చంద్రన్న కుప్పంలో, లోకేష్ నందిగామలో పర్యటన - ప్రజల కార్యకర్తల మధ్య తండ్రి తనయులు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,763; 104 తత్వాలు (Tatvaalu) and views 226,198.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

** దౌర్జన్యాలు, అక్రమాలు చేసి, దొడ్డిదారిన తెచ్చుకున్న గెలుపుతో, ప్రగల్భాలు పలికిన, వైసీపీ నేతలకు కళ్ళు బైర్లు కమ్మేలా, చిత్తూర్ జిల్లా కుప్పం పర్యటనలో చంద్రన్న పర్యటనకు, ఎక్కడికి వెళ్తే అక్కడికి జనసంద్రం కదలి వచ్చింది, మా నాయకుని శోభ వన్నె తగ్గలేదు, ప్రజల కున్న ఆశ మసకబారలేదు, అని ఆనందముతో తెదేపా తమ్ముళ్ళు అంటున్నారు 2 చోట్లా.

కుప్పం పట్టణంలో చంద్రబాబు ప్రసంగాన్ని వినడానికి, తరలివచ్చిన భారీ జన సందోహం ను, చిత్రములో చూడగలరు.

కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి తిలకం దిద్దారు. దారి పొడుగునా ప్రజలు ఉత్సాహంతో, వెంట నడుస్తుండగా చంద్రబాబు పర్యటన, అంగరంగ వైభవముగా కొనసాగుతోంది.

కుప్పం ప్రజలు, ఎప్పుడూ తనను తమ కుటుంబ సభ్యుడిగా చూసారని, తెలుగుదేశం అధినేత అన్నారు. కుప్పం ప్రజలను, వైసీపీ నేతలు ఎంతగా ఇబ్బందులు పెడుతున్నారో గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని చంద్రబాబు అన్నప్పుడు, ప్రజలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

** నీ యబ్బ సొత్తా...అంటూ పంచాయితీ ఎన్నికలలో ప్రజలను బెదిరించిన, వైసీపీ నాయకులను ఘాటుగా ప్రశ్నించిన, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకెష్.

కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా, నందిగామ మాజీ ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య, ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. ఇటీవల ఆమె ఇంటిపై, వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండించారు.

అనంతరం నారా లోకేష్ నందిగామలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. నారా లోకేష్ ను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సైకిల్ ను ఎత్తుకున్న, లోకేష్ ను ఫోటోలో చూడవచ్చును.

ఇలాగే ప్రజలకు అండగా, రాష్ట్రములో ఉంటూ, అధిష్టానము ఇలాగే స్థానిక నాయకులు ప్రజలను కలుస్తూ ఉంటే, కార్యకర్తలకు ధైర్యముగా ఉంటుంది అని పలువురు భావిస్తున్నారు.

అలాగే, పధకాలకు ఇక నుంచి, కుటుంబ పేర్లు లేకుండా, గతములో జరిగిన పొరపాట్లను మరలా చేయమని చెపుతూ, నిజమైన అభివ్రుద్దిని చేసి చూపెడతామని, వైద్యం కోసము కనీసము ఎమ్మెల్యేలు హైదరాబాద్ పోకుండా, రాయలసీమ కోస్తా అలాగే ఉత్తరాంధ్రలో, మంచి ఆసుపత్రిలను కట్టిస్తామని హామీ ఇవ్వాలని పలువురూ కోరుతున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,763; 104 తత్వాలు (Tatvaalu) and views 226,198
Dt : 25-Feb-2021, Upd Dt : 25-Feb-2021, Category : Politics
Views : 882 ( + More Social Media views ), Id : 989 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tours , chandranna , kuppam , lokesh , nandigama , public , tdp , activists
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content