పాటతో పరమార్ధం- కంటేనే అమ్మ అని అంటే ఎలా - ప్రేమించు - లయ, సాయి కిరణ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,892,826; 104 తత్వాలు (Tatvaalu) and views 227,143.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kantene Amma Ani Ante Ela - Preminchu - Laya, Sai Kiran - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

అమ్మ, మన సంస్కార ఆలోచనలు పనులకు ప్రతి రూపం. మనము నక్క, పాము, పులి కి ఓటేస్తు అండగా ఉంటూ, జరిగే తప్పు ని తప్పు అని చెప్పకుండా మౌనముగా ఉంటే, మన తల్లి దండ్రుల మరియు పిల్లల సంస్కారం, అలాగే వారి మరియు మన ఒంటరి ముదుసలి భవిష్యత్ ఇట్టే తెలిసిపోతుంది. నాన్న అయినా అంతే.

అందుకనే కంటేనే, అమ్మ అని అంటే ఎలా, మూర్ఖులారా. మనల్ని సంస్కరిచే కరుణించే, ప్రతి దేవత, అమ్మే కదా, కన్న అమ్మే కదా అంటే, మనము కాదనగలమా?

మంచి సంస్కారం గుణం నేర్పని అమ్మ, అమ్మే కాదు. ఎందుకంటే, జంతువులు కూడా తమ లక్షణాలను మంచిగా నేర్పుతాయి. అవే నిత్యము ప్రదర్శిస్తాయి, కపటం నటన లేకుండా. అలాంటి కడుపుతీపి, లేని అమ్మ, బొమ్మే కదా, రాతి బొమ్మే కదా?

ధన సంపాదనలో మరియు ప్రాపంచిక మోహం లో పడి, సొంత పిల్లలను పతనము చేసే తల్లి దండ్రులను, ఇప్పుడు అన్ని చోట్లా చూస్తున్నాము. డేకేర్ లో పడేస్తున్నారు, తల్లి దండ్రుల దగ్గర వదిలేస్తున్నారు, దబ్బా పాలు పడుతున్నారు తమ కు శక్తి ఉన్నా, ఫోన్ లు పిల్లల చేతిలో పెట్టి, టీవీలు కబురులు. ఎదిగాక, ఏమి పర్లేదు, ఎవరినైనా ప్రేమించు, ఎవరితో అయినా తిరుగు, ఎంత అప్పు అయినా చెయ్యి, ఎంత మంది జీవితాలనైనా బలి చేయి, ఎన్ని రోగాలైనా తెచ్చుకో, ఎలా అయినా పతనము అవ్వు, మన ధనం పలుకుబడి బలగం మీకు అండ అని, రావణ ద్రుతరాష్ట్ర గాంధారి పెంపకం చేస్తున్నారు.

చివరకి, వారి పిల్లల చేతిలోనే వీరు, నరకం అనుభవించి పోతున్నారు, కన్నీరు మున్నీరుగా.

కణకణలాడే ఎండకు శిరసు మాడినా, మనకు తన నీడను అందించే, చెట్టే అమ్మ, కాదంటారా? చారెడు నీళ్లైనా తాను దాచుకోక, జగతికి సర్వస్వం అర్పించే, మబ్బే అమ్మ, కాదంటారా?

మరి అలాంటి అమ్మ, నాన్నలను, తోడు ప్రేమ అభిమానం ఆప్యాయత చేయి పట్టుకుని నడిపించడం అవసరమైన ముదుసలి తనములో, ఒంటరిగా అనాధలుగా సమాన ప్రేమ, ఆప్యాయత, వైద్య మరియు వినోద సౌకర్యాలు లేకుండా, దూరంగా ఎలా వదిలాము, క్రుతజ్ఞత విశ్వసనీయత మరచి?

ఆ అమ్మలనే మించిన, అరిషడ్వర్గ అష్టవ్యసనాలు జయించి, పది మందికి మంచి చెప్పి, వారి తల్లి దండ్రులకు మనశ్శాంతి ని ఇచ్చే గుణాన్ని ఇచ్చిన, మన అమ్మకూ, ఎన్ని చేసినా, ఎంత ఇచ్చినా, రుణం తీర్చుకోలేము ఏ జన్మకు.

అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయిన, ఆ మేడకున్న అసలు ఉనికి ఆ పునాదిపైనే, కాదంటారా? సిరుల జల్లులొ, నిత్యం పరవశించినా, మగువ జీవన సాఫల్యం, మాతృత్వంలోనే? కాదంటారా?

మరి నేటి విక్రుత చేష్టలు చూస్తున్నారా? మాకు శారీరక సుఖం చాలు, ఆస్తులు పదవులు వీసాలు చాలు, మాకు పిల్లలు వద్దు పెంచలేము, మా ఆనందానికి అడ్డు అంటున్నారు, స్వార్ధపరులు. అంగీకరించి ఆస్తులు ఇస్తున్నారు, ఆ స్వార్ధ తల్లి దండ్రులు.

ప్రతి తల్లికి సాత్విక మమకారం క్రుతజ్ఞత విశ్వసనీయత, పరమార్థం, అది లేని అహంకారం, వ్యర్థం వ్యర్థం అని వారికి, వీరికి చెప్పెది ఎవరు? అందుకే, కడుపు తీపి లేని అమ్మ, బొమ్మే కద, రాతి బొమ్మే కదా?

కంటేనే, అమ్మ అని అంటే ఎలా 2
కరుణించే, ప్రతి దేవత, అమ్మే కదా, కన్న అమ్మే కదా..
కంటేనే అమ్మ అని అంటే ఎలా 2
కడుపుతీపి, లేని అమ్మ, బొమ్మే కదా, రాతి బొమ్మే కదా

కణకణలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తన నీడను అందించే, చెట్టే అమ్మ..
చారెడు నీళ్లైనా తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే, మబ్బే అమ్మ..
ఆ అమ్మలనే మించిన, మా అమ్మకూ 2
రుణం తీర్చుకోలేను ఏ జన్మకు

కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయిన
మేడకున్న అసలు ఉనికి ఆ పునాదిపైనే..
సిరుల జల్లులొ, నిత్యం, పరవశించినా
మగువ, జీవన సాఫల్యం, మాతృత్వంలోనే..
ప్రతి తల్లికి మమకారం, పరమా.ర్థం.2
అది లేని అహంకారం, వ్యర్థం వ్యర్థం

కరుణించే ప్రతి దేవత, అమ్మే కదా.
కడుపు తీపి లేని అమ్మ, బొమ్మే కద, రాతి బొమ్మే కదా

Movie: Preminchu; Cast: Laya, Sai Kiran; Music Director: M M Srilekha; Song: Kantene Amma Ani Ante Ela; Lyricist: Narayana Reddy; Singers: K.S. Chitra, S.P.Balasubramanyam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,892,826; 104 తత్వాలు (Tatvaalu) and views 227,143
Dt : 22-Apr-2024, Upd Dt : 22-Apr-2024, Category : Songs
Views : 78 ( + More Social Media views ), Id : 2090 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Song Spirit , Kantene Amma Ani Ante Ela , Preminchu , Laya , Sai , Srilekha , Narayana Reddy , Chitra , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content