పాటతో పరమార్ధం- ఎన్నెన్నో వర్ణాలు (భక్తి పేరడీ) - ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు - రవితేజ, కల్యాణి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,892,891; 104 తత్వాలు (Tatvaalu) and views 227,148.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ennenno Varnaalu (Bhakti Parody) - Avunu Valliddaru Ista Paddaru - Ravi Teja, Kalyani - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

వంశీ విభిన్నమైన సినిమాలు చేస్తారు. చాలా చక్కగా ఈ చిత్రము కుదిరింది. తడి మనసుల మంచి భావనలు, క్రుతజ్ఞతలు విశ్వసనీయతతో.

మన చుట్టూ, ఎన్నెన్నో వర్ణాలు, మనుషులు, రంగులు, పనులు, సుఖాలు, అందాలు, నటనలు, కపటాలు, ఆస్తులు, అంతస్తులు, అధికారం, అవసరాలు, అవకాశాలు. కానీ వాటి అన్నింట్లో ను, జీవిత గుణపాఠాలు ఉన్నాయి, మరువకు మిత్రమా. కానీ, కడకైతే మిగిలేది, మనకు/ మన పిల్లలకు/ ఆరోగ్యానికి/ మనశ్శాంతికి అండగా ఉండేది, మంచి గుణమేనండి.

కత్తి ఇచ్చింది ఉల్లి పాయలు కోసుకోమని, జీవితాలు కోయమని కాదు. ఈ రోజు మనం ఆ తప్పుడు ప్రయత్నం చేస్తే, రేపు ఇంకొకరు మనకు, మన పిల్లలకు, మన మనుమలకు, అదే కోత కోస్తారు జీవితములో, కర్మ విడువదు. నక్క, పాము, పులి కి ఓటు వేస్తే, అండగా ఉంటే, మౌనముగా ఉంటే, నష్ట ఎవరికి? మనకు, మన పిల్లలు, మన మనుమలకే. నమ్మరా? ఈ పెద్దలను అడగండి, గుణవంతులు వారితో ఉంటే, వీరు గుణవంతుల మాట విని ఆచరిస్తే, ఇంకా ఎన్నో అద్భుతాలు చేసేవారు కదూ?

నమ్మరు కదూ ఉదాహరణ లేకుండా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన లాభనష్టాలు, మన పెద్దలు ఎప్పుడో ప్రత్యక్షంగా నిరూపించారు. పురాణాలు లో కాదు సుమీ, ఈ 50 ఏళ్ళు లో. మీ పెద్దలు ను అంటే, సంస్కారం ఉన్న వారిని అడగండి.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి

మంచి గుణమేమో మన కిష్టం, మన మనసు, మన నిష్ట, మన చేతిలో ఉన్నది, మానసిక బలం ఉంటే. శాంతికై, మనల్ని పతనము చేసే, మీ ఇష్టం ను కూడా, వదలొచ్చండి, తప్పు లేదు. మీ మది తొందర చేసే, కోరికల వైపు పరుగులు తీసె, చెడు బాటను వీడిక మీరు, సాగిపోండిలా సాత్వికులను అనుసరించి, వారి మాట చేతలకు కట్టుబడి. ఇదే ఇదే మనమాటగా, పదే పదే మనపాటగా, ఆచరిస్తే, మన పిల్లలు అదే బాట పడతారు, మనశ్శాంతి గా బతుకుతారు.

మనదంటూ వివేకం ఒకటి ఉంది, మనసును నియంత్రణ చేసి, మనదంటూ ధ్యానలోకం ఏర్పరచుకోవాలి, పడలేము ఏ ప్రాపంచిక మోహం అయినా, అంతేనండి. బాగుంది మన సజీవ గురు సేవ, అమ్మకెంతో నచ్చేట్టు, పెద్దల మనసెంతో మెచ్చేట్టు, మనం ఎప్పుడూ దైవం తట్టు. అందుకె మనం దిగివచ్చాం, వంచని మన తల వంచాం, దైవ భావమా అంటూ. ఇది కల కాదు, నిజం, మన కోసమే. అనుక్షణం, మన ఓర్పు, నేర్పు, చేర్పు తో, శాంతే.

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో పాఠాలు..
ఎన్నెన్నో వర్ణాలు, అన్నింట్లో పాఠాలు, కడకైతే మిగిలేది గుణమేనండి..
గుణమేమో మనకిష్టం, మన మనసు మన నిష్ట, శాంతికై మీఇష్టం వదలొచ్చండి
మీ మది తొందర చేసే, బాటను వీడిక మీరు, సా.గిపోండిలా..
ఇదే. ఇదే. మనమాటగా. పదే. పదే. మనపాటగా..
ఎన్నెన్నో వర్ణాలు

మనదంటూ వివేకం, మనదంటూ ధ్యానలోకం, పడలేము ఏ మోహం అంతేనండి.
బాగుంది గురు సేవ, అమ్మకెంతో నచ్చేట్టు, మనసెంతో మెచ్చేట్టు, దైవంతట్టు
అందుకె మనం దిగివచ్చాం, వంచని మన తల వంచాం, దైవ భా.వమా.
కలా. నిజం. మన కోసమే. అను. క్షణం. ఓర్పుశాంతే.
మనదంటూ వివేకం, మనదంటూ ధ్యాన లోకం, పడలేము ఏ మోహం అంతేనండి.

Original

ఎన్నెన్నో వర్ణాలు.. అన్నింట్లో అందాలు..
ఎన్నెన్నో వర్ణాలు, అన్నింట్లో అందాలు, ఒకటైతే మిగిలేది తెలుపేనండి
నలుపేమో నాకిష్టం, మీ మనసు మీ ఇష్టం, నాకోసం మీ ఇష్టం వదలొద్దండి
మీ మది తొందర చేసే, బాటను వీడక మీరు, సా.గిపోండలా
ఇదే. ఇదే. నా మాటగా. పదే. పదే. నా పాటగా..
ఎన్నెన్నో వర్ణాలు

నేనంటూ ప్రత్యేకం, నాదంటూ ఓ లోకం, పడలేను ఏ జోక్యం అంతేనండి.
బాగుంది మీ టెస్టూ, నాకెంతో నచ్చేట్టు, మనసెంతో మెచ్చేట్టు, మీ మీదొట్టు
అందుకె నే దిగివచ్చా, వంచని నా తల వంచా, స్నేహ భా.వమా.
కలా. నిజం. నీ కోసమే. అను. క్షణం. ఉల్లాసమే.
నేనంటూ ప్రత్యేకం, నాదంటూ ఓ లోకం, పడలేను ఏ జోక్యం అంతేనండి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,892,891; 104 తత్వాలు (Tatvaalu) and views 227,148
Dt : 22-Apr-2024, Upd Dt : 22-Apr-2024, Category : Songs
Views : 59 ( + More Social Media views ), Id : 2089 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ennenno Varnalu , Yennenno Varnnalu , Ennenno Varnaalu , Avunu Valliddaru Ista Paddaru , Avunu Validdharu Istapaddaru , Ravi Teja , Kalyani , Chakri , Balu , Kausalya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content