బాపట్ల పార్లమెంట్ పరిధి కొత్త జిల్లా, చీరాల వైపు మొగ్గా? జగనన్న విజ్ఞతకు కృతజ్ఞతలు - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1099 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1127 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

బాపట్ల పార్లమెంట్ పరిధి కొత్త జిల్లా ఏది, బాపట్ల నా లేక చీరాల నా, అనే చర్చ తెరపైకి వచ్చింది మరలా. ఆంధ్ర ప్రభ వార్తా పేపర్ కటింగ్, లింకు లో చూడవచ్చు. link.

మీ ప్రాంత అభివృద్ధి కై, మీ నాయకులు కు అధికారులు కు విన్నపాలు పంపగలరు, దీనిని చదివి ఉత్తేజాన్ని పొంది.

గతంలో మనం చీరాలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరిస్తూ, ఎన్నో ఆర్టికల్స్ రాసి, అధికారులు, నాయకులు, మంత్రులు కు, మరియు అధికార ప్రతిపక్ష పార్టీ పెద్దలు కు, పంపిన విషయం మీకు తెలిసిందే, చీరాల అభివృద్ధి గురించి పలుమార్లు కోరుతూ. లింకు కూడా, చూడవచ్చు. link.

బహుశా చల్లని మనసు తో జగనన్న మంచి చేయదలచారేమో, పార్టీ పెద్దలు ఇచ్చిన వివరణతో, గత ప్రభుత్వాలు అలాగే చంద్రన్న ఇన్నాళ్లు చీరాల పై చూపిన నిర్లక్ష్యం ను, సరిచేయడానికి నిర్ణయం చేశారేమో?

అధికారికంగా ప్రకటన వచ్చే వరకు, ఆనంద పడలేము, లేకపోతే ఇవి పుకార్లు మాత్రమే కావచ్చు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు. తెదేపా ను ఈ ప్రాంతంలో పూర్తిగా దెబ్బ కొట్టడం. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ చీరాల పూర్వ వైభవాన్ని నిలబెట్టింది, కేవలం జగనన్న, అని ప్రజల గుండెల్లో, చిరస్థాయిగా నిలిచిపోవడం కు, రాజ మార్గము వేసినట్లు.

చీరాలకు ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, పెద్ద ఆసుపత్రి లాంటి పెద్ద పనులు ఏవీ ఇవ్వకుండా ఉన్నాము ఇన్నాళ్ళు, కాబట్టి ఇప్పుడు తేలికగా చీరాలను జిల్లా రాజధాని ని చేస్తే, అందరినీ శాంతింప చేయవచ్చు.

పక్క జిల్లా భాగాలు లాగాల్సిన పనిలేదు, అదే పార్లమెంటు స్ధాన పరిధి సరిపోతుంది. బాపట్ల కు ఎటూ నష్టం లేదు, బాపట్ల పార్లమెంటు పేరు కొనసాగుతూనే ఉంటుంది, విద్యా సంస్థల నిలయం గా విలసిల్లుతుంది.

చుట్టుపక్కల అసెంబ్లీల వారంతా, 40 ఏళ్లుగా అర గంట దూరంలో ఉన్న, చీరాలకు అన్ని పనులు కు రావడం, అంటే సముద్రం సినిమా షాపింగ్ బట్టలు షికార్లు, ఎప్పుడు నుంచో ఉంది. ఇది వారికీ ఆనందమే, పిల్లలు పెద్దలు అందరూ అక్కడ కే రావాలి.

ఇది ప్రకాశం మంత్రి బాలినేని గారి ప్రతిష్ట, అలాగే పార్టీ పెద్దలు విజయసాయి వైవీ సుబ్బారెడ్డి సజ్జల గారి పట్టుదల గా నిలుస్తోంది, జగనన్న కీర్తి ని, సుస్ధిరం చేయడానికి ఈ ప్రాంతంలో.

స్ధానిక ఎమ్మెల్యే కరణం బలరాం, తన తనయుడు కు స్ధానం పదిలం చేసుకోవడానికి, ఇది ఒక అద్భుతమైన అవకాశం, మేమే సాధించి తెచ్చాము అనడానికి. అలాగే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మరియు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా, తమ పట్టు ను అధిష్టానం దగ్గర నిరూపించుకోవడానికి అవకాశం ఇది.

నిద్ర నటించే తెదేపా, జనసేన, భాజపా స్ధానిక నాయకులు ఇప్పుడు అయినా, గళం ఎత్తి, స్ధానికంగా గట్టిగా సమస్యలు అభివ్రుద్ది గురించి మాట్లాడుతూ, సోషల్ మీడియా లో ప్రచారం చేస్తారేమో చూద్దాం.

చూద్దాం మరి, ఎవరి భవిష్యత్తు ఎటువైపు తిరుగుతుందో. మన ప్రయత్నాలు మనం చేద్దాం.

* * *

రేపు మన కల నిజం అయి నిజంగా, అన్ని బాపట్ల పార్లమెంటరీ అసెంబ్లీ లకు నడి మధ్యలో సమాన దూరంలో ఉన్న, చీరాల ను జిల్లా చేసినా లేదా ఎక్కువ జిల్లా శాఖలు ఇచ్చిన కూడా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్, స్పెషాలిటీ ఆసుపత్రి ఇచ్చినా కూడా,

పార్టీ పెద్దలు, మంత్రులు, ప్రకాశం చీరాల అభివృద్ధి, అలాగే జగనన్న ఖ్యాతి మరియు మంచి కోరే, పెద్దలు విజ్ఞులు ఎవరైనా,

ఓరే బాబూ, ఆ చీరాల స్ధానిక విలేఖరి ని ఒకసారి రమ్మనండి లేదా తీసుకుని రాండి, రెండు ఏళ్లుగా, మా వెంటపడి దుంప తెంచాడు,

మరచిపోకుండా రోజూ, కధనాల మెసేజ్ ల మీద మెసేజ్ లు పెట్టి, కంట్లో నలుసులా, చెవిలో జోరీగ లాగా ఇబ్బంది పెట్టాడు, మన సొంత నాయకులే ఈ విధంగా, రోజూ వెంట పడలేదు తమ ప్రాంత అభివృద్ధి కి,

ఇప్పుడు అయినా కడుపు నిండిందా, మన రాజన్న తనయుడు జగనన్న, న్యాయం చేశారా, ఇన్నాళ్ళ చారిత్రక తప్పిదం ను సరిచేసి, మీ ప్రాంతంకు పూర్వ వైభవాన్ని తెచ్చారా అని అంటే,

ఎన్ని మాటలు రాశావు మమ్మల్ని కూడా విమర్శలు చేస్తూ, నేరుగా మాకే పంపుతూ ఉన్నావు,

ఇప్పుడు చెప్పు, మీకు గత పాలకులు ఇన్నాళ్లు, ఉత్త మాటలు చెప్పి మోసం చేసింది ఎవరు, ఇప్పుడు చేతలలో చేసింది ఎవరూ అంటే,

అందరి క్షేమం కోసం, నువ్వు చేసిన చేస్తున్న 72 వారాల 108 ప్రదక్షిణలు, హైదవ ప్రచారం, తెలుగు భాషా ప్రచారం, ముదుసలి తల్లి దండ్రల క్షేమం, కన్నతల్లి సేవ, సొంత ఊరిపై మమకారం అభిమానం, మంచి సంస్కారం లక్షణాలు ప్రచారం, శాఖాహారం, ఉపవాసం, చాపనిద్ర, దేవుని దీవెనలు, ఇప్పుడు ఫలించాయా అని అంటే,

ఆనందంగా వారి వద్దకు వెళ్లి, సిగ్గు తో కన్నీళ్ళు తో కృతజ్ఞతలు తో తలవంచి, నమస్కారం చేయడం కన్నా ఏమి చేయగలము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1127 General Articles, 47 Tatvaalu
Dt : 28-Feb-2021, Upd Dt : 28-Feb-2021, Category : Politics
Views : 113 ( + More Social Media views ), Id : 994 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bapatla , parliamentary , chirala , district , jagan , balineni , sajjala , karanam , amanchi , vijaya sai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content