Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time. వాట్సపా స్టేటస్ లో ఎన్నో మంచివి మిస్ కావొద్దు, 24 గంటలలో పాతవి పోతాయి, అలాగే రోజూ, సాత్వికత పెంచే మాటలు, ఆచరణలో చూపుతూ, ముందుకు పోవాలి, మనశ్శాంతి తో.
ఎన్ని కష్టాలలో ఉన్నా, మీతో ఇన్ని మాటలు పంచుకుంటున్నాము అంటే, ఆ మనశ్శాంతి, ఆ దైవిక బలమే.
నొవోటెల్ స్టార్ హోటలో విజయవాడ దగ్గర చద్దన్నం దొరుకుతుంది అంటున్నారు, షుమారు 250-350 రూ కి. మన పెద్దలు గతములో చేసిన, చూపిన మంచి పద్దతులు అన్ని మరచాము. వెగటు మరియు కష్టము మనకు, కడుపులో అల్సర్ వచ్చినా కూడా, మన ఆహారపు అలవాట్లు మార్చుకోము ఇంటి శ్రేష్టమైన తిండి తినము.
రాత్రికి తినడానికి వండుకున్న అన్నం తినగా, మిగిలిన దానిలో నీరు లేక మజ్జిగను, పోసి నానబెడతారు. దీనిని ఉదయాన తినేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన అన్నంను, చద్దన్నం అంటారు. వీడియోలు చూడండి.
రాత్రి మిగిలిపోయిన అన్నం, అయిదారు గంటల్లో చల్లబడి, బ్యాక్టీరియా చేరి, చద్ది అన్నం అవుతుంది. మరీ ఎక్కువ గంటలు అలానే ఉంచితే, పాచి పట్టి పాడై పోతుంది.
ప్రో (మంచి) బ్యాక్టీరియా చేరినా, పాడై పోని తినదగిన, చల్లటి మేలైన అన్నమే చద్దన్నం. ఇది వంటికి చాలా చలువ చేస్తుందని, ఆరోగ్యమని అంటారు.
రైతులు పొద్దున్నే చద్దన్నంలో, పెరుగు కలుపుకొని (పెరుగన్నం) తిని పొలం పనులకు వెళతారు. ఆకలి కాకుండా కష్ట జీవులను కొన్ని గంటలు ఆదుకునేది చద్దన్నం. కడుపులో అల్సర్లు రాకుండా, చద్దన్నం కొంతవరకు అడ్డుకొంటుంది.
రాత్రి మిగిలిన అన్నంలో, కాచిన పాలను పోసి, దానిలో చేమురు అనగా కొద్దిగా మజ్జిగ లేక పెరుగును, పాలు తోడుకునేందుకు అనగా, గడ్డ కట్టుకునేందుకు వేస్తారు. ఈ విధంగా పాలు పోయడం ద్వారా గడ్డ కట్టుకున్న పెరుగన్నంను కూడా, చద్ది అంటారు. అందులో మిర్చి, ఉల్లి, జీర, కరేపాకు కూడా వేస్తారు. ఈ చద్దికి తిరగమాత వేస్తే దానిని దద్ధోజనం అంటారు.
గంజి వార్చి, ఆ గంజిని ఒక కుండలో పోసి రోజూ, 3 రోజుల తర్వాత, పున్నీళ్ళు గా కూడా తాగుతారు. కుండ, పేదవారి ఫ్రిజ్ లాగా ఉపయోగపడుతుంది. పేదవాడి అమృతం పున్నీళ్ళు అంటారు, కానీ ఆరోగ్యం చలవ.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1950 General Articles and views 1,575,676; 97 తత్వాలు (Tatvaalu) and views 198,672 Dt : 25-Feb-2021, Upd Dt : 25-Feb-2021, Category : General
Views : 2648
( + More Social Media views ), Id : 990 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
chaddi annam ,
chaddannam ,
farmers meal ,
star hotel ,
novotel ,
home ,
Punnilu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments