నోరు జారిన ఎన్నారై టీడీపీ నేత, కొనసాగుతున్న వెన్నుపోటు, గుణ సర్టిఫికేట్ నాయకులకు? - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,894,940; 104 తత్వాలు (Tatvaalu) and views 227,357.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

NRI TDP leader slipped mouth, ongoing backstabbing, merit certificate for the leaders?

మనము మొన్న అనుకున్నాము, పిల్లలకు, వ్యాపారానికి, ఉద్యోగానికి, వివాహానికి, గుణ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు గుణ సర్టిఫికేట్ నాయకులకు కూడా ఉండాలి. లేదంటే, మనసు లోతుల్లోకి వెళ్ళి చూడటం, అందరికీ చేతకాదు. నాయకులు తస్మాత్ జాగ్రత్త, మీ వెంటే, మీ పతనం హుందాగా నడుస్తుంది, సమయం కోసం వేచి చూస్తున్నది, మన గత పాపం వదలదు నేడో రేపో.

గుణ సర్టిఫికేట్ కధనం

ఎన్నికలకి, కొత్తా దేవుళ్ళండీ కొంగొత్తా దేవుతలండీ, వస్తున్నారు అని చెప్పాము.

ఎవరు మన వాడో, ఎవరు పగవాడో/ కోవర్టో, ఎవరు మన పక్కన ఉంటూ మనకు గొయ్యి తీస్తున్నారో కూడా, వారికే తెలియడం లేదు. ఎవరు మాటలు/ వీడియో రికార్డ్ చేస్తున్నారో, ఎప్పుడు బయటకు వదులు తారో తెలీదు. మన నీడనే నమ్మలేని పరిస్తితి వచ్చింది. అందుకే మొదట నుంచి, కపటం నటన 2 నాల్కలు వద్దు, వాట్సాప్ రీడ్ రిసీప్ట్ దొంగలు లాగా ఆపవద్దు. మనతోనే దొంగలు ఉంటారు అని చెప్పాము. మన పిల్లలు, భాగస్వామి, అనుచరులు, పనివారు అదే నేర్చుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది.

మాయలో ఉన్న మనము, మనలాంటి దొంగ బుద్ది కలవారిని పట్టుకోలేము. అది మాయకు బయట ఉన్న వారు మాత్రమే, పట్టుకోగలరు, ఖచ్చితముగా భవిష్యత్ చెప్పగలరు. అందుకే దొంగలకు కూడా, నీతి గల వారు తోడు ఉండాలి. అందుకే కౌరవులు, విదురుని గౌరవించి పక్కన పెట్టుకున్నారు. సుగ్రీవుడు, ఆంజనేయుని దగ్గర పెట్టుకున్నారు.

ఎంతో తెలివి గల వాడు కూడా, ప్రాపంచిక మాయలో, తనకు వెన్నుపోటు పొడిచేవాడినే, పక్కన పెట్టుకుంటాడు, ఆదరిస్తాడు, తన స్వార్ధ పనులు చేయించుకుంటాడు, అన్ని ఇచ్చి బలవంతుని చేస్తాడు. పాముకు పాలు తనకే కాటు అని తెలిసీ, మూర్ఖముగా చేస్తారు. ఎవరి మాటా వినరు. రామన్న దగ్గర అదే జరిగింది. అప్పుడు అందరూ సమర్ధన చేసారు, వెన్నుపోటు తప్పలేదు, తప్పుకాదు అని. కాబట్టి ఇప్పుడు అదే వెన్నుపోటు శాఖోప శాఖలు గా ఎదిగి కొనసాగుతున్నది, వారినే కాలరాస్తున్నది.

ఇప్పుడు కొత్త గా బాబాయి గుండెపోటు కూడా వచ్చింది, అదీ తప్పుకాదు అని అందరూ ఒప్పుకుంటున్నారు అటువైపు.

మొన్న కర్ణాటక వార్త, సొంత నాన్నను అలాగే 2 వ తల్లి పిల్లలను, మొత్తము హోల్సేల్ గా శివైక్యం చెయ్యమని, ఆస్తి తగదాల దగ్గర, సొంత కొడుకు సుపారీ.

అంటే, మనం ఎదగడానికి, ఎవరినైనా, ఏ విధముగా అయినా అడ్డుతొలగించుకో. మరి రేపు ఇంకొకరు మనల్ని, అలాగే అడ్డు తొలిగిస్తే? మరి మనందరివీ, నక్క పాము పులి బుద్దులేనా?

అంటే మనము, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఉన్నాము. మనకు పన్నుల మోత, ఆహారపు కొరత, మనశ్శాంతి లేమి, రోగాల ద్రోహాల మోసాల కల్తీల బారి, ఇంకా ఎక్కువ మోతాదులో తప్పదు రాబోయే రోజుల్లో, ఎందుకంటే ధనమే రాజ్యం ఏలుతున్నది, గుణం నశింపచేయబడుతున్నది, మన ఓటుతో. మన కుటుంబ పతనం కు మనమే కారణం. ఆవు గుణాన్ని ఎన్నుకోలేని కుసంస్కార పెంపకం మనది, అంతేనా?

లోన మాటలు, వీడియోలు బయటకు ఎలా వచ్చాయి? మనవారు అమ్ముడు పోయారా? లేక వీడియో గ్రాఫర్ లా, టీవీ వారా? లేదా మనమే సరదాకు లీక్ నా? మరి రేపు హోటల్ బాయ్, పేపర్ బాయ్, ఇంటి పని వారు, ఇరుగు పొరుగు, మన అనుచరులు, అందరూ అమ్ముడు పోతే, ఇంక ఎవరిని నమ్మాలి? వారంతా రికార్డ్ చేయరా, మన బండారాలు? మనలాగే వారికి మాత్రం, వంకర దోవలో తొందరగా ఎదగాలి అని ఉండదా? వెన్నుపోటు, గుండెపోటు మన పేటెంట్ కాదు కదా? మన మాజీ తానా అధ్యక్షుల, మీటింగ్ బూతులు, బయటకు లీక్ కాలేదా?

నీతులు చెప్పేవారు, అసలు అలా అనవచ్చా, 10 మంది ముందు మీటింగ్ లో? చంద్రన్న అభివ్రుద్ది, రామన్న ఫోటో, పవన్, చిన్నమ్మ అండ, లోకన్న భరోసా, ఇంతమంది అండ ఉన్నా చాలదా? ఇంకో వైపు షర్మిలమ్మ.

అంటే మా 3 వ అబ్బాయి జగనన్న కు భయపడుతున్నామా? ఇంత అండ ఉన్నా, గెలిచే సత్తా లేదా? మా పిల్లలు చిన్నమ్మ, చంద్రన్న, జగనన్న, పవనన్న,షర్మిలమ్మ లను సమానముగా ఆదరించరా? సరే వారి పాట్లు వారు పడతారు, మధ్యలో ఈ తెలుగు సంఘాల లేదా ఎన్నారైల, ధన పంపిణీ గొడవ ఏమిటి? మరి ఫండింగ్ ఎలా, ఇంతమందితో కూరుస్తున్నారు? వారికి వేదిక ఏమిటి? వారికి ప్రయోజం దోపిడీ ఏమిటి?

విదేశాల నుంచి ధనమున్న, అధికారమున్న, అహంకారమున్న ఎన్నారైల గుంపు, ఎన్నికలలో తమ కుటుంబ లక్షణాల నక్క పులి పాము లను గెలిపించడానికి, తమ వ్యాపారాలు అధికారాలు బినామీలు పెంచుకోవడానికి, తెలుగు సంపద దోచుకోవడానికి, తమ కపట నటన 2 నాల్కల ద్రోహం నిలబడటానికి, తమ వారికి సీట్లు గెలుపు చేయడానికి, తెలుగు నేల చేరింది. వారి పని, తమ తమ కుటుంబ బానిస పార్టీలకు అండగా, ప్రజా ధన పధకాలకు కుటుంబ పేర్లకు అండగా, తమ నాయకులు కోట్లకు పైగా ధనము ఆదాయం పెంచడానికి, ప్రచారం అంట.

అసలు 5 ఏళ్ళుగా స్థానికముగా లేనివారికి, పార్టీల టికెట్ ఎందుకు? వారి ధనానికి ఆశపడా? మరి అక్కడ ఉన్న స్తానిక నాయకుల నోటిలో మట్టేనా? మంచి అభ్యర్ధి అంటే, ధనము పలుకుబడి మాత్రమేనా? మరి ఇన్నాళ్ళు కష్టించిన కార్యకర్తలు, పనికిమాలిన వారా? అంటే రాజు ను మోసే కూలీలు కావాలి కాని, అధికారం వారికి వద్దా?

ప్రచారం వరకు తప్పులేదు, వారు వీసా లేదా పచ్చ కార్డు తో ఉంటే. కానీ ఓటుకు నోటు తో కొందాము, అదీ అవతల పార్టీ వారిని మాత్రమే, ఆ *వెధవ*లని ఎలాగైనా మార్చాలి, వారికి పెళ్ళాం పిల్లలు అవసరాలు ఉంటాయి. అలా అనవచ్చా? ఒక్కో పల్లెటూరిలో ఓ 4 నుంచి 10 వైసీపీ కుటుంబాలను కనీసం 2 లక్షలు ఖర్చు పెట్టి అయినా, వారి బలహీనతలు కని పెట్టి, వారి అవసరాలు తీర్చి, మన చావు తెలివితేటలు చూపించి, మన ఓట్లు పెంచాలి, అని వారి ధన మద అహంకారాన్ని ఎత్తి చూపింది ఈ సంఘటన. మన ప్రచారం వలన, మన వారికి లాభమా, ఇంకా ఎక్కువ నష్టమా? మన పచ్చ బులుగు పత్రికలు ఎందుకు చూపించవు, ముసుగులో కుట్రలు?

వీరు మామూలు ఎన్నారై ఐతే ఒక లెక్క, కానీ వీరు అనుభవం గల తానా మాజీ అధ్యక్షులు, ఎంతో మంది నటీ నటూలకు, అమెరికాలో షాపింగ్ అవసరం అవకాశం కల్పించిన ఉత్తములు. నేటి గెలిచిన తానా అధ్యక్షులకు అండ. వీరు, సామాన్య స్తితి నుంచి, నాటి లక్కిరెడ్డి పాద సేవ దగ్గర నుంచి ఎదిగి, హోటల్ లో కప్పులు కడిగి, ఎన్నో ఎన్నో చెప్పలేని గొప్ప పనులు చేసి, ఇక్కడ దాకా వచ్చారు, హోదాకు తగిన కేసులు ఉన్నాయి అని, సాక్షి టీవీలో దుమ్ము దులుపుతున్నారు, గత చరిత్ర అంతా తవ్వుతున్నారు.

అవసరమా, మన పరువు తో పాటుగా, మన సంస్థ అలాగే ఇతర ప్రవాసుల పరువు తీయడం? రేపు మన తానా లేదా ఇతర తెలుగు సభలకు రాకుండా, ఆయనను బహిష్కరిస్తున్నామా, మనకు అండ లేకపోతే? అందరూ ఎన్నారైల పరువు తీయడం ఎందుకు? అందుకే గతములో చెప్పాము, తెలుగు సంఘాల ఎన్నికలలో నిలబడే వారికి, తెలుగు రాష్ట్రాల ఎన్నికల లో చేతులు కాళ్ళు వేళ్ళు పెట్టం, పార్టీలతో కుమ్ముక్కు అవ్వము అని అఫిడవిట్ తీసుకోవాలని, గుర్తు ఉన్నదా?

గుణ నీతిగల ధీరులకు ముఖాముఖి వాదన/ఆత్మగౌరవ 20 ప్రశ్నలు

ఇప్పుడైనా, వెన్నుపోటు గుండెపోటు 2 నాల్కల ధోరణి వాట్సాప్ రీడ్ రిసీప్ట్ ఆపే దొంగ బుద్ది మానదాం. ఆ తప్పుడు బుద్ది, నేడో రేపో, మన కుటుంబములోనే జరుగుతున్నది. గుణ సంస్కారాన్ని మన కుటుంబములో పెంచుదాం, మంచిని పెంపొందిద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,894,940; 104 తత్వాలు (Tatvaalu) and views 227,357
Dt : 25-Apr-2024, Upd Dt : 25-Apr-2024, Category : General
Views : 105 ( + More Social Media views ), Id : 2093 , Country : USA
Tags : NRI , TDP , leader , slipped , mouth , backstabbing , merit , certificate , leaders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content