దత్తాత్రేయుడు, త్రిమూర్తులు స్వరూపం. దత్త చరిత్ర, గురు చరిత్ర చదివి, 9 వారాల పూజ చేశావా? - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1099 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1127 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

రాము, సోము తెలిసిన వారు, స్నేహితులు లాగా కష్ట సుఖాలు, మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గురువారం నాటి మాటలు చూడండి.

** రాము - ఎందుకు మీ పెద్ద వాళ్ళ ను మద్రాసు, హైదరాబాదు డాక్టర్ దగ్గరకు మాత్రమే తీసుకుని వెళతావు?

* సోము - నిఖార్సయిన డాక్టర్లు అక్కడ నే ఉంటారు, మంచి వైద్యం అందుతుంది, అని నా నమ్మకం. వీలైతే ఢిల్లీ, లేదా విదేశం వెళతా, మన ఎమ్మెల్యే ఎంపీ ల లాగా.

డొనేషన్ తో చదివే అత్తెసరు మార్కుల వారు, దొడ్డి దారిన వచ్చిన వారు, తప్పుడు ప్రచారం తో వచ్చే వారు, అక్కడ ఉండరు అని, నా నమ్మకం.

నీతి నియమాలతో, కష్టపడి ఏదైనా నేర్చుకోవాలి, పేరు తెచ్చుకోవాలి, గత చరిత్ర ఉండాలి, తేలిక గా వచ్చింది ఏదీ నాకు వద్దు, వైద్యం క్వాలిటీ ఉండాలి, భక్తి అయినా ముక్తి అయినా ఒకటే.

మా తాతలు కాలం నుంచి ఇంతే, మధ్యలో వచ్చిన వారి మాటలు నమ్మము, వేరే చోటకు వెళ్ళము.

** మరి గురువు లంతా ఒకటే నా? గురువు లకు కూడా శాస్త్ర ప్రమాణం, గత చరిత్ర ఉండాలా? గురువు శక్తి ని నమ్ముతావా? గురువు దైవ మార్గం చూపుతారా లేక కోర్కెలు తీరుస్తారా?

* అంతా ఒకటే, గురు పరంపర, శాస్త్ర ప్రమాణం, గత చరిత్ర ఉండాలి. గురు శక్తి తో కేవలం దైవ మార్గం చూపుతారు, ప్రాపంచిక కోర్కెలు తీర్చరు.

** చాలా బాగా చెప్పారు. దత్తాత్రేయుడు, త్రిమూర్తులు స్వరూపం అంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర చదివి, 9 వారాల పూజ చేశావా?

* లేదండీ, చేయలేదు, ఎక్కువ గుళ్ళు మందిరాలు కట్టి, వ్యాపారస్తులు హైందవము ఆచరించని వారు ప్రచారం చేయనిదే, నాకు గురు భక్తి ఎక్కదు, అర్థం కాదు. నియమాలు కష్టం గా ఉంటే, ధృఢం కాని మన బలహీన మనసు తో, ఆచరణలో చేయలేము కదా.

** వ్యాసుడే , విష్ణువు, విష్ణువే వ్యాసుడు అన్నారు కదా, వారి 1 లేదా 9 వారాల పూజ చేశావా? కనీసం గుడి కి వెళ్ళావా? వ్యాస పూర్ణిమ తెలుసు కదా?

* చేయలేదు, నియమాలు కష్టం. తెలుసు.

** ఆది గురువు గీత చెప్పిన కృష్ణుడు, ఆదిశంకరులు, రామానుజుడు, కనీసం వీరి పూజైనా 9 వారాలు చేశావా? వారి కధలు, శ్లోకాలు, చరిత్ర, గీత, పురాణాలు చదివావా?

* లేదండీ, సమయం తీరిక లేదు.

** కనీసం తెలుగు గురువు లు, రాఘవేంద్ర బ్రహ్మం గారు, వేమన వీరి పూజలు అయినా చేశావా? వారి తెలుగు పద్యాలు చదివి ఆచరణలో పెట్టావా?

* లేదండీ, పాఠాలలో చదవడమే కానీ, ఎప్పుడూ చేయలేదు, ఆచరణలో పెట్టలేదు.

ప్రాపంచిక మోహంతో ఉండే, మా ఎమ్మెల్యే, ఎంపీలు, సినీ తారలు కూడా, తెలుగు గురువు లను పూజిస్తున్నట్లు గా ఫోటోలు పెట్టలేదు కదా వారి సోషల్ మీడియాలో.

బహుశా వారికీ తెలీదు అనుకుంటా, నేటి మాయలలో మునిగి.

** నీతి నియమాలను, నిష్ట, బాధను భరించడం, ఓపిక, సహనం, సంకల్పం ను పెంచే 108 ప్రదక్షిణలు, నేల నిద్ర, ఉపవాసం నీళ్ళు పాలు అరటి ఆపిల్ తో, తల్లి దండ్రుల పాదసేవ, ముదుసలి తల్లి దండ్రులు ను ఇంట్లో ఉంచుకోవడం, శాఖాహారం, బయట తిండి తినకుండా ఉండటం, ఒంటి మీద బంగారం ఉండకపోవడం, అరిషడ్ వర్గాలు ను జయించడం, ఇతరులను బాధ పెట్టకుండా మోసం చేయకుండా అబద్ధాలు ఆడకుండా విషయాలు దాచకుండా ఉండటం, అరగంట మానసిక ధ్యానం, కనీసం వారానికి నెలకి ఒకసారైనా చేశావా?

* అంత ఓపిక, సహనం, సంకల్పం, నిష్ట, భక్తి, బాధ్యత, శక్తి ఎక్కడ ఏడిచాయి అండి మాకు. ఏదో అంతా తూతూ మంత్రంగా.

** మరి గురువు లంతా ఒకటే అంటావు. పైన చెప్పిన గురువు ల, 1 లేదా 9 వారాల పూజలు చేయలేదు అంటావు, ప్రమాణాలు ఉండాలి అంటావు, ఇంట్లో ఒక్క ఫోటో లేదా విగ్రహం లేదు.

డాక్టరు దగ్గర నీతినియమాలు, నిష్ఠ, కష్టం ఉండాలి అంటావు, గత చరిత్ర ఉంటే నే నమ్మాలి అంటావు.

మరి నువ్వు నోటితో చెప్పేది, నీ మనసు ఆచరణలో చేసేది, అసలు కలుస్తుందా, పొంతన ఉందా?

మరి గురువారం, గురు పౌర్ణమికి ఎవరిని తలుస్తావు?

* ఏమోనండీ, అందరూ పరాయి లేదా కొత్త గురువు బాబా, ఫోటోలు తో కోరికలు తీరాయి, అని పిచ్చి గా పూజలు చేస్తూ, ఊళ్ళలో మందిరాలు కడుతూ, వేలం వెర్రి గా, నియమ నిష్ఠలు తక్కువ అని, ప్రచారం చేస్తుంటే, ఆ మాయలో పడ్డాను.

అందరూ గురువు లు ఒకటి అయితే, పైన చెప్పిన, గత గురువు లలో నే, కొత్త గురువు లను చూడవచ్చు.

అంటే నా మాటలోనే అబద్దం ఉంది, అర్ధం లేని వాదన ఉంది. ఎవరో రాసిన చెప్పిన, కట్టు కధలు నమ్మేంత మూఢుడునా, నేను నా కుటుంబం? ఎలా మాయా మోహం లో పడ్డాను.

మరలా పాత మంత్రాలను శ్లోకాలను కాపీ చేసి, కొత్త గురువు దేవుని పుస్తకం, పూజా విధానం చేసి, కొత్త మందిరాలు కట్టి, కొత్త చరిత్ర పుస్తకాలు రాసి, కొత్త వ్యాపారాలు అమ్మకాలు, గొడవలు, మోసాలు అవసరం లేదు కదా.

అంటే నా మనస్సు బలహీన మైనది. ప్రచార వ్యాపార మాయలో చిక్కి, తెలిక అనే బలహీనతకు లొంగి, ఇంకో దోవలో మూర్ఖంగా వెళుతుంది.

ఇంత వయస్సు వచ్చి, నా బుద్ధి ఇలా వక్రీకరిస్తుంటే, ఇంక నా హైబ్రిడ్ అంటే కష్టం తెలియని, వాస్తవం చూడలేని, మానసికంగా ఎదగలేని, పిల్లల ఆలోచన భవిష్యత్తు ఏమిటి? వారూ భవిష్యత్ లో, ఇలాంటి ఎన్ని మోహాలలో చిక్కతారో కదా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1127 General Articles, 47 Tatvaalu
Dt : 26-Feb-2021, Upd Dt : 26-Feb-2021, Category : Devotional
Views : 166 ( + More Social Media views ), Id : 991 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dattatreya , trinity , trimurti , datta guru charithra , puja , worshiped , 9 weeks
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content