మీ సాత్విక ముదుసలి అమ్మా నాన్నల విన్నపం - పంచభూతాలచే భవిష్యత్ పాప నిర్మూలనం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,664; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Supplication of your sattvic old age parents - future sin eradication by panchabhutas

బిడ్డా, మేము మన తాతయ్య/నానమ్మ/అమ్మమ్మ లకు, ప్రేమ గౌరవం మర్యాద ఆప్యాయత తో, దగ్గర ఉంచుకుని, సేవ చేస్తూ, మీకు నేర్పిన క్రుతజ్ఞత, విశ్వసనీయతలు ఏమైనాయి?

Child, we served your grandparents, with love, respect, courtesy, and affection, by keeping with us. What are the gratitudes and loyalties learned from us?

ఓడిపోయినా, కేవలం ఆవుకే ఓటు వేద్దామని మనసా వాచా కర్మణా, మన వంశం కట్టుబడి ఉందే. మరి మీరు అవసరం అవకాశం కోసం దిగజారి పోయి, ఎందుకు పులి, నక్క, పాము కు ఓటు వేస్తున్నారు?

Manasa Wacha Karmana, our clan is committed to vote for cow only even if we lose. And why are you voting for a tiger, a fox and a snake after you have stooped to the occasion?

మమ్మల్ని ఎందుకు ఇలా కాటు వేస్తున్నారు? వణుకుతూ తూలుతూ నడవలేక పడిపోయే, చివరి వయస్సులో, మమ్మెందుకు మనశ్శాంతి లేకుండా అనాధలుగా వదులుతున్నారు?

Why are you biting us like this? Why are we being left as orphans without peace of mind at the last age, who are trembling and unable to walk?

ఆస్తులు అందలాలు మన వెంట పైకి రావని మీకు తెలీదా, చెప్పినా వినరా? అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం, మన ఇంట్లో మేము నేర్పలేదే? మేము మిమ్మల్ని, కట్నం ఆస్తులు వీసా పదవి అందం అధికారం అవసరం అవకాశం కోసం అమ్ముకోలేదే, జంతువులను అమ్మినట్లుగా? మరి మీరు ఎందుకు మమ్మల్ని అనాధలుగా వదిలేస్తున్నారు?

Don't you know that wealth and beauty/status do not follow us? Did we teach, in our house, the slavery of Ashtavyasan and Arishadvarga? No, correct? We didn't sell you for dowry assets visa position beauty power need opportunity, like selling animals? And why are you leaving us as orphans?

* మేము మతిమరుపునకు గురి అయితే కోప్పడకు Don't be angry if we cant remember
- నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో Remember your childhood..అందరితో మాట్లాడించాము, నడిపించాము, ఆడించాము. పది చోట్లకు తిప్పాము, అన్ని మాతో పాటే సమకూర్చాము, కోప తాపాలు లేకుండా. మరి మీరు తిరిగి, ముదుసలి వయస్సులో ఆసరా అవసరమైనప్పుడు, దగ్గర ఉంచి సేవ చేయరా, అన్ని తిప్పరా, అందరితో మాట్లాడించరా? కనీసం అందరితో మాట్లాడే చూసే, ఓ వీడియో ఫోన్ కూడా ఇచ్చి నేర్పరే? అలా చేయకపోతే, మా నోరు, మనసు, మాట, ఆలోచన పడిపోవా?

* మమ్మల్ని ముదుసలి, చాదస్తం, నస అనకండీ Don't call us old, headache, same story and words
- Remember your childhood చిన్నప్పుడు అదే నస, చాదస్తం, తిక్క పనులు ఎన్నో చేసినా, ఎన్ని బయట తగలువు వచ్చినా తెచ్చినా, ఇంట్లో ఎంత ఊసినా చెంబుకు వెళ్ళినా ఓంటి పోసినా, అంతా ఆనందముతో, సర్ది సరి చేసాము. మిమ్మల్ని విసుక్కోలేదు, పని మనుషులకు అప్పగించలేదు, దూరంగా వదలలేదు. మరి మీరు మమ్మల్ని పురుగులు గా విదిలిస్తే ఇప్పుడు? మేము రాక్షసులను పెంచినట్లేనా? మాకు శిక్ష కరెక్టే కదూ?

* బలహీనతతో మేము వేగముగా నడవలేకపోతే, చేయూతనివ్వు
If we cannot walk in weakness, give us a hand
- నీ మొదటి అడుగు గుర్తు తెచ్చుకో, బండి పట్టుకుని, అలాగే మా చేయి పట్టుకుని ఎలా నడక నేర్చుకున్నావో? Remember your first step, how did you learn to walk holding a cart and our hand? బయటకు మాతో వస్తాను అని ఎన్ని సార్లు వెంటపడ్డావో, ఏడ్చావో మొత్తుకున్నావో? మరి మాకు, మీరు చేతి కర్రలై, దగ్గర ఉండి నడిపించలేరా? లేనప్పుడు, మేము ఒంటరిగా దిగాలుగా మోడుల్లా, మంచానికే పరిమితమై, మిమ్మల్ని పెంచిన పాప ఖర్మలకు, కుళ్ళి క్రుశించి పోమా? సమాజానికి మీరు చేసే కీడు వలన, మాకు ఇంకా పాపం పెరగదా?

* మా రోగాలకు, కూసింత ఖర్చు పెట్టినప్పుడు లేదా అసలు ఖర్చుపెట్టకుండా దాచుకునేటప్పుడు గుర్తు తెచ్చుకో Remember when you spend little bit or didn't spend anything for our diseases
- నీ ప్రతి అవసరన్ని తీర్చడానికి మేము
- మా కనీస అవసరాలను కూడా చంపుకున్నామని..To meet your every need, even our minimum needs have been killed..
మిమ్మల్ని మా స్థాయిని బట్టి, పెద్ద పెద్ద ఆసుపత్రులకు, దగ్గర ఉండి, తీసుకుని వెళ్ళి, బాగు చేయించామే. మమ్మల్ని ఎందుకు, ఒంటరిగా లేదా ఇతరుల మీద లేదా ఊళ్ళో ఉన్న సౌకర్యాలు లేని బంధువుల దగ్గర విడిచారు? రేపు నీ వాళ్ళు నిన్ను అలా అవసరం తీరాక వదిలేయరా? ఎందుకు విడాకుల కేసులు, 15 ఏళ్ళ వివాహ జీవనం తర్వాత కూడా వస్తున్నాయి? ఆసుపత్రులు ఖాళీ లేవే? త్సునామీ, కరోనా, భూకంపాలు, ప్రమాదాలు మిమ్మల్ని మార్చలేవా? మా ధనముతో కాదా, మీరు చదివి/ వ్యాపారం చేసి, బెంగులూర్ చెన్నై హైదరాబాద్ మరియు విదేశాలలో కులుకుతూ కళ్ళు కానకుండా ఉంది? మీ సౌకర్యాలు మాకు కనీసం 5 ఏళ్ళు ఇవ్వలేరా? 20 ఏళ్ళు మా పంచన పడి తిన్నారే, ఆ శక్తి తో సంసారాలు చేసి, మీ లాంటి మూర్ఖులను ప్రపంచం మీద తోస్తున్నారే? మా ధనం, మాకు పెట్టడానికి, మీకు కష్టమా? కుక్కకి ఉన్న విశ్వాసం మీకు లేదా? మా తప్పులు, మీకు ఉద్యోగాలు వచ్చాక పెళ్ళిళ్ళు అయ్యాక మాత్రమే కనపడ్డాయా?

* మా ముదుసలి తనములో మమ్మల్ని బరువుగా భావించకు * Do not consider us as burden in our old age
- 9 నెలలు అమ్మ పొట్టలో 9 months in Mom womb . . .
- 19 ఏళ్ళు నాన్న తన కళ్ళలో మోసారని 19 years old father carried in his eyes.. మరి కనీసం 10 ఏళ్ళు చనిపోయే ముందు మీతో ఉంచుకోలేరా? ఉంచుకోలేకపోతే, ఇన్ని ఇచ్చినా మాకే క్రుతజ్ఞత విశ్వసనీయత చూపలేకపోతే, ఇంకా మీ భాగస్వామి మరియు మీ పిల్లలకు సంస్కారం ఎలా నేర్పుతారు? రేపు మీ బతుకు మాకన్నా ఇంకా ఘోరం కాదా? వద్దు బిడ్డా, పంచభూతాల/ కాలుని/ కాలచక్రం శిక్షణ మీరు తట్టుకోలేరు. మీ అంత నిర్దయగా, అవి కూడా కాలరాస్తాయి, వద్దు బిడ్డా, ఆ శిక్షణ మీకు వద్దు. మీరు రాసుకున్న రాతను మీరు తప్పించుకోలేరు.

* మేము కన్నది మిమ్మల్నే, మీ తలరాతలను కాదు. అలాగే
- మీరు మాలో చూడవలసినది మా ప్రేమనే కానీ, ఆస్తులను అవసరాలను అవకాశాలను కాదు. మీకు పిల్లలు పుడితే, ఊళ్ళు తిప్పి కూడా, ఊడిగం చేయించుకున్నారు. మీ ఇంట్లో కాపలాకు వాడుకున్నారు. నగరాలు దేశాలు తిప్పారు. కానీ 60 దాటాక, ఏరు దాటినాక తెప్ప తగలేసినట్లు దూరంగా నిర్దయగా వదిలేసారు. మీ చుట్టు ఉన్నవారు/ భాగస్వామి/ పిల్లలు కూడా అలాగే వదిలేస్తే మీరు తట్టుకోలేరు.

ఆలోచించండి! మీకూ ఎప్పటికైనా మా ముదుసలి వయస్సు వస్తుందని . .
మాకు చివరి వీడ్కోలు మీరే పలకండి దగ్గర ఉంచుకుని.

లేదా మేము దగ్గర అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించిన వారి చేతుల్లో మాటల్లో ప్రేమలో కన్ను మూస్తాము. పోయేటప్పుడైనా మనశ్శాన్తి గా పోతాము. దయచేసి మీరు మమ్మల్ని, ఐస్ పెట్టెలో కూడా రోజులు మగ్గేటట్లు చేయవద్దు. కనీసం ఈ సహాయం అయినా చెయ్యండి.

లేదా మేమే, ఇక్కడ వారికి చెపుతాము, విశ్వసనీయత క్రుతజ్ఞత లేని మూర్ఖుల కోసం, మమ్మల్ని గంట కూడా శవముగ ఇంట్లో ఉంచవద్దు అని, పరమేశ్వరుని స్మశానం లో కలపమని. బతికున్నప్పుడు లేని ముద్దు ప్రేమ బువ్వ, చచ్చాక గంధపు చెక్కలతో, లక్షమంది భోజనాలతో రాదని చెపుతాము. మీ పాపపు వాసన, మా మీద పడకూడదని చెపుతాము. చచ్చేటప్పుడు అయినా, పశ్చాత్తాపము తో పోయి, మరుజన్మలో ఉత్తమ సంతానన్ని పొందుతాము. ఈ ఆస్తులు ఇక్కడే ఉన్న, మంచి వారి రాస్తాము. ఎందుకంటే, మీ లాంటి రాక్షసులను బలవంతులను చేస్తే, ఎన్నొ కుటుంబాలను కాపురాలను, కన్నీళ్ళ పాలు చేస్తారు.

గుర్తు చేసుకోండి! మీకు ఈ లోకంలోకి స్వాగతం మేమే చెప్పామని, మాకు మీరు తప్ప ఎవరూ లేరని. దానికి బదులుగా, మీరు మమ్మల్ని నయవంచకులుగా మోసం చేసారు అని, మా పాపాలకు శిక్షణ విధించారని, భావిస్తూ, పశ్చాత్తాపముతో, జీవితం వ్యర్ధమైనదని భగవంతుని క్షమించమని వేడుకుని, ఉత్తమ మరు జన్మలు పొందుతాము . . . .  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,664; 104 తత్వాలు (Tatvaalu) and views 225,613
Dt : 12-May-2023, Upd Dt : 12-May-2023, Category : General
Views : 285 ( + More Social Media views ), Id : 1748 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Supplication , sattvic , old , aged , parents , sin , eradication , panchabhutas
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content