పాటతో పరమార్ధం- ఆకాశం ఎందుకో పచ్చబడ్డది - స్వయంవరం - శోభన్ బాబు, జయప్రద, దాసరి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,141,864; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aakasam Enduko Pachchabaddadi - Swayamvaram - Sobhan Babu, JayaPrada, Dasari - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

ఎన్నో పాటలు ఉన్నా, కుటుంబ సమేతముగా చూసేవి, చెడు పదాలు రాగాలు భావాలు లేకుండా ఉండేవి, గొంతుకు ప్రాధాన్యత ఇచ్చేవి, మనశ్శాంతి కలిగించేవి, కవిత్వ భావనలు కలిగించేవి, సాత్విక లక్షణాలు పెంచేవి, మనసు లోతుల్లోకి వెళ్ళేవి, చాలా తక్కువ ఉంటాయి. అలాంటి పాటలో ఇది ఒకటి.

ఎప్పుడైనా, సముద్ర తీరాన, ఉదయం సుర్యోదయానికి, సాయంత్రం సూర్యాస్తమానికి ఉండే ఆ ఆహ్లాదకరమైన వాతారవణాన్ని చూసారా. సముద్రం లేకపోయినా, ఇంటి ఎదురుగా, లేదా మేడ మీద నుంచి చూసినా, ఆకాశం వింతగా మనోహరముగా ఉంటుంది.

ఆ సమయమే, మనకు ధ్యానానికి, మంత్ర జపానికి, వేద నాద రాగానికి, మానసిక నియంత్రణకు, మనల్ని మనం తెలుసుకోవడానికి బాగుంటుంది.

ఉదయం 6 తర్వాత నిద్ర లెగిసే వారు, జీవితము లో ఎన్నో పోగొట్టుకుంటూ, ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. మీరు మాత్రం సూర్యోదయానికే అంటే సుర్యుడు రాకముందే, ఉదయం 6 కు ముందే, ఆర్ఘ్యం ఇవ్వడానికి, సూర్య నమస్కారానికి, అంటే ఆరోగ్యం నిలుపుకోవడానికి, లెగవాలి మిత్రమా.

ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ సూర్య బింబ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే చల్ల గాలుల తాకిడి, సముద్ర తీరం వెంట సాగే గువ్వల అలజడి, రా రమ్మని, మనశ్శాంతిని పొందమని, ప్రక్రుతి రమణీయతను ఆస్వాదించని, పిలిచే మన పైబడి/ వెంటపడి. మరి మీరూ, పాడి వినిపిస్తారు కదూ.

అతడు: ఆకాశం ఎందుకో. పచ్చబడ్డది.. ఆ నడుమ బొట్టే.మో ఎర్రబడ్డది. 2
వీచే గాలుల తా.కిడి, సాగే గువ్వల అలజడి, రా రమ్మని పిలిచే పైబడి...
ఆమె: ఆకాశం ఎందుకో. పచ్చబడ్డది.. ఆ నడుమ బొట్టే.మో ఎర్రబడ్డది.
వీచే గాలుల తా.కిడి, సాగే గువ్వల అలజడి, రా రమ్మని పిలిచే పైబడి...
||ఆకాశం||

ఆమె: పసుపు పచ్చ లోగిలిలో., పసుపు కొమ్మ కొట్టినట్టు
అతడు: నీలిరంగు వాకిలిలో., పసుపా.ర బోసినట్టు
ఆమె: పా.దా.ల పా.రా.ణి అద్దినట్టు.., 2
అతడు: నుదుటిపై. కుంకుమ. దిద్దినట్టు..
ఆమె: ఆకాశం ఎందుకో. పచ్చబడ్డది..
అతడు: ఆ నడుమ బొట్టే.మో ఎర్రబడ్డది.

ఆమె: పచ్చాపచ్చని పందిరంత, తాంబూల మేసినట్టు
అతడు: విరబోసిన తలనిండ, కనకాంబర మెట్టినట్టు
ఆమె: ఎర్ర నీళ్లు, దిష్టి తీసి, పోసినట్టు.. 2
అతడు: కర్పూర హారతి, ఇచ్చినట్టు..

ఆమె: ఆకాశం ఎందుకో. పచ్చబడ్డది..
అతడు: ఆ నడుమ బొట్టే.మో ఎర్రబడ్డది.
ఆమె: వీచే గాలుల తా.కిడి
అతడు: సాగే గువ్వల అలజడి
అతడు & ఆమె: రా రమ్మని పిలిచే పైబడి...

ఆమె: ఆకాశం ఎందుకో. పచ్చబడ్డది..
అతడు: ఆ నడుమ బొట్టే.మో ఎర్రబడ్డది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,141,864; 104 తత్వాలు (Tatvaalu) and views 240,249
Dt : 26-Apr-2024, Upd Dt : 26-Apr-2024, Category : Songs
Views : 252 ( + More Social Media views ), Id : 2095 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aakasam Enduko Pachchabaddadi , Swayamvaram , Sobhan Babu , JayaPrada , Dasari , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content