ఏటి సూతకంలో, నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1099 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1127 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

ఏటి సూతకం అన్న మాటకి అర్థం - ఎవరి శరీరం పడిపోతే కర్మ చేయవలసి ఉంటుందో, కర్మ చేసినటువంటి వారు, ఒక ఏడాది పాటు పాటించే నియమాల తోరణాన్ని, ఏటిసూతకం అంటారు.

తల్లి, తండ్రి వీళ్ళిద్దరి శరీరాలు పడిపోయినప్పుడు కొడుకు ఒక ఏడాదిపాటు ఏటి సూతకంలో ఉన్నాడు అంటారు. తల్లి కానీ, తండ్రికానీ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ ఏడాదిపాటు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించిన కర్మలు చేయాలి.

జీవుడికి ఒక ఏడాది మనుష్యలోకంలో ఉన్న కాలంతో అవకాశాన్నిస్తారు. ఎందుకంటే ఆనంద భావం కలిగితే శరీరంలో కొడుకు పుడతాడు అని చెప్తుంది శాస్త్రం. ఆనంద ధాతువు కదలాలి అంటే హృదయ స్థానం నుండి కదిలితేనే కొడుకు వస్తాడు అని. శరీరంలో ఇంక ఏ భాగం నుంచి పురుషుడికి ఆనంద ధాతువు కలిగినా ఆడపిల్ల పుడుతుంది అని.

శరీరం విడిచిపెట్టే ముందు కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని విడిచిపెడితే కాశీ పట్టణంలో విడిచిపెట్టేసినట్లే. అంటే తండ్రీ కొడుకుల మధ్య అంత గొప్ప అనుబంధాన్నిచ్చింది శాస్త్రం. మరణ వేదన కూడా తగ్గిపోతుంది కొడుకు స్పర్శకి అని.

ఒక చూరు క్రింద తండ్రి కొడుకు ఉన్నవాడు ఎవడో వాడు మహద్భాగ్యవంతుడు. రోజూ కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినపడుతూ ఉంటే కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, వాడున్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయుర్దాయం పెంచుతుంది.

ఏడాదిపాటు వీడు ఏం చేస్తాడో అవి, తండ్రి జీవుడి ఖాతాలో వేస్తారు. వీడు వెళ్ళి అన్నదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. పురాణం వింటే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వస్త్రదానం చేస్తే నాన్నగారి ఖాతాలో వేస్తారు. వీడికి అంత కన్నా పుణ్యం లోకంలో లేదు.

అంతేకానీ మా నాన్నగారి కోసం ఏటి సూతకం పట్టాను. నేను ఏ క్షేత్రానికి వెళ్ళడానికి లేదు. ఏ వ్రతమూ చెయ్యట్లేదు అని బెంగ పెట్టుకోకూడదు. అంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి ఉండదు.

అలా కర్మ చేయవలసి వస్తే ఎవరు కర్మ చేస్తున్నారో వాళ్ళు ఏడాది పాటు ఏటి సూతకంలో ఉన్నారు అంటారు.

ఏటి సూతకంలో ఉంటే నిత్యపూజ చేసి తీరాలి. ఏటి సూతకంలో ఉన్నాము, రోజూ చేసే పూజ చేయము అన్న మాట అనడానికి అధికారం లేదు. పంచోపచారములు జరిగి తీరాలి. అధవా షోడశోపచారములు కూడా చేయవచ్చు. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు లేని ఇల్లు ఉండడానికి లేదు. చక్కగా దీపం పెట్టవచ్చు. ఈశ్వరుడికి పూజ చేయవచ్చు. నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం తినవచ్చు.

చేయకూడనివి: నోములు చేయడం, వ్రతాలు చేయడం, భార్యాభర్త కలిసి పీటల మీద కూర్చుని నోములు, వ్రతాలు ఆచరించడం, నిత్యపూజలో ఇద్దరూ కూర్చుని చేసినా దోషం ఏమీ ఉండదు.

కొండలు ఎక్కకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనం చేయడానికి వెళ్ళకూడదు. పండుగలు మొదలైన సంబరాలు చేసుకోకూడదు. చేసుకోకూడదు అంటే బలవంతంగా మనస్సు నిగ్రహించమని కాదు. అయ్యో నా గురించి అంత వెంపర్లాడిన ఆయన వెళ్ళిపోయాడే!

కనీసం ఒక్క ఏడాది. ఈ పండుగకు మా అమ్మ అభ్యున్నతికి ఏం చేయాలో అది చేస్తాను అని ఎవరికైనా బ్రాహ్మణుడికి పంచెల చాపు దానం చేస్తాను.

నాకు పండుగ అని నా సంతోషం కోసం చేసుకోను. అందుకు పండుగ చేసుకోవద్దు అంటారు. బలవంతంగా నిగ్రహించి పిల్లల్ని పండుగకి ఎక్కడికో పంపి మేము మాత్రం ఇలా కూర్చున్నాం అండీ ఎందుకది? ఎందుకా ఏటి సూతకం? అలా ఉండకూడదు. నువ్వు నేర్పాలి పిల్లలకి. నీ తాత/నాయనమ్మ అంత గొప్పవాళ్ళు. ఆ నాయనమ్మ/తాత వెళ్ళిపోయింది. అందుకని చేసుకోవడం లేదు. అంటే మీరు మానేయండి మేం వెళ్తాం అంటాడా పిల్లవాడు?

వేసవి కాలం వస్తే చలివేంద్రం పెట్టు. రోహిణీ కార్తెలో మజ్జిగ ఒక బిందెలో పట్టుకుని పదిమందికి మజ్జిక ఇయ్యి. దేవాలయంలో ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి పేరు మీద అన్నదానం చేయమని కొంత డబ్బు ఇవ్వు. నియమం తప్పకుండా తల్లికి/తండ్రికి కర్మ చేస్తున్న వాళ్ళకి ఏవిధమైన ఆరాధన చేయాలో అది లోపం లేకుండా నిర్వర్తించు.

అలా చేయడం ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి సంబంధించినది. దానిని ఏటి సూతకం అంటారు. ఏటి సూతకంలో నిత్యపూజ చేయకూడదు అన్న నియమం లేదు. నిత్యపూజ మాత్రం ఇంట్లో నడుస్తూ ఉండాలి.

- గురువు గారు చాగంటి ప్రసంగము నుండి  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1127 General Articles, 47 Tatvaalu
Dt : 28-Feb-2020, Upd Dt : 28-Feb-2020, Category : General
Views : 780 ( + More Social Media views ), Id : 369 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : eti sutakam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content