Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మనము ఇంతకు ముందు కూడా, ప్రజలతో ఉండి, ప్రజల కోసం తిరిగే ఎమ్మెల్యేలు గురించి, ఆంధ్రా తెలంగాణలో నుంచి కొంతమందిని గురించి అనుకున్నాము.
ఇప్పుడు, అనంతపురం జిల్లాలో ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు తనదైన ప్రత్యేకమైన శైలిలో, ఎప్పుడూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఎక్కడకు పోయినా గుర్తుపెట్టుకుని మరీ పేరు పెట్టి లేదా బంధముతో పిలుస్తున్నారు. మాటలతో కట్టివేస్తున్నారు. మా మాటలు నమ్మకుండా, వీడియోలో చూడండి.
ఈ వీడియో చూసి అయినా, మీ ఊరి ఎమ్మెల్యేని ఇప్పుడైనా మారి, ప్రజలలో తిరిగి, ప్రజా సంక్షేమము ను చూడమని చెప్పండి, వారసులకు దైవ అండ కలిగేటట్టు చేయండి. జనాలతో కలిసిపోయే, మీ మంచి ఎమ్మెల్యే ఎంపీ గురించి మీకు తెలిసి ఉంటే, వారి ఫేస్బుక్ ట్విట్టర్ లింక్ పంపగలరు.
ఊరికే చంద్రన్న లేదా జగనన్నలను పొగిడితే ఏమీ రాదు, ప్రజలతో తిరిగి కష్టపడి పని చేస్తేనే, గుర్తింపు గౌరవం.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎంపీలలో ఎమ్మెల్యేల్లో, అధిక మంది హైదరాబాద్, బెంగళూరుల్లో, చెన్నైలలో లేదా ఇంకోచోట, తమ వ్యాపారాలకే అవసరాలకే, అధిక సమయం కేటాయిస్తుంటారు.
కానీ కేతిరెడ్డి, జాగింగ్ లో లేదా ఒక్కోసారి ఒక్కో వార్డ్ ఎంచుకుంటూ, ప్రతి మనిషిని కదిలించి పలకరించి సమస్యలు తీరుస్తున్నారు, వాళ్ళ ఇళ్ళ వెంటపడి తిరుగుతూ విచిత్రముగా, మంచి మనసుతో.
అత్త కోడలి తగువు కి కూడా, ఓ తల్లి ముందు అత్త కి 5 కేజీల బియ్యము ఇవ్వమని చెపుతున్నారు. స్థలాలు పంచెటప్పుడు సమస్యలు వస్తే, అధికారులను వాలంటీర్లను అప్పుడే పిలిచి, గట్టి గా అడిగి, సమస్య పరిష్కారము కావాలి అని ఆదేశిస్తున్నారు.
మనిషి ఆకారము పద్దతి చూస్తే, కాస్త మిలటరి లేదా పోలీసు లాగా ఉన్నా, మాట కరకుగా ఉన్నా, మనిషి లో ప్రజలకు మంచి చేయాలి, ఎమ్మెల్యే గా నా బాధ్యత నేను నిర్వర్తించాలి అన్న పట్టుదల కసి కనపడుతుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, 1985 నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ 5 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ 2 సార్లు గెలుపు దక్కించుకుంది. ఇలాంటి గట్టి తెదేపా నియోజకవర్గంలో, కేతిరెడ్డి తొలిసారి వైసీపీ జెండా ఎగురవేశారు.
2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, 2014లో వైసీపీ తరఫున ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున కేతిరెడ్డి.
ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న పనుల విషయం తెలుసుకున్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అభినందించినట్లు సమాచారం.
కేతిరెడ్డి గారి సిబ్బంది అన్ని వీడియోలే పెడుతున్నారు, ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది.
మనం మొన్న తాడిపర్తి గొడవ గురించి రాశాము,
link, జేసీ బ్రదర్స్ గురించి, ఎంత మర్యాదగా జవాబు ఆరోపణలు చేస్తున్నారో చూడండి. అలా ఉండాలి, విమర్శించినా మర్యాద గౌరవము పోకూడదు.
గత రక్త చరిత్రలో, సూర్యప్రతాపరెడ్డి హత్య జరిగిన తర్వాత, కాంగ్రెస్ పై తెలుగుదేశం నేతలు దుమ్మెత్తిపోయగా, ప్రతాప్ భార్య, తనయుడు మాత్రం కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ అండ తో ధర్మవరంలో, వెంకట్రామిరెడ్డి అక్కడ సెటిలయ్యారు. 2005 నుంచి 2009 మధ్యన ఇన్ చార్జిగా ఉన్నారు.
కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తమ్ముడు పెద్దారెడ్డి. జేసీ వర్గంతో వీళ్లకు మొదటి నుంచి పడదు. ఈ క్రమంలో గతంలో సూర్యప్రతాపరెడ్డి ఒక సారి పోటీ చేసి, జేసీకి గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు జగన్. తాడిపత్రి ఇన్ చార్జిగా ప్రకటించారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇప్పుడు గత జేసీ చర్యలకు ప్రతిచర్యలు చూస్తున్నాము.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,323,902; 104 తత్వాలు (Tatvaalu) and views 252,332 Dt : 18-Jan-2021, Upd Dt : 18-Jan-2021, Category : Politics
Views : 1543
( + More Social Media views ), Id : 931 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
anantapur ,
dharmavaram ,
mla ,
kethireddy ,
walks ,
people ,
call wish name ,
order ,
officials ,
solve problems ,
venkatarami ,
reddy ,
surya pratap ,
pedda Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments