక్కడ డబ్బులు మిగలడమే, ఆస్తులు పెంచడమే, మా లక్ష్యం. మా చుట్టూపక్కల అంతా, అవసరం అవకాశం ధనం ఆస్తులు సంపద, ఈ మనుషులు ఈ మాటలే. మా లో ఒకరు పోయినా కూడా, మా కమ్యూనిటి వారే, గో ఫండ్ లో ప్రచారం చేస్తారు, ఇంటి మరియు పిల్లల ఖర్చుకు. బంధాలు సేవలు త్యాగాలు అన్న మాటలు మన ఇంటా వంటా ఉందా? మన అమ్మమ్మ తాత గతి, ఏమిటో చూసాము కదా? మీరు దగ్గర ఉంచి చేసారా, మమ్మల్ని వారితో ఉండనిచ్చారా?

మిమ్మల్ని ఇక్కడ ఎవరు భరిస్తారు. అందరికీ మీకు ఇక్కడ పడదు, ఉండరు, దేశభక్తి అని అబద్దాలు చెపుతున్నాము ఇద్దరము. ఏ ఒక్క చవటకూడా, మరి మీకు దేశభక్తి లేదా, ఇక్కడనే పోతారా అని అడగరు. ఎందుకంటే, అందరూ, మా లాంటి దొంగలే. నీతి నియమమ, నీటి మీద రాతలు. మొక్కుబడి దేవుడు పూజలు అంతే.

మీకు మన టౌన్ లోనే, చుట్టాలు లేదా పని వారి అండ ఇస్తాము. లేదా వ్రుద్దాశ్రమము లో పడేస్తాము దర్జాగా లక్ష కట్టి. అంతే గానీ మాతో ఉంచుకోము. ఇంకో కొత్త మార్గం వచ్చింది అంట, మా ఇంటి కింద బేస్మెంట్ లో మీరు పడి ఉంటే, మా సేవ చేసుకుంటూ, ఓ పని మనిషిని పెట్టి మీకు సేవ చేపిస్తాము, ఒకవేళ అందరు చుట్టాలు ఆడి పోసుకుంటే, మాకు మీతో ఉపయోగం ఉందని అనిపిస్తే. అంతే గానీ మాతోనే ఉండి, మాతో రోజూ తిరగాలి చెయ్యిపట్టుకుని అన్న ఆలోచనులు చెయ్యకు.

ఓహో, ముందే జాగ్రత్తలు చెపుతున్నావా. నాకు నా భర్తే ముఖ్యం. నేను కూలికి వచ్చి మీకు చేసిందే గాక, మీ పిల్లలకు చెయ్యాల్సిన పని లేదు. శాస్త్రం తెలిస్తే, ముదుసలి వయస్సులో కూడా, మీ ఇంట్లో పెట్టుకుంటాము తుదిశ్వాస దాకా అని, 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి, చుట్టాలతో సంతకాలతో, రెజిస్ట్రషన్ చెపిస్తే, మీ సేవ కు వస్తాము. లేదంటే, ఇంక ఈ విషయము గా ఫోన్ చెయ్యకు. దేశాలు రాష్ట్రాలు తిరిగే ఓపిక లేదు. అని అమ్మ ఫోన్ పెట్టేసింది.

అమ్మ అన్నది ఒక కమ్మని అండ | మన కష్టాల దూరంకు అవసరం నిండా
||అమ్మ అన్నది || అవసరం నిండా

పనిమనిషి దొరకని పిల్లలున్నారు.. | అమ్మకష్టం వద్దనువారు లేనేలేరు.. - 2 సార్లు
తల్లికష్టం దోచుకుంటున్న పెళ్ళైన పిల్లలు | తల్లినికష్టంలో వదిలే వారేరాక్షసులు
ఆ తల్లి సేవ చేసుకునే, బ్రతుకే బ్రతుకు ||అమ్మ అన్నది ||

అమ్ముంటే మనశ్శాంతి కలుగురా..| అది ఏనాటికి వదలని భాగ్యమ్మురా ..
అమ్మతోడే గ్రహశాంతి మందురా | అమ్మతోడే వ్యసనాల దూరంరా
అమ్మ నీడలోన, దైవమే ఉందిరా, ఉందిరా ||అమ్మ అన్నది ||

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే | అందరికి పనిమనిషా అమ్మఒక్కటే - 2 సార్లు
అమ్మ వున్న ఇంటిలో లేనిది ఏది | అమ్మ వున్న ఇంటిలో కానిది ఏది
అమ్మ విశ్రాంత బాధ్యత, ఇకపై నీది నాది ||అమ్మ అన్నది ||  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,392,281; 104 తత్వాలు (Tatvaalu) and views 258,560
Dt : 12-May-2019, Upd Dt : 12-May-2019, Category : Songs
Views : 5351 ( + More Social Media views ), Id : 112 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mothers , day , amma , runam , bullemma , bulloadu , amma annadi , Chalam , Nirmala , Vijaya , Lalitha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content