రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా - స్వాతిముత్యం - కమల్ హాసన్, రాధిక, విశ్వనాథ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,024; 104 తత్వాలు (Tatvaalu) and views 224,631.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Rama kanavemira, Swathi Mutyam, Kamal Haasan, Radhika, Ilayaraja, vishwanath

చాలా పెద్ద పాట, గొంతు జీర పోకుండా, ప్రయత్నం చేయండి. రాగానికి ఆరోగ్యానికి మంచిది.

శ్రీరామ నవమి వచ్చిందంటే, సీత రాముల వారి కల్యాణం, పానకం వడపప్పు అందరికీ తెలుసు. కానీ తెలియనిది ఏమిటి అంటే, 30 ఏళ్ళు గా రాముని పూజిస్తున్నా, రాముని/ సీతమ్మ లక్షణాలు మనకు ఎన్ని అబ్బాయి, ఎన్ని ఆచరణలో పెట్టాము అంటే మాత్రం, అబ్బే వాళ్ళు అంటే దైవ గుణాలు కల సామాన్య మనుషులు, మన లాంటి రాక్షసులకు అలాంటి గుణాలు ఎక్కడ అబ్బుతాయి అండి అని వాస్తవాలు కొందరు, మాకెందుకు లేవు ఆ మంచి లక్షణాలు అంటూ ఇంకొందరు కపటము తో మాట్లాడు తారు.

మరి ఆ మంచి లక్షణాలు ఉంటే, ముదుసలి తనములో మన పిల్లల దగ్గరనే గౌరవం గా ఉంటాము అని చెప్పమనండి? ఉండమనండి? అబ్బే, అది సాధ్యం కాదు, ఎందుకంటే, సంస్కారం ఎవరికీ తెలీదు.

రాముడు సీతకు గుణములు చూసి పెళ్ళి చేసారు. మరి మన పెళ్ళిళ్ళు అసలు గుణాలు చూడకుండానే, ప్రాపంచిక భ్రమలు అవసర అవకాశాలతోనే నడుస్తున్నాయి. అయినా రామ భక్తులము అంటున్నాము, కదూ?

ఆ రామయ్య కధలు పాటలు ఎన్ని సార్లు చెప్పుకున్నా తనివి తీరవు సుమీ.

రాజ్యానికి రాజు కాబోతూ రేపు ఉదయం, ఈ రోజు రాత్రి అడవికి వెళ్ళమంటే, ఆనందముగా ఒప్పుకుని బయలు దేరారు. భర్త తోనే భార్య అని, ఆ సుకుమారి సీతమ్మ కూడా అడవులకు వెళ్ళింది. అంటే వారిద్దరు, అరిషడ్వర్గాలను జయించారు. కందమూలాలు తిని అడవుల్లో నిద్రించారు, సజీవ గురువుల సేవ చేసారు. ఒకే మాట పై నిలబడ్డారు. మరి మనము, మన సంతానము, మన వంశము?

రామా కనవే.మి రా..
రామా కనవే.మిరా.., శ్రీ రఘు రామ కనవేమిరా....ఆ ఆ
రామా కనవే.మి రా..
రమణీ లలామ, నవ లావణ్య సీమ
ధరా.పుత్రి., సుమ గా.త్రి.
ధరాపుత్రి, సుమ గాత్రి, నడయాడి రాగా., రామా కనవేమి రా...

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట, జనకుని కొలువులో ప్రవేసించే జానకిని, సభాసదులందరు, పదే పదే చూడగా
శ్రీ రా.మ చంద్ర మూర్తి, కన్నెత్తి సూడడేమని, అనుకుంటున్నారట, తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

రామా కనవే.మి రా..
రామా కనవే.మిరా.., శ్రీ రఘు రామ కనవే.మిరా....ఆ ఆ
రామా కనవే.మి రా..

ముసి ముసి నగవుల, రసిక శిఖామణులు.
సా నిదమ ప మగరిస, ఒసపరి చూపుల అసదృశ విక్రములు.
సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల, రసిక శిఖామణులు.
తా తకిట తక ఝణుత, ఒసపరి చూపుల అసదృశ విక్రములు.
తకఝణు తకధిమి తక, మీసం మీటే రోష పరాయణులు..
నీ దమప మా గరిగ మా సరి. ఎవరను మత్త గుణొల్వణులూ
ఆహ
క్షణమే., ఒక దినమై.
నిరీక్షణమే.., ఒక యుగమై..
తరుణి వంక, శివ ధనువు వంక, తమ తనువు మరచి, కనులు తెరచి చూడగ
రామా కనవే.మిరా.., కనవే.మిరా..

ముందుకేగి విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలు, భూ వరులు
తొడగొట్టి ధనువు, చేపట్టి బావురని, గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలు,భూ వరులు
తొడగొట్టి ధనువు, చేపట్టి బావురని, గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి, రెండు కళ్ళు తిరిగి, వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా, అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు, లేరా, అ విల్లు ఎక్కు పెట్టే వారు, లేరా
అరెరె ఎత్తే వారు, లేరా, అ విల్లు ఎక్కు పెట్టే వారు, లేరా
అహ ఎత్తే వారు లేరా, అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడయ్యకు తా ధిమి తా

రామాయ.., రామభద్రాయ.., రామచంద్రాయ నమః

అంతలొ రామయ్య లేచినాడు, ఆ వింటి మీద చెయ్యి వేసినాడు 2
సీత వంక, ఓరకంట చూసినాడు 2
ఒక్క చిటికలో, విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో, విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ, ఫెళ ఫెళ, ఫెళ ఫెళ, విరిగెను శివ ధనువు
కళలొలికెను, సీతా నవ వధువు
జయ జయ రామ, రఘుకుల సొమ
జయ జయ రామ, రఘుకుల సొమ
దశరథ రామ, దైత్యవి రామ
దశరథ రామ, దైత్యవి రామ
జయ జయ రామ, రఘుకుల సొమ
జయ జయ రామ, రఘుకుల సొమ
దశరథ రామ, దైత్యవి రామ
దశరథ రామ, దైత్యవి రామ

సీతా.. కల్యాణ వైభోగమే, శ్రీ.. రామ కల్యాణ వైభోగమే 2
కనగ కనగ కమనీయమె, అనగ అనగ రమణీయమె 2
సీతా.. కల్యాణ వైభోగమే, శ్రీ.. రామ కల్యాణ వైభోగమే
రామయ్య., అదుగోనయ్య
రమణీ లలామ, నవ లావణ్య సీమ
ధరా.పుత్రి, సుమ గా.త్రి, నడయాడి రా.గా., రామా కనవే.మిరా..
శ్రీ రఘు రా.మ, కన వేమిరా ఆ ఆ ఆ
రామా కనవేమి రాఅఅఅ

Movie: Swathi mutyam, Singers: S.P. Balu, Lyricist: AatrEya, Composer: Illayaraja, Director: K. Viswanath  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,024; 104 తత్వాలు (Tatvaalu) and views 224,631
Dt : 12-Mar-2023, Upd Dt : 12-Mar-2023, Category : Songs
Views : 483 ( + More Social Media views ), Id : 1720 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : rama , kanavemira , swathi , mutyam , kamal , haasan , radhika , ilayaraja , vishwanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content