తానా అటా నాట్స్ టాటా లేదా ఏ తెలుగు సంఘము అయినా - నీతిగల ధీరులకు ముఖాముఖి వాదన/ఆత్మగౌరవ 20 ప్రశ్నలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,881,027; 104 తత్వాలు (Tatvaalu) and views 226,222.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

***May 14,2023 Update - కొత్త తానా ఎన్నికలు రాబోతున్నాయి 2023 లో, గతము లో ముగ్గురు పోటీ, ఇప్పుడు అందులో నుంచే ఓ ఇద్దరు రు పోటీ. గోగినేని-తాళ్లూరి మరియు కొడాలి-లావు, మరలా తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందరూ పెద్ద మనుషులే, సామరస్యం లేక, కోర్టుల కు ఎక్కారు, ఇంకేదో చేసారు. ఏకగ్రీవ బానిసత్వం కన్నా, ఇది కొంత నయం. వీరిని అభినందిస్తున్నాము.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ధ్రువీకరణ, కొత్త సభ్యులు కు ఓటింగా వద్దా, . . .ఎవరి ఎత్తులు జిత్తులు వారే వేసుకుంటున్నారు. ఎన్నికలెప్పుడు అంటే, హైదరాబాద్/ విజయవాడ తెలుగు నేలపై, చిలక జోస్యం అడిగి చెపుతాము అంటున్నారు. మరి వీరు కూడా, బీహార్ నుంచి పీకే లేదా ఇతర సహాయం తీసుకుంటారేమో చూడాలి.

ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల నాయకులు, మా పిచ్చి జనాలను మరలా 5 ఏళ్ళు మోసం చెయ్యాలి మత్తులో ఉంచాలి అంటే, ఆత్మాభిమానం వదిలి, ఇతర రాష్ట్రాల గాంగ్ ల కాళ్ళు పట్టడమే, మంచిపని అని కాంట్రాక్ట్లు ఇస్తున్నారు తెలుగు ధనాన్ని. అవసరానికి తల్లికి అల్లం పిన్నికి మాత్రం బెల్లం అనే మన జనాలు కూడా, వేమన బ్రహ్మం రాఘవేంద్ర స్వామి అంటే తెలీదు, పరాయి రాష్ట్ర/ భాషా/ మత బాబాయి కే మా ధనం అంటున్నారు.

మత్తులో ఉన్న జనాలేమో, మరలా ఆనాటి, ఆంగ్లేయుల పాలన బానిసత్వం మరలా వచ్చినాక ఓ శ్రీలంక వెనిజులా పరిస్తితి వచ్చాక, నిద్రలేద్దాము అని, చేతిలో ఏదో ఒకటి పడితే, చాలులే, అని నక్క పులి పాము కే మా వంశ ఓటు, అంటున్నారు సౌమ్యముగా. గోవులు కపట నటన పూజలేకే గాని, ఓటుకు కు కాదు, తూచ్ అంటున్నారు. మరి ఈ తెలుగు తేజాలు, విదేశాలకు వెళ్ళినా, అంతరిక్షానికి వెళ్ళినా అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వదులుతాయా?

అవన్నీ మనకు వద్దు, మానసిక మార్పులు, పంచభూతాలు తల్లి దండ్రులు అంటే గౌరవం ఉందా లేదా మాత్రమే మనకు కావాలి. గుణవంతుడు హ్రుదయస్పందన కలిగిన, మంచి నాయకులు వస్తున్నారా లేదా, కొత్త మార్పులు తెస్తున్నారా లేదా, బానిసత్వం వీడుతున్నారా లేదా, అన్నదే మనకు చాలు. జవాబులు వస్తే, మీతో పంచుకుంటాము. విలేఖరిగా, ఎప్పుడు ఎవరితో మాట్లాడాము అన్నది మేము చెప్పకూడదు, మీరు అడగకూడదు, వారూ చెప్పకూడదు.

2021 ఏప్రిల్ లో ఈ 20 ప్రశ్నలు, అన్ని తెలుగు సంఘాలను అడిగాము. మరి అమెరికా లో ఉంటూ అధ్యక్ష పదవికి జరిగే, ముఖా ముఖి వాదన చేసే ధైర్యం సంస్కారం భోళాతనం, కనీసం పైన ఉన్న ఓ 5 పదవులు కు, అలాగే మా ప్రశ్నలకు తెలుగులో జవాబు రాసే పంపే, నీతి నిజాయితీ ఈ నాటి వరకు ఎవరికీ లేదు అని చెప్పటానికి, మేము సిగ్గుపడుతున్నాము, ఓ సంస్కార తెలుగు వారిగా.

కానీ ఆ సంఘాల పార్టీల నాయకులు పట్టించుకోరు, ఎందుకంటే తమ స్వార్ధాన్ని అహంకారాన్ని ఆధిపత్యాన్ని బానిసత్వాన్ని క్రుతజ్ఞతలు విశ్వసనీయతను, వెలికి తీస్తున్నాయి. ఇది ఒక్క సంఘం గురించి కాదు, అన్ని సంఘాల గురించి. నాయకులు ఏ ఒక్కరూ కూడా, తమ ముదుసలి తల్లి దండ్రుల సేవ గురించి, తమ పిల్లలకు ఎంత తెలుగు రాయడం పలకడం పాడటం పద్యాలు వచ్చు గురించి, వీరి పదవి కి పౌరసత్వం కాకుండా, పచ్చ కార్డుల వీసాల పై తెలుగు పార్టీలకు సలాం చేసే అవకాశాలను ఎందుకు ఇస్తున్నారో, ఇప్పుడైనా చెబితే, సంతోషిస్తాము. - 5/14/2023***

అమెరికా తెలుగు సంఘాలు, అవి తానా అటా నాట్స్ టాటా లేదా ఏ తెలుగు సంఘము అయినా (TANA, NATA, TDF, NATS, TATA, GWTCS, BATA, వారధి, TAM, ఉజ్వల మరియు అనేక ఇతర ప్రాంతాల వారీగా సంస్థలు), వారి విపరీత సేవలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న, అమెరికన్ తెలుగు పౌరులకు ఈ కింది ప్రశ్నలకు జవాబులు చెప్పాలి, ఇంకనుంచి అయినా పాత చెడ్డ పద్దతి మార్చుకోవాలి.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే, బానిసత్వ ఏకగ్రీవ ఏకపక్ష మోసము అబద్దపు ఎన్నికలు ఇకనైనా ఆపాలి, దొంగలు దొంగలు ఊళ్ళు పదవులు పంచుకున్న విధముగా, మనం ఉండరాదు. ఈ రోజుల్లో, భార్యా భర్త, తల్లి కొడుకు, అక్కా చెల్లెలు, ల మధ్యలో నే లేదు ఏకగ్రీవం. ఇంకో కధనము లో వివరముగా రాశాము చూడగలరు. విదేశాలలో తెలుగు సంఘాలు కులం మరియు ప్రాంతాల వారీగా, తమ వారికోసం చీలిపోయాయి అని అంటున్నారు.

వీరు ఫలానా రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తూ, ఎన్నికల సమయంలో తమ డబ్బును పార్టీకి విరాళంగా పెట్టుబడిగా, పెడుతున్నారు. ఎన్నికల తర్వాత తమ పెట్టుబడులకు, మంచి రాబడులు రావడంతో లబ్ధి పొందుతున్నారు అని అందరూ భావిస్తున్నారు. అంటే ఇతరుల సేవ సంగతి దేవుడు ఎరుగు, మన సేవ మన వాళ్ళ సేవ లో మునిగి తెలుతున్నారు. అంటే నేల నీరు మారినా, మన స్వార్ధ బానిసత్వ కుంచితపు బుద్దులు ఆలోచనలు పతనము మారడం లేదు.

నాలుకపై నుండి వచ్చే తెలుగు భాష రమ్యం, తెలుగు వారి సేవ గమ్యం అనే అందమైన పదాలు, సంస్థ అధ్యక్షుల మరియు కార్యవర్గ సభ్యుల, చేతలలో నడవడికలో రాతలో వ్యక్తిత్వము లో, ఉన్నాయా? వారు సాగిస్తున్న నాన్ ప్రాఫిట్ సేవలలో నిజము గా ప్రతిబింబిస్తాయా?

మా ప్రశ్నల అవగాహనలో తప్పు ఉంటే సరి చేయండి, మీరూ అనుబంధ ప్రశ్నలు వేయండి, వీటికి కలపండి. అధ్యక్ష అభ్యర్ధులు అందరూ ముఖాముఖి వాదనలకు వేదిక చేయండి, ఖర్చు తగ్గించి, అందరి ప్రాణాలు కాపాడండి. Please see other articles link.

మొట్టమొదటి సారిగా, సహజ నాయకత్వ ధైర్యం ఉన్న ప్రెసిడెంట్ అభ్యర్ధులు అందరినీ ఆహ్వానించి, మాతో కాకపోయినా ఎవరితో అయినా వారు ధైర్యముగా వాదించాలి అన్నది, ముందుగానే బహిరంగముగా ప్రశ్నలు విడుదల చేసిన మొదటి మీడియా మాది కాదంటారా?

1. అసలు అమెరికా లేదా ఏ దేశ తెలుగు సంఘ ముఖ్య ఉద్దేశ్యము, ఆ దేశ పౌరసత్వం ఉన్న తెలుగు పౌరుల నాయకత్వములో, ఇక్కడ పుట్టిన మరియు ఏళ్ళుగా స్థిరపడి ఉన్న కుటుంబాల కలయికతో, తెలుగు నేల పై రాజకీయ కాంక్ష లేకుండా, వారి పిల్లల కు తెలుగు భాషా సంస్ర్క్రుతి నేర్పుతూ, వివిధ కార్యక్రమాలు చెపడుతూ, తెలుగు నేలపై మమకారాన్ని నిలబెట్టి తెలుగు రాష్ట్రాలలో కూడా సేవలు అందిస్తూ, ఉత్తమ తెలుగు తేజాలు గా వారిని తయారు చేయడం.

దీనితో పాటుగా, తెలుగు వారు ఎవరైనా, ఉద్యోగము చదువు పర్యటనకు వస్తే వారికి అండగా ఉంటూ, ఏదైనా ఆపద జరిగితే, వారికి తోడు నీడలా ఉండటము. అంతేనా?

ఎక్కడ కూడా, స్వార్ధం, రాజకీయ వాసనలు లేకుండా, తెలుగు నేలపై జరిగే స్వార్ధ ఆర్భాట ప్రచారము, వారి బంధువుల అవసరాలకు ఎన్నికలకు పదవులకు దూరముగా ఉండాలి. నిధులు సేకరించి, జన్మ భూమి రుణం తీర్చుకోవాలి. అంతే కదా?

2. A. మీ అభ్యర్ధులు అందరి లో అలాగే మిగతా టీం నాయకుల్లో, తెలుగు వాట్సాప్ లాంటి సొషల్ మీడియాలో రాయడం ఎవరికి ఎంత మందికి వచ్చు? ఓ 2 తెలుగు పద్యాలు లేదా శ్లోకాలు మీరు చెప్ప గలరా, పాడ గలరా, కధనం రాయగలరా? ఇది ఎందుకు మీరు అర్హత గా కలపడం లేదు, తెలుగు సంఘం అని ఉత్తుత్తి పేరుకే అంటారా?

B. మీకు జీవిత భాగస్వామి మరియు పిల్లలు ఉంటే, వారికి, ఎంత వరకు తెలుగు వచ్చు/ నేర్పారు? వారిచే, శుద్ద తెలుగు చదివించి, రాపించ గలరా? పోనీ అమెరికా తెలుగు సంస్థ నుంచి సర్టిఫికేట్ ఉందా? ఎందుకంటే, తెలుగు పై మీ ప్రేమ, నిబద్దత, గౌరవం, క్రుతజ్ఞత తెలుస్తుంది కదా దీని వలన.

C. మీ ముదుసలి 60 దాటిన తల్లి దండ్రులను, అమెరికా తెచ్చి, మీ సౌకర్యాలు అన్ని అందించి, ప్రపంచ అత్యుత్తమ వైద్యం సౌకర్యాలు, కనీసం 2 ఏళ్ళు అందించారా, ఇక అందిస్తారని సాక్ష్యం ఉందా? లేక అందరిలాగా, వాళ్ళు మమ్మల్ని నమ్మి రారు, అసలు వారికి మా పిల్లలంత సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి, మేము విశ్వాశ ఘాతకులము కాబట్టి, ఇక్కడ పడదు, ఇంట్లో వారు ఒప్పుకోరు. అని ఏవో కాకమ్మ కబుర్లు, ఆత్మసాక్షిని చంపుకుని చెపుతారా?

మీరు మీ తల్లి దండ్రులకు చేసిన, పెద్ద సహాయం ఏదైనా ఉందా 60 తర్వాత, తూలిపడే వయసులో? ఊళ్ళో సదుపాయాలతో పడేసాము అనకుండా. మేము పుట్టిన ఊళ్ళో ప్రతి సంవత్సరం 2 నెలలు వారితో ఉండి, వారి సేవ చేసాము, వ్యాపార ఉద్యోగ ధనం వదిలి లేదా ఇంట్లో నుంచి పని చేస్తూ, ఇలాంటివి.

D. క్రుతజ్ఞతలు మరిచి, మీరు ఇలాంటివి సేవా త్యాగాలు ఏమీ చేయకుండా సొంతవాళ్ళకు, ఇతరులకు సేవ చేస్తామని ఎలా చెపుతున్నారు? ఎలా నమ్మాలి?

3. పదవి కోసం పోటీ చేసే మీరు అమెరికా లేదా నివాసం ఉన్న దేశ పౌరసత్వం ఉన్న తెలుగు పౌరులా? లేక తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో, మీరు మీ బంధువులు ఎదగాలని కోరుతూ, వారి అండకోసం ప్రచార పిచ్చి పలుకుబడి కోసం, వ్యాపార లాభం జరగాలని, ప్రజల ధనముతో ఉచిత ప్రచారం కోసం వచ్చిన, 5 ఏళ్ళ కు పైగా ఉన్న పచ్చ కార్డు దారులా, లేక తాత్కాలిక వీసా పై ఉన్నవారా?

4. సభ్యులు ఎవరైనా ఉండవచ్చు, సేవలు సహాయం ఎవరికైనా చేయవచ్చు, సందేహము లేదు.

అసలు ఓటు హక్కు ఎవరికి ఉంటుంది సంఘములో, అమెరికా పౌరులకే గదా? లేదా వీసా, పచ్చ కార్డు, విసిటర్ లకు కూడా నా? ఎవరి శాతం ఎంత అని మీ వెబ్సైట్ లో వివరము ఉందా? మరి అందరికీ ఓటు హక్కు ఇస్తే, మరి దానికి ప్రతిగా, ఇండియా లో కూడా, అమెరికా తెలుగు పౌరులకు, అక్కడ సంఘాలలో పార్టీలలో ఎన్నికల్లో ఓటు హక్కు ఉందా, తీసుకు రాగలరా?

మీరు నాయకులతో అడిగి ఇప్పించగలరా? ఇప్పించలేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు, మీ స్వార్ధం లేకుండా? అందరి సేవకు, ఓటు హక్కు కు సంబంధం లేదు కదా?

5. ఇప్పటి వరకు అధక్షుడు, ఉపాధ్యక్షుడు, ట్రెజరి, సెక్రటరీ గా ఎంత మంది అమెరికా తెలుగు పౌరులు ఉన్నారు? ఇప్పుడు కొత్త పానెల్స్ లో ఎంత మంది ఉన్నారు? అమెరికా తెలుగు పౌరులు మరియు పచ్చ కార్డు దారుల నిష్పత్తి ఎంత? తేడాలు ఎందుకు? ఎవరు ఎక్కువ ఉండాలి? వారిలో తెలుగు రాయడం చదవడం వచ్చిన వారు ఎందరు? ఎందుకు ఇతరులు, ఆసక్తి చూపడము లేదు. కనీసం తెలుగు అమెరికా పౌరులను గౌరవిస్తూ, 50 శాతం రిజర్వేషన్ అయినా ఉందా? అంతా తాత్కాలిక వారితో నాటక బూటకమే నా?

6. వీరిలో పచ్చ కార్డు వారు, నాయకులు గా ఉంటే, వారు తమ బంధువులు లేదా తాము తెలుగు నేలపై ఉండే రాజకీయ నాయకులతో, పదవులతో అధికారముతో ప్రచారముతో ఊరేగమని, బానిసలు అనుచరులు గా ఉండమని, అన్ని రాజకీయాలకు దూరముగా భవిష్యత్ లో ఉంటామని, అఫిడవిట్ ప్రమాణముతో తీసుకున్నారా? తర్వాత ఏళ్ళలో వాటిని చెక్ చేసి నోటీసులు ఇచ్చారా?

ఎటువంటి ఇండియా పదవులు ఆశిన్చమని, భవిష్యత్ లో తీసుకోమని, వారి పధకాలలో సొంత ప్రచారానికి భాగం కామని, అఫిడవిట్ ఇప్పుడైనా తీసుకుంటున్నారా?

అది ఇవ్వనప్పుడు, వారి స్వార్ధ ప్రయోజనాలకు ఎందుకు, అమెరికా తెలుగు పౌరులను, మైనారిటీ గా లేదా సున్నా చేసి, ఈ పదవుల ధనము పంపకము జరుగుతున్నది? పచ్చ కార్డు వారు వీసా వారు, తమ వ్యాపారాల అభివ్రుద్ది కి, ఈ పదవులు వాడలేదా, ఇక వాడరా?

7. ఆంధ్రా లో తెదేపా (వైకాపా) అధికారంలో ఉంటే, తానా (అటా) నాయకులు పోటీ పడ్డా అర్ధము ఉంది కానీ, వైకాపా అధికారంలో ఉంటే, తానాకు పైసా విలువ ఉండదు అని అందరికీ తెలుసు. అయినా కూడా, ఎందుకు ఇంత భీకర పోటీ జరుగుతుంది, ఇన్ని ఆరోపణలతో?

ఏమిటా చిదంబర రహస్యం? రాజకీయ పలుకుబడి కోసమా? ఎవరి సేవ కోసం? ధన పంపిణీ కోసమా? సినిమా వారి కోసమా? లేక పాత తప్పులు కప్పిపుచ్చడానికా?

రేపు ఒకరు గెలిస్తే ఇంకొకర్ని పూర్తిగా తొక్కేయరా? లేక చీలిక రాదా? లేదా ఇద్దరు కలిసిపోయి గెలిచిన వారి కాళ్ళు మొక్కి, జరిగిన మోసం అవినీతి అన్యాయమును, సమాధి చేయరా?

8. మాజీ అధ్యక్షులు లేదా ఇతర నాయకులు, తమ వ్యాపారాల అభివ్రుద్దికి, ఉదాహరణకు తానా అధక్షుడు గా గతం లో చేసిన వారు, జయరాం తన హోటల్ అభివ్రుద్దికి కాంఫరెన్స్ హాల్ అద్దె భోజనాల ఆర్డరు తో లాభాలు పొందారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆంధ్రా ప్రభుత్వం నుంచి పదవి పొందారు అని, టికెట్ కై ప్రయత్నము చేసారని ఆరోపణలు. అలాగె వేమన పై కూడా, ఇవి నిజమేనా?

తానా లేదా ఇతర సంస్థ పేరు మరియు పదవి, తెలుగు నేలపై, రాజకీయాలు లేదా పదవికి వాడినదుకు, మాజీ అధ్యక్షుల లేదా నాయకుల నుంచి, సంస్థకు నష్ట పరిహారము లేదా క్షమాపణలు కోరవచ్చునా? ఇకనుంచి ఇలా జరగకుండా ఆప వచ్చునా?

తానా పదవిని, రాజకీయాం గా వాడుకోవచ్చునా? ఇలాంటి నాయకులు ఎంత మంది ఉన్నారు? దీనిని బట్టి, పచ్చ కార్డుల వారికి, నాయకత్వ పదవి ఇవ్వ కూడదు, అంటే మీరే మంటారు?

9. ఇండియా నుంచి రాజకీయ నాయకులను ఎందుకు తెస్తున్నారు? పొనీ తెచ్చినా, ఒకసారికి ఒకరిని కాకుండా, గుంపు నాయకులు, వారి ప్రసంగాలు ఎందుకు విదేశాలలో? ఎవరి మెప్పు కోసం? అక్కడ పదవులు పలుకుబడి అవసరాల కోసం, మీరు సంఘమును వాడడం కరెక్టేనా?

10. హీరోయిన్ (మరియు హీరో) లను ఎందుకు తేవడం? ఒకరు కాకుండా గుంపు ఎందుకు తెస్తున్నారు? వారిని హోటెల్ లో గౌరవముగా ఉంచి, కార్యక్రమము తర్వాత వెంటనే పంపకుండా, ఇళ్ళకు అలాగే బయట ఊరు టూర్ కు, నాయకులు ఎందుకు తీసుకు వెళుతున్నారు?

ఆ ఫోటోలు, సోషల్ మీడియాలో ఎందుకు గొప్పగా పెడుతున్నారు. పదిమంది డొనేషన్ తో తెచ్చిన, వారిని, ఇలా కేవలము నాయకులు మాత్రమే తిప్పడము ఫోటోలు దిగడము, దిగజారినట్లు లేదా? ఇదేనా తెలుగు ఆత్మ గౌరవం కాపాడటం?

హీరోయిన్లపై లైంగిక వ్యాపార ఆరోపణ ల లో, తెలుగు సంఘ నాయకుల పాత్ర ఎంత? ఆ కేసులు ఏమైనాయి? ధనముతో మూసేసారా? లేక సాగుతూనే ఉన్నాయా?

సంస్క్రుతిక కార్యక్రమాలు, అమెరికా తెలుగు పిల్లలతో చేపించాలి గానీ, అక్కడి వారు ఎందుకు?

11. సంస్థ కున్న, పన్ను సేవింగ్ ను ఆసరాగా తీసుకుని, నిధులు ఇండియా పంపుతూ, తమ స్వార్ధానికి వాడుతున్నారు అని, ఆరోపణలు. నిజమా? ఎందుకు ఈ పుకార్లు వస్తున్నాయి.

సేకరించిన లేదా సంస్థ నిధులు, సొంత ట్రస్ట్ లకు నిధులు గా మార్చుతూ, తాము పంచుతూ ప్రచారం ఫోటోలతో నాయకులతో పొందుతున్నారు, స్థానికముగా అని ఆరోపణలు మీరేమంటారు?

12. మీరు నిధులు మింగారు రశీదులు లేవు అని వీరు, అలాగే మీరు కార్యక్రమం చేసినప్పుడు అంతే కదా అని వారు. ఎన్నికల ముందు దాగా ఆ పంచాయితి ఎందుకు తెగలేదు? ఇప్పుడు అంతా ఒక పానెల్ అయితే, ఇక ఆ ఆరోపణలు సమాధి అయినట్లే గదా? ఇక జరగవని హామీ ఏమిటి?

13. 2021 ఎలెక్షన్ సమాచారము, కాండిడేట్ల ఈమైల్ ఫోన్ నంబర్ల విషయాలు, తానా లేదా ఇతర తెలుగు సంఘ వెబ్సైట్ లో కనపడలేదు. ఎందుకు దాచారు, ప్రజలు అందరూ సమాచారము చూడవద్దా? ప్రశ్నలు అడగవద్దా? ముందు ఒపెన్ గా పెట్టి, తర్వాత ఎందుకు దాచేది? ఇది వాస్తవమేనా?

కరోనా సమయములో గుంపులుగా ఎందుకు తిరుగుతున్నారు, కలుస్తున్నారు? కరోనా తో ఏదైనా అయితే, ప్రాణాల బాధ్యత ఎవరిది? నష్టపరిహారం మీ సొంత ఖర్చులతో ఇస్తారా?

14. మీరు ఉద్యోగాలు వ్యాపారాల లో ఉన్నారా లేక ఖాళీగా నా? గెలిచిన తర్వాత దేశం మొత్తము తిరగ గలరా? అందరికీ ఫొన్ లో అందుబాటులో, ఉండ గలరా? ఇతర వర్గ మీడియా పిలిస్తే మీరు వెంటనే కనీసం జవాబు చెప్పలేదని తెలుస్తుంది.

ఫేస్బుక్ టాగ్ చేసినవి కూడా పని చేయడం లేదు, మీవి పాత నాయకులవి, భయం ఎందుకు? ఇన్నాళ్ళు పదవులు అనుభవించి, ఇప్పుడు, ఫేస్బుక్ టాగ్ ఫొన్ లు ఆపుకోవడం ఎందుకు?

15. పాత నాయకులు, ప్రత్యేక ఆహ్వానితులు గా వచ్చి పోవాలే గానీ, దూరంగా ఉండి సలహాలు ఇవ్వాలే గానీ, తెలుగు సంఘ పాలన విషయములో ఎందుకు జోక్యం? తమ ఆలోచనలు తమ వర్గాన్ని రుద్దడం ఎందుకు? ప్రచారానికి ఎందుకు? ఎండోర్స్మెంట్ ఎందుకు, మిగతా వారిని విడదీస్తూ?

16. ఏదో ఒక పార్టీ లేదా మీడియా కు, అనుకూలము గా ఎందుకు ఉంటున్నారు? ఆ మచ్చ తొలగించుకుని, అందరికీ అందుబాటులో కి ఎప్పుడు వస్తారు?

17. పాత తప్పులు ఏవి మీ ఉద్దేశ్యము లో? మీరు ఎలా సరి చేస్తారు? మీ కొత్త ఆలొచనలు ఏమిటి? వాటికి టీం ఇతర సభ్యులు సహకరిస్తారా? పోటీ దారులలో, మీరే ఉత్తములు గాడ్ ఫాదర్ లేరు అందరినీ కలుపుకోగలరు అని ఎలా నమ్మిస్తారు ఉదాహరణలతో?

18. అమెరికా రాజ్యాంగము ట్రంప్ కు నేరు గా పదవి ఇస్తే, మన దగ్గర ఎంపీ ఎమ్మెల్యేలు నేరు గా కొత్త వారు ఉంటే, ప్రజలకు విపరీత మైన సేవ చేస్తుంటే, తానా లేదా ఇతర సంస్థలు, కొన్ని ఏళ్ళు మాకు బానిసలు గా కింది పదవులు చేసి, గాడ్ ఫాదర్ భిక్షతో, ప్రెసిడెంట్ పదవి అందుకోవాలి అనడం తప్పు కాదా? ముఠా రాజకీయాలకు ఇది మూలం కాదా? ఇది ప్రజాస్వామ్యమా?

19. అసలు అమెరికాలో ఉంటూ, బాలెట్ కలెక్షన్ అనే నీచ నిక్రుష్ట అనాగరిక సంస్క్రుతి ఎలా వచ్చింది? తమ వర్గానికి, ధనానికి, అవసరానికి, అవకాశ వాదానికీ లొంగి బాలెట్ పేపర్లు ఇచ్చే లేదా తీసుకునే, ఆత్మాభిమానం సంస్కారం లేని, చదువుకున్న మూర్ఖులు అమెరికాలో కూడా ఉన్నారా?

20. మీరు ఉద్యోగ, ఆదాయం సౌకర్యాలు వదులుకున్నవి మరియు ఏమైనా మంచి పనులు సేవలు త్యాగాలు గుణాలు అరిషడ్వర్గాల సాధన ఉన్నాయా?

బాలెట్ కలెక్షన్ లేకుండా, వారు అమెరికా అదే అడ్డ్రెస్స్ లో నివాసం ఉన్నారో లేదో తెలుసుకుని, ఓటు ఎలా పరిగణలోకి తీసుకుంటారు?


మరి కొన్ని సంస్కరణలు తో అయినా, మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ, అవినీతి ఆశ్రిత పక్షపాతం రాజకీయ అనుబంధాన్ని తగ్గించి, సోషల్ మీడియాలో తెలుగు చదవడం రాయడం వచ్చిన, అలాగే తమ ముదుసలి కన్న తల్లి దండ్రులను ఇంట్లో పెట్టుకుని సౌకర్యాలు కల్పించి సేవ చేస్తున్న, అమెరికన్ పౌరసత్వం ఉన్న నాయకులను ఎన్నుకునే, అమెరికాలో స్థిరపడిన వారికి సేవ చేసే, విధముగా బైలాలో స్పష్టము గా మార్చి, ప్రగతికి అడుగులు పడతాయని ఆశిస్తున్నాము.
---

ఇలాంటి ఇంకా ప్రశ్నలు ఉంటే, నాయకులు నుంచి కూడా చెపితే, కలుపుదాము. ప్రజలకు తెలియాల్సింది కొండంత, కానీ బయటకు వస్తున్నది గోరంత, మీడియా మేనేజ్మెంట్ వలన. ఏ రోజుకైన నిజాలు బద్దలు అవుతాయి, సంఘాలు విడిపోతాయి, మరలా కొత్త దుకాణాలు మొదలు వారి స్వార్ధం కోసం, అందరూ రోడ్ న పడటం ఖాయం సుమా, మార్పులు కోరకపోతే.

సిలికానాంధ్ర లో కూడా, ఒక వర్గం ఒక వ్యక్తి పట్టు మాత్రమే నడుస్తుంది అంటున్నారు. కాకపోతే, వారి సాంస్క్రుతిక కార్యక్రామాలు పద్దతులు అన్ని పరవాలేదు. ఈ తెలుగు సంఘాల లాగా, మరీ ఇంత అధ్వాన్నము గా రాజకీయము ఉండవు అంటున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,881,027; 104 తత్వాలు (Tatvaalu) and views 226,222
Dt : 02-Apr-2021, Upd Dt : 14-May-2023, Category : America
Views : 1130 ( + More Social Media views ), Id : 1069 , Country : USA
Tags : tana , ata , nats , usa , nri , telugu , community , face to face , arguments , election questions

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content