కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో - దండకారణ్యం - నారాయణ మూర్తి, వందేమాతరం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,375; 104 తత్వాలు (Tatvaalu) and views 225,061.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అమ్మ కష్టాన్ని, మనము గుడ్డు గా ఎదిగేటప్పుడు నుంచి, ఆమె ముదుసలి తనము వరకూ, మన గురించి పడే తపన ఆరాటము పోరాటము గురించి, అన్ని ఇబ్బందులను తట్టుకుని తను పడే శ్రమను చక్కగా వివరించారు.

వందేమాతరం శ్రీనివాస్ మాత్రమే ఇంత చక్కని పాటలకు, న్యాయం చేయగలరు. అలాంటి వారిని, నారాయణ మూర్తి మాత్రమే ప్రోత్సాహం చేయగలరు.

మరి అలాంటి మంచి సినిమాలను ఆదరించే గుణము మనకు ఉందా?

కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో.., మనసుకు కాదు మరువ తరమో.. 2

తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు
నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగనేను కడుపునుండ అన్నప్పుడు
(అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) 2
కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు
జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ
(బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) 2
అమ్మంటే ఎంతగొప్పదో, బ్రహ్మకైనా వర్ణించ వశమగునా
ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా
పొద్దు పొద్దున లేచి, నీ నామమును తలచి, నిన్ను పూజించిన, నీ ఋణము తీరునా,
అమ్మా.... కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో

పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ
కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి, చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును
(చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) 2
చిన్ననోట అమ్మ అమ్మని అంటే, గావురంగా నే మారాము జేస్తే
పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎత్తుకుంటది
(ముద్దాడి సంకన ఎత్తుకుంటది) 2
రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది
పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది
చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి
అమ్మా.... కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో

తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు
అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది
(దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) 2
ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా
కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది
(కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) 2
జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది
ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది
కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును
అమ్మా.... కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో

ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి
ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా
(సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) 2
కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని
ఆత్మ గల తల్లి అడగుల రాటము, ఊపిరైనిస్తది బిడ్డల కోసము
(ఊపిరైనిస్తది బిడ్డల కోసము) 2
వయసు ఉడిగినా, శక్తి కరిగినా, అమ్మ ప్రేమ అణువంతైనా, తరగదు
కన్ను మూసే, చివరి ఘడియలొచ్చినా, కన్న పావురాలను, మనసు విడువదు
అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము
అమ్మా.... కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో

Vandemataram Srinivas - Dandakaranyam - Kammanaina Amma Pata
దండకారణ్యం వందేమాతరం శ్రీనివాస్ R Narayana Murthy, Koteswara Rao, Gaddar, P Tirupathi, Lakshmi, Madhavi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,375; 104 తత్వాలు (Tatvaalu) and views 225,061
Dt : 08-May-2022, Upd Dt : 08-May-2022, Category : General
Views : 1657 ( + More Social Media views ), Id : 1384 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kammanaina , amma , pata , madhuramoa , dandakaranyam , narayana , murthy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content