అనంతపురం మంచి కలెక్టర్ ను అమానుషముగా అగౌరవ పరుస్తున్న, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,942,597; 104 తత్వాలు (Tatvaalu) and views 230,705.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

జర్నలిజం అంటే, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు అని, వీరు ప్రారంభం చేసారు, వారు పంచారు, వారు చప్పట్ళు కొట్టారు అని, వార్త రాసి చేతులు దులుపుకోవడము కాదు. అందులో ఉన్న అసలు విషయాన్ని బయటకు తీసి, విశ్లేషించి, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో చెప్పాలి.

ఎవరూ చేయని ఆపని, మేము చేస్తున్నందుకు, ఇతరులను అంటే ఎవరు ఊరుకోరు కాబట్టి, ఇక నుంచి మాకు మేమే అజ్ఞాన విలేఖరి అని, పెట్టి నిరసన తెలియ చేస్తాము. మంచి వాళ్ళు అందరూ మాట్లాడితే, చెడుకు విలువ ఉండదు. కాని మంచి వారు దద్దమ్మలు గా గమ్ముగా ఉంటే, చెడు పెట్రేగి పోతుంది, మంచికి నీడ లేకుండా పోతుంది.

మీరు మాతో కలసి, నిరసన వ్యక్తం చేస్తారో, మనకెందుకు అని గమ్ముగా ఉంటారో మీ ఇష్టం. అందుకే పెద్దలు చెప్పారు, ధర్మాన్ని కాపాడు అది మనల్ని కాపాడుతుంది అని.

మనం ఇద్దరు నూ పొగిడాము గతములో. ఎక్కువగా పొగిడింది కలెక్టర్ గారిని, కొత్త ఒరవడి సృష్టిస్తూ ఉన్నారు అని, ఎన్నో కొత్త కొత్త పనులు చేపడుతూ. అనంతపురం కు చంద్రుడి లాగా, గంధపు వాసనల ప్రజా పనులతో - మొదటి డిపార్ట్మెంట్ సోషల్ మీడియా. అలాగే అనంతపురం జిల్లా ఆరోగ్య శాఖాధికారులు, కర్తవ్యంతో బాధ్యతతో, ఫేస్బుక్ లో, పౌరుల కు సమాచారము.link

అలాగే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ని పొగిడాము, రోజూ జనం దగ్గర కు వెళ్లి, పేరు పేరున పలకరిస్తూ, అధికారులు తో చెప్పి, వెంటనే పని జరిగే విధంగా చూస్తున్నారు అని. link

మీరిద్దరూ కలసి ఐకమత్యము గా, ధర్మవరం కు ఇంకా ఎక్కువ మంచి చేయాలి. ఒకవేళ ఇద్దరుకు పడకపోతే నచ్చకపోతే గమ్ముగా ఉండాలి, ఇలా అర్థం పర్ధం లేకుండా, మాట్లాడకూడదు.

అంటే మంచి పనులు, ఎవరైనా ఏ పార్టీ వారు అయినా, మిగతా వారి కంటే గొప్పగా చేస్తే, తప్పక పొగుడుతాము.

అలాగే బంధువు పెద్దారెడ్డి తాడిపత్రి లో, జేసీ ఇంటి మీదకు పోతే, ఆ పద్దతి తప్పు అని చెప్పాము. సొంత పాత పగలు ఉంటే, కోర్టు లేదా ఇంకోటి ద్వారా తేల్చుకో గానీ, పబ్లిక్ గా ఇలా వైసీపీ పరువు తీయవద్దు, అని వ్యంగ్యంగా రాశాము. link.

ఎలుక బలం ఉన్న రాష్ట్ర బీజేపీ కి, ఏనుగు బలం ఉన్న జనసేన లొంగడం తిరుపతి లో ఓ విచిత్రం, అంటే వాళ్ళద్దరు వరకే పోలిక.

అలాగే తెలంగాణ లో షుగరు ఫాక్టరీ, ఆల్విన్ వాచ్ కంపెనీలు తెరిపించలేక చేతగాక, ఆంధ్రా వైజాగ్ స్టీల్ కు మాత్రం మద్దతు పలికిన, కేటీఆర్. ఇది ఇంకో చిత్రం.

వేటినీ సమర్ధన చేయలేదు, అన్ని పార్టీల అధిష్టానం, నాయకులు కు విన్నవించాము.

జాగ్రత్తగా అడుగున ఉన్న వీడియో వినండి, కేతిరెడ్డి గారు మాట్లాడిన మాటల్లోనే, డొల్లతనం కనపడుతుంది. అసలు సమస్య దాకా కూడా పోనవసరము లేదు. ప్రత్యర్ధుల మాటలు కూడా వినండి.link.

* దేవుని ఊరేగింపు ఆచారం సమస్య, రెండు గ్రామాల మధ్యలో. అదుపు చేయడం, ఇరు గ్రామ నాయకులు ఎమ్మెల్యేల కు వల్ల కాలేదు. పాత సాంప్రదాయం అని, గొడవలు జరుగుతుంటే ఆపకూడదా? దానికి మందు తాగి, ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే, దానికి కలెక్టర్ తప్పు అవుతుందా?

* ఏమైనా అర్థం ఉందా అసలు అక్కడ జరిగేది మీరు మాట్లాడేది? మీరు అసలు సమస్యకు పరిష్కారము వదలి, కలెక్టర్ మీద ఆ విధముగా నోటికి వచ్చినట్ల్లు మాట్లాడితే, ఎవరు అడగలేరా?

* ఎవరి ఇంట్లో అయినా, భార్యా భర్త ఇంట్లో గుట్టుగా తన్నుకున్నా తిట్టుకున్నా, పోలీసులు రారు, రాకూడదు, వారి ఇంటి సమస్య.

కానీ జనాలకు తలనొప్పి పుట్టిస్తూ, ఇద్దరూ వీధుల్లో తన్నుకుంటే, పోలీసులు వస్తారు, లోన వేస్తారు. దానికి మరలా వాళ్ళు మా పరువు పోయింది, ఆత్మహత్య చేసుకుంటాము అంటే, పోలీసులు ది తప్పా? భార్యాభర్తల మధ్యలో, కుటుంబ బంధాల మధ్యలో, పోలీసులు ఎందుకు వచ్చారు అంటారా? అవ్వ.

* పాత సాంప్రదాయం ఉందని, సతీ సహగమనం, బాల్య వివాహం చేస్తుంటే గమ్ముగా ఉందామా? కలెక్టర్, పోలీసులు ఆపవద్దా? నాయకులు గా మీకు చేతగానప్పుడు?

* తిరుపతి వెంకన్న 6 గంటలు గతములో నిద్రపోయేవారు, ఇప్పుడు కనీసం 2 గంటలు కూడా, పడుకోవటము లేదు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎమ్మెల్యేలు మార్చగలరా, మరలా వెంకన్న కు కనీసం 5 గంటలు నిద్ర ఇస్తూ పాత పద్దతిలో?

* ఈవో తప్పులు చేస్తే బయట పెట్టండి, ట్రాన్సఫర్ చేయించండి. ఎక్కడ అయినా నాయకులు అధికారులు కలసే, ఎక్కువ తప్పులు చేస్తున్నారు.

* కొన్నాళ్ళు ఉంటారు వెళ్లి పోతారు అంటున్నారు. ఆ మాట తప్పు కదా? వాళ్ళు బదిలీ అయినా, కనీసం ఉద్యోగం ఉంటుంది.

ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం గెలుపు కూడా కొన్నాళ్లు మాత్రమే కదా, శాశ్వత ఉద్యోగం కాదు కదా?

* మీరే చెపుతున్నారు, సజ్జల కు అవినాష్ కు, మిగతా నాయకులు కు చెప్పిన గతంలో అని. మరి వారెందుకు గమ్ముగా ఉన్నారు, ఇన్నాళ్లు, అనంతపురం కలెక్టర్ ను మార్చకుండా? అంటే, కలెక్టర్ కరెక్టు అని, మాతో పాటుగా, వారికి ప్రగాఢ నమ్మకం.

* కలెక్టర్ వ్యక్తిగతం గా తప్పులు ఉంటే, అది ఆయన పర్సనల్ లైఫ్. మీ వ్యక్తిగత జీవితం గురించి, ఒకవేళ వంద ఆరోపణలు ఉన్నా కూడా, ప్రజలకు కావాల్సింది మీరు ఎమ్మెల్యే గా, సరిగ్గా జనాలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారు లేదూ, అంత వరకే.

* ప్రభుత్వ పరంగా కలెక్టర్ తప్పులు ఉంటే, నిర్భయంగా సాక్ష్యం బయట పెట్టవచ్చును కదా. అప్పుడు అందరం మీకు అనుకూలముగా, అనంత కలెక్టర్ గారి ని, తప్పులు పడతాం.

* మా ప్రకాశం జిల్లా అధికారులను మంత్రులను ఎమ్మెల్యేలను 2 ఏళ్ళు గా, ప్రభుత్వ సోషల్ మీడియా పెట్టి, మన జగనన్న పధకాల ప్రచారానికి, న్యాయం చేయండి అని అడుగుతున్నాము ప్రాధేయపడుతున్నాము. వారు కనీసం జవాబు కూడా, ఇవ్వటము లేదు. అధిస్థానానికి పెద్ద నాయకులకు పంపాను, వారు పలకరు. link.

* అంత మాత్రాన, వారిని నోటికి వచ్చినట్లు, మనము తిట్టవచ్చా? ఇంకో 2 ఏళ్ళు ఇలాగే అడుగుతాము, ఇలా 2 ఏళ్ళు అడిగితే, ఎవరి పరువు ఆత్మాభిమానం పోయేది? సీయెం గురించి అడగాల్సిన ఎమ్మెల్యేలది, ప్రభుత్వ జీతం తీసుకుంటూ సోషల్ మీడియాలో, ప్రజలకు చేర్చని అధికారులది. గడ్డి పరకలము అయిన, మా విలేఖరులది కాదు కదా?

ఈ లోపు, మీ లాంటి వారు మంచి వాళ్ళను జిల్లా నుంచి నెట్టెస్తే, మాకు వస్తారు కదా? మా దగ్గర సోషల్ మీడియా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టవచ్చు వారు.

* అంతే గానీ, మనం అమర్యాదగా ఇలా ఇష్టం వచ్చిన విధముగా పుట్టుకుల గురించి మాట్లాడుతూ ఉంటే, మనకు ఉన్న గౌరవం కూడా పోతుంది. మనం చేస్తున్న మంచి కూడా, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.

సంయమనం పాటించండి ఎమ్మెల్యే గారు, ప్రజలు మరియు అధిష్టానం గమనిస్తూ ఉంది, అర్ధం లేని ఆవేశం కాదు, కాస్త ఆలోచన కావాలి.

మన లక్ష్యం, జగనన్న పేరు నిలబెట్టడం, అందరూ ఎమ్మెల్యేలు ఇలా నోటికి వచ్చిన విధముగా అమర్యాదగా, జగనన్న పేరు చెడగొట్టడం కాదు సుమా.

ఇంకా మూర్ఖముగా, ఈ చిన్న విషయానికి బదిలీ కావాలని అనుకుంటే, మా ప్రకాశం జిల్లా కు పంపగలరు, మీకు శక్తి సామర్థ్యం ఉంటే, దండము పెట్టి ఆదరిస్తాము.

మా జిల్లా ను కొత్త దోవలో నడిపిస్తారు. అనంతపురం కలెక్టర్, మంచి సామర్థ్యం లక్ష్యం పట్టుదల ఉన్న ప్రభుత్వ అధికారి. మీ అర్ధం లేని మాటల తోనే, కోపముతోనే, ఆవేశము లో, మీరే మీకు తెలియకుండా, మంచి కలెక్టర్ అని సర్టిఫికేట్ ఇచ్చారు. ధన్యవాదములు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,942,597; 104 తత్వాలు (Tatvaalu) and views 230,705
Dt : 13-Mar-2021, Upd Dt : 13-Mar-2021, Category : Politics
Views : 833 ( + More Social Media views ), Id : 1026 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dharmavaram , mla , kethireddy , venkat , brutally , disrespecting , good collector , anantapur
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content