సంస్కార పెంపకములో, మమ్మల్ని బిడ్డలు లా దగ్గర ఉంచి, సౌకర్యాలు ప్రేమ భద్రత అనే తల్లులు ఎందరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*మా బిడ్డలు మా సంస్కార పెంపకములో, మమ్మల్ని సొంత బిడ్డలు లా దగ్గర ఉంచి, సౌకర్యాలు ప్రేమ భద్రత అనురాగం ఆప్యాయత ఇస్తున్నారు ఇవ్వగలరు, అనే పుణ్య తల్లులు ఎందరు?*

భూమాతకు క్రుతజ్ఞతలు తో, నీతి నిజాయితీలతో ఉంటూ, పది మంది మంచి కోరే, మరియు కనీసం కన్నవారికి ముదుసలి వయసులో అండగా ఉండే, ఉత్తమ సంస్కార బిడ్డలను ఇచ్చిన పెంచిన, ఓ ఉత్తమ కన్న తల్లు లారా, తలవంచి మీ పాదాలకు సాష్టాంగ శతకోటి నమస్కారాలు. ఎందుకంటే, అదే పెద్ద దైవ మానసిక పూజ, నైవేద్యం మనసుతో.

ఎందుకంటే, ధనము కన్నా గుణము ముఖ్యమని, పిల్లల పెంపకం కన్నా, గురుతర మైన బాధ్యత ఇంకోటి లేదని, మీ చల్లని మనసులకు తోచింది. పిల్లలు అంటే మనకు మాత్రమే కాదు, భూమాతకు ప్రపంచానికి ఇతరులకు కూడా శాంతి ని మనశ్శాంతిని ఇవ్వాలి అని మీకే అనిపించింది కదా.

*కనీసం ఇల్లు ఆస్తి మంచి ఉద్యోగం/ వ్యాపారం/ ఆదాయం ఉన్న గురువులూ, మీ ముదుసలి తల్లి దండ్రులును ఎన్ని ఏళ్ళు గా వరుసగా మీతో ఇంట్లో ఉంటున్నారో ఉన్నారో ఉండబోతున్నారో, ఎన్ని సౌకర్యాలు మీరు కల్పిస్తున్నారో, దయచేసి మాకు తెలిపి మీ సోషల్ మీడియాలో మరియు వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, మా అందరికీ కనువిప్పు కలిగించండి, మాకు అవే మంచి ఆలోచనలు బాధ్యతలు వచ్చేందుకు సహకరించండి.*

మంచి కొడుకు/ కూతురు ఎప్పుడూ, తన కన్న వారి క్షేమం గురించి ప్రపంచానికి చెప్పడానికి, సిగ్గు పడరు. అది తమ కోసము కాదు, ఇతర తల్లులకు కూడా రక్షణ గా ఉంటుంది ఉదాహరణ గా ఉంటుంది. అదీ మనకు పుణ్యమే. రాబోయే తరాలకు ఆదర్శము గా ఉండండి.

అలా ఇంట్లో తమతో పెట్టలేని వారు, బహిరంగముగా పశ్చాత్తాపముతో సిగ్గుతో, సరైన తప్పు కారణము వివరము తో, క్షమాపణలు తెలుపండి బాధపడండి, లేదంటే అది మన పిల్లల మానసిక పతనానికి బాటలు వేస్తుంది.

పితరుల దోషం ద్రోహం వెంటాడుతుంది. మంచి చెప్పిన వారి పై కోపము కన్నా, మన బిడ్డల మానసిక స్థితి బాగు, మనకు ముఖ్యం కదా? ఎందుకంటే, మీకు పితరుల దోష శిక్ష కొంతైనా తగ్గుతుంది, లేదంటే దాని ఫలితాలు మీరు అనుభవించలేరు భరించలేరు. కాలుని శిక్ష ను, ధనము అధికారము పదవితో, తప్పించుకోలేరు.

మనము దాదాపు గా దేవాలయానికి, వారము లో కనీసం 3 రోజులు అయినా వెళతాము, దగ్గర నడకలో. ఒక రోజు ప్రదక్షిణలకు, ఒక రోజు గురు హారతి కి, మిగతా రోజులు నడక కి. ముదుసలి తల్లి దండ్రులతో మరియు పిల్లలు తో, సాంప్రదాయము కట్టు బొట్టు తో వచ్చే ఎంతో మందిని చూస్తున్నాము, వారి వలనే ఇంకా పుణ్యం మిగిలి ఉంది.

మనకు లేని సంస్కారం, ఇతరులను చూసి నేర్చుకోవాలి, వారిని నిందించకూడదు. నష్టం వారికి కాదు, మనకి మాత్రమే. రోగం లేదా కాళ్ళు చేతులు కదలని రోజున, వాస్తవం అర్ధము అవుతుంది. కాపాడేది కాసులు కాదు, ఉత్తమ కన్న బిడ్డలు మాత్రమే అని అర్ధం అవుతుంది.

కానీ ఈరోజు మనము మంచిని ఎలా పెడచెవిన పెట్టామో, ఆ రోజున మన ఏడుపు కేకలు వినే దిక్కు ఉండదు, సుమా. మనము చేతులారా చేసుకున్న పాపము ఇది, ఫలితాలు కూడా మనకే.

ఎందుకంటే, మన బిడ్డలు తెలుగు రాయలేరు, మాత్రు బాషను గౌరవించరు, క్రుతజ్ఞతలు తెలియవు, మనము నేర్పలేదు, సినిమాలు సీరియల్ సంపాదన పరుగులలో.

కాబట్టి నీతి నియమం లేని, మాత్రు మూర్తిని కూడా ఎటూ గౌరవించరు. అలాగే మాత్రు దేశాన్ని గౌరవించరు. మరి స్నేహితులను, రాజ్యాంగాన్ని, భాగస్వామిని పిల్లలను నీతి నియమాలను ఎలా గౌరవిస్తారు?

మనము విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి వస్తుందా? మన బిడ్డలు, మన ఆలోచనా పెంపక సంస్కారాలని మనకు ఒప్పుకుని, పశ్చాత్తాపం భూమిపై పడకపోతే, పోయే లోపు, పై లోకాలలో శాంతి ఉండదు సుమా. మరలా కాలచక్రము లో బంధీలు గా, ఇవే బాధలు ఇవే కష్టాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 08-May-2022, Upd Dt : 08-May-2022, Category : General
Views : 221 ( + More Social Media views ), Id : 1382 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : virtuous , mom , amma , mothers , nurturing , children , love , parents , care , facilities
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content