మాతృదినోత్సవం - చట్ట సభ ఉద్యోగాల లో 50 శాతం సంతోషమా లేక బంధాలు 5 శాతం కూడా లేవని? Eng/ Telugu - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1201 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1231 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మాతృదినోత్సవ శుభాకాంక్షలు, మాతృ మూర్తులందరికీ.

ఎప్పుడు లాగ నే, వాట్సప్ స్టేటస్ లో, 76 ఏళ్ల అమ్మ ఫోటో, అమ్మ కోసం పాట, చూడగలరు, చెరువు దగ్గర నడక.

అమ్మ మనకేమి చేసిందో చెప్పాలి అంటే 1000 పైన ఉంటాయి, దేవుని సహస్రనామాలు లాగా. మనం అమ్మ కు 60 ఏళ్ల వయస్సు తర్వాత, ఎన్ని మనం తిప్పి చేశాం, అనేది ముఖ్యం, కనీసం 10 పనులు?

అమ్మ మీతో కనీసం సంవత్సరం గా కలసి ఉంటే, సమాన సౌకర్యాలు తో, గర్వంగా అందరికీ చూపండి. అమ్మ కోసం ఒక పద్యం లేదా పాట పాడండి.

గర్వంగా మీ మాతృమూర్తి ఫోటో చూపగలరు, మీతోనే ఇంట్లో సంవత్సరం గా తోడు ఉంటే, 60 పై బడిన తర్వాత.

మాతృదేవో భవ అంటున్నాము నోటితో, నొసటి తో వెక్కిరిస్తూ, పదిమంది కోసం ఏదో ఫోటో పెడుతున్నాము నటనతో.

పాదాలు తాకడం కడగడం కూడా, ఇష్టపడని పిల్లలు ఉన్నారు, ఆస్తి మాత్రమే ముఖ్యం వారికి, అనురాగం కృతజ్ఞతలు కావు.

కానీ ముదుసలి వయస్సు లో ఇంట్లో పెట్టుకుని, పిల్లల తో పాటుగా, సమాన సౌకర్యాలు ఇవ్వడం లేదు, ఓ ముద్ద వేయడం లేదు, ప్రేమ బాధ్యత కృతజ్ఞతలు తో.

ఇప్పుడు 76 ఏళ్ల అమ్మ, మనతో నే ఉంటూ, 7 ఏళ్లుగా, 365 రోజులూ మనకు అమ్మ రోజే, అమ్మ భిక్షే, అమ్మ సంతోష మే, ఆ దేవుని చల్లని దీవెనలతో, మీలాంటి మంచి వారి ఆశీస్సులు తో.

సాక్స్ తొడగడం విప్పడం, తిన్న పళ్ళెం కడగడం, అన్ని కూరలు కోసి ఇవ్వడం కడగడం చిమ్మడం, రోగ బాధ తో మంచం దిగలేకపోతే ఎత్తి పోయడం, రోజూ కనీసం మైలు చేయిపట్టి నడిపించడం మాటలు పాటలు పద్యాల తో, కాళ్ళు వత్తడం, కన్నీళ్ళు తుడవడం, ఇంటి సొంత మందు ఇవ్వడం, ఇంకా ఎన్నో . . . ఆరేళ్ళ పసిపాప లా అన్ని చేయగలగడం, ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టం.

నేడు బిడ్డలు, దూరంగా ఎంతో పెద్ద ఉద్యోగాలలో ధన సంపత్తులతో పిల్లా పాపలతో, ఉండడం చూసి మురుసి పోతున్నారు పిచ్చి తల్లులు, తాము ఒంటరిగా అనాధలుగా ఆలనా పాలనా, లేకుండా ఉండి కూడా, బంధాలకు విలువ లేకుండా పెంచామని, కనీస బాధ కూడా లేకుండా, పశ్చాత్తాపం పడకుండా.

సరిగ్గా ఆలోచన చేస్తే, భవిష్యత్తు లో తమ బిడ్డల బ్రతుకు, ముదుసలి వయస్సు లో, అంత కన్నా ఘోరంగా ఉంటుంది, తన మనవళ్లు చేతిలో అని తెలిసి కూడా, వారికి అన్యాయం చేస్తూ, ధన మత్తులో పరుగులు తీస్తూ, అభిమానం ప్రేమ ఆప్యాయత బాధ్యత లను, పిల్లల కు పసి వయస్సు నుంచే, అలవాటు చేయడం మరచారు.

అందుకే ఐకమత్యంగా పిల్లలు అందరూ మాట్లాడుకుని, ముదుసలి వారిని అనాధ ఆశ్రమం లో, లేదా ఇంకొకరి తో దూరంగా వదులుతున్నారు.

ఇప్పుడు కరోనా గురువు, మన అబద్ధాల బంధాల బతుకు బయట వేశారు. రోగం వచ్చింది అని తెలిస్తే, భర్త భార్య కూతురు కొడుకు తమ్ముడు, ఏ బంధం కూడా, కాటికి వచ్చి నిప్పు పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు. అంతా మున్సిపల్ అధికారులు లేదా కాటికాపరులే.

కానీ నాడు తల్లులు, తమ పిల్లలకు కేవలం ఆప్యాయత అభిమానం ప్రేమ లతో పెంచారు, ధనం కన్నా బంధం పరువు చిన్నా పెద్ద మర్యాద కు, కట్టబడ్డారు. ఇంటి ఎదుట చిన్న కిరాణా షాపు కొడుకుది అయినా, గౌరవించారు, సుఖపడ్డారు.

మరి మనం బంధాలను తెంపుకుంటూ, విలువలను దిగజార్చుకుంటూ , 21 వ శతాబ్దంలో ప్రగతి టెక్నాలజీ నాగరికత లు అంటూ, వెర్రి మాటలు చెప్పుకుంటూ, ఎటు పోతున్నామో ఎవరికీ తెలీదు.

కరోనా కోవిడ్ ల పరంపర అవకాశం, మనమే కల్పిస్తూ ఉన్నాము.

అందుకే పెద్దలు, పెరుగుట విరుగుట కొరకే అంది.

కరోనా గురువు వచ్చి, హైందవ సనాతన ధర్మం ను మరలా గుర్తు చేస్తున్నారు, దూరంగా ఉండి నమస్కారం, కాళ్ళు చేతులు కడిగి ఇంట్లో కి , మడితో భోజనం వండటం, కషాయం, కాకర వేపాకు వైద్యం, సాష్టాంగ నమస్కారం ఆక్సిజన్, . . .

నేటి తల్లులూ ఆలోచన చెయ్యండి, పిల్లల సంస్కార ఆరోగ్య భవిష్యత్తు ముఖ్యమా లేక ఇంకేదైనా ముఖ్యమా?

చట్ట సభలలో 50 శాతం కు వెళ్ళామని సంతోష పడదామా లేక కుటుంబ బంధాలు అనుబంధాలు 5 శాతం కూడా లేవని బాధపడదామా?

భవిష్యత్తు తరాలు మీ చేతుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలూ మీకే.

Mom Photo, song for mom, in whatsapp status.

Whatever mom did for is more than 1000 things like God sahasra nama.

But important thing is how many we did back after 60 yrs age, at least 10?

If we have mom with us having equal facilities then proudly show mom photo to all.

Please sing a poem or song for mom. Here are the few things we are doing

* Putting on socks and boots, unwrapping
* Washing dishes and also mom eating plate
* Chopping Cutting all the vegitables,
* Washing cleaning home with broom brush
* if mom can't get out of bed by health issues, hold everything and throw out
* Take for walk at least a mile every day, with sweet memory talks, songs and poems
* pressing legs if she got leg pains
* wiping tears if she feel bad about, now or remembering old days
* giving home made medicine
* taking temple for navagraha pradakshin every SAT
* taking to hospital many times for emergency ourselves
* and more. . .

Doing everything for 76 yrs old mom daily, like 6 year-old girl, that is God given luck.

Don't say matru devobhava from toungue, do something with hand by having them with us.

Please give back whatever they did to us, atleast something.

This is not to tell what we did, this to to hear from what you did to great mom by giving equal facilities and medicine along with you and things you did with your own hand, not with money?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1231 General Articles, 47 Tatvaalu
Dt : 09-May-2021, Upd Dt : 09-May-2021, Category : General
Views : 137 ( + More Social Media views ), Id : 1164 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mothers day , mom , legislative , assembly , jobs , 50 percent , happy , 5 percent , bonds , relation , unhappy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content