మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు దూరము గా వదిలారు అని అడగండి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,064,990; 104 తత్వాలు (Tatvaalu) and views 236,358.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

వీడియో చూడండి, 3 కొడుకులు, 2 కూతుర్లు ఉండి కూడా, వృద్ధాశ్రమంలో ఉన్న వారి ఆవేదన చూడండి.

ఓ కన్నీటి బొట్టు అయినా రాల్చండి, ఇంకా కన్నీరు ఉంటే బండబార కుండా. ఎందుకంటే, మనం అనాధలమైన తర్వాత, మన గురించి ఏడ్వడానికి, ఎవరూ ఉండరు కదా.

నాయకులు, అధికారులు, మంచి మనుషులు, మానవత్వం ఉన్న జీవులు, మీ తల్లి దండ్రులు ఫోటోలు ను పెడుతూ, వారూ మీతో ఇంకా ఉన్నారు అని, పదిమంది కి ఆదర్శంగా తెలపండి నిలవండి. మిమ్మల్ని చూసి, ఇంకొంత మంది మారవచ్చు ఏమో, ప్రయత్నం తప్పు లేదు కదా?

ఎవరైనా తెలిసిన వారు కనపడితే, ఎంత సంపాదించావు ఆస్తి, ఎంతమంది పిల్లలు అని మోహం లో అడగకుండా, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు వదిలారు దూరము గా అని అడగండి, దయచేసి.

అమ్మ నాన్న లను వదిలిన వారు, మన పని వ్యాపారం ఉద్యోగం రాజకీయం స్నేహితము లో, మనల్ని కూడా అవసరం తీరాక వదిలేస్తారు కదా. ఆల్రెడీ రుజువు అయింది కదా?

అదేమంటే, మా తల్లి తండ్రులు, మా ఇష్టం మేము చంపుకుంటాం, మీరెవరండీ అడగటానికి, అంటారు. ఎక్కువ మంది అసలు అడగరు, ఎందుకంటే వారూ అదే బాపతు ప్రభుద్దులు కాబట్టి.

మేం ఉండలేము కొడుకా ఇక్కడ, వృద్ధాప్యంలో పనికిరామని వదిలేశారా, అని తండ్రి అంటే, కొడుకు చూడండి, ఏ మాత్రం సిగ్గు పడకుండా, ఇంట్లో అందరిని అడిగి చెబుతాను అంటున్నారు, కొంచెం కూడా, బుద్ధి జ్ఞానం కృతజ్ఞతలు లేకుండా, తల్లి పాలు తాగాను అని మరచిపోయి విశ్వాస ఘాతకుడిలా.

ఆత్మ అమ్ముకుని, ధనం అందం అవసరం ఉద్యోగ వ్యాపారాల కు అమ్ముడుపోయి పెళ్లి చేసుకునేటప్పుడు చేసేటప్పుడు, ఇవన్నీ గుర్తు రావా, ఇరువైపులా?

మీ ముదుసలి వయస్సు వారు, అందరూ తోడుగా ఉంటారని మాట్లాడుకోవటానికి, అనాధలుగా అనాధాశ్రమంలో పెద్దల ను వదలినప్పుడు, పాలు తాగిన మనకు బాధ్యత లేదని, మరి మన పిల్లలను కూడా అనాధాశ్రమంలో వదిలితే, ఆ పిల్లల వయస్సు వారితోనే ఆడుకుంటారు కదా?

బాధ్యత ప్రేమ అనురాగం లేని, ధన సంపాదన మోహ, బండలమైన మనతో, చిన్న వయసు పిల్లలు ఎందుకు? వారినీ మనమే చెడగొడతాం కదా, ఇలాగే రాతి బండలు గా తీర్చి దిద్దుతాము కదా?

పెద్ద మరియు చిన్న వయసు కు, ఒకటే బంధం అనుబంధం అనురాగం ప్రేమ జాలి దయ ఉండదా, నిజమైన మనిషి కి?

పాపం ఆ తల్లి తండ్రులు బాధలు చూడండి, ఆవేదన చూడండి. వాడుకొని ఇన్నాళ్లు జీతగాళ్ళు లాగా, ఫించన్ ఇచ్చిన విధంగా, ఆశ్రమం లో ధనం కట్టి, వదిలేసి న, ఆ మనసు లేని పిల్లల ను ఏమనాలి? పెళ్ళి చేసుకుని, ఇంత మందిని కని పెంచి చదివించి, వారు చివరకు సాధించినదేమిటి?

మరలా వీరే అంటే ఆ పిల్లలే, నీతులు ధర్మం దానాలు దేవాలయం దేవుడు పూజలు నాటకాలు, పదిమంది ముందు సంఘములో నటనా పెద్దలు?

ఇంతమంది పిల్లలు లో, ఒకరు కూడా నీతి నియమాలు కృతజ్ఞతలు సంస్కారం, ఉన్న వారు లేరా?

లేదా కన్న సంవత్సరం కే దూరంగా ఉంచి, తాత దగ్గర పెంచి, హాస్టల్ లో వేసి చదివించి, ప్రేమ బంధం బాధ్యత లేకుండా, కేవలం రాత్రి ఓ గంట మాత్రమే చూస్తూ, పిల్లల తో గడిపే సమయం లేని, పెంచిన యాంత్రిక పెద్దలు దే, తప్పు మోసం పాపం అందామా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,064,990; 104 తత్వాలు (Tatvaalu) and views 236,358
Dt : 27-Feb-2021, Upd Dt : 27-Feb-2021, Category : General
Views : 1010 ( + More Social Media views ), Id : 993 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ask , kids , son , daughter , mom , dad , parents , left , far , alone
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content