100 కోట్ల మందిలో, 100 మంది మాత్రమే దేవుని వైపు. మరి ఆ 100 కోసం, ఆశ్రమము/ మఠము, మాకు మీకు అవసరమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,339; 104 తత్వాలు (Tatvaalu) and views 253,852.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Out of 100 crore people, only 100 are on Gods side. And for that 100, do we or you need Ashram/ Matham?

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే |
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః || భగవద్గీత 7-3

मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: || 3||

manuṣhyāṇāṁ sahasreṣhu kaśhchid yatati siddhaye
yatatām api siddhānāṁ kaśhchin māṁ vetti tattvataḥ

BG 7.3: Amongst thousands of persons, hardly one strives for perfection; and amongst those who have achieved perfection, hardly one knows Me in truth.

ఈ మనుష్యులలో, కొన్ని కోట్లమందికి, ఎవడో ఒకడు, నా తత్త్వం కొఱకు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నిస్తారనే జిజ్ఞాసువులనబడే వారిలో కూడా, సరియైన సాధన పద్ధతినీ, తత్త్వ దృష్టినీ అవలంబించి (నన్ను) నా తత్త్వమును ఉన్నదున్నట్లు, వాస్తవంగా గ్రహించేవాడు ఎవడో ఒక్కడుంటాడు.

*ప్రశ్న/ స్పందన - ఏమండీ ఎన్నిక అవసరం లేని సంఘ/ సమూహ గౌరవ సభ్య పదవి వద్దు అన్నారు, సరే అది ప్రాపంచిక మోహం, పర్లేదు. మరి కనీసం ఒక ఆశ్రమము/ మఠం అయినా పెట్టవచ్చుకదా, దానికి కావలసిన సజీవ గురువు సేవ 9 ఏళ్ళు ఉంది, మీ శనివారం లిస్ట్ చాలా పెద్దది, మాకు ఎవరూ ఆ లక్షణాలతో కనపడటం లేదు. వాటిలో పావు వంతు చేసే వారు లేరు, కోటి రూపాయల పందెం.*

*Question/Response - You said that you don't want the position of honorary member of a society/ group that doesn't require election, well thats worldly lust, no problem. But at least one Ashram/ Matham can be set up? You have the service of a living guru for that is 9 years, your Saturday list is very long, we don't have anyone with those qualities. There is no one who can practice a 1/4 of them, a bet of crore of rupees.*

ఒళ్ళు కదలకూడదు, చొక్కా నలగకూడదు, పాదం/ చేతులు కందకూడదు, కడుపు/ బరువు/ కొవ్వు/ బీపీ/ షుగరు/ తలనొప్పి తగ్గకూడదు, రోగం/ బద్దకం/ నిర్లక్ష్యం వదలకూడదు, క్షణం లో వెన్నుపోటు ద్రోహం తో అయినా కోటి రావాలి, అవసరం అవకాశం లేకుండా ఇతరులతో, అలాగే కనీసం భాగస్వామి, తల్లి దండ్రులు/ పిల్లలతో కూడా మాట్లాడకూడదు అన్నట్లు ఉన్నారు జనం.

నోటితో స్వచ్చ మంత్ర ఉచ్చారణ, వాక్సుద్ది, గాత్రశుద్ది నైవేద్యం ఉంది. సొంత పేరడీ పాటలతో దైవం వైపు మొగ్గు చూపెలా సామాన్యులను చేస్తున్నారు. రాత నైవేద్యం తో పురాణాలు, వేదాలు, నేటి పరిస్తితులు, నాయకులు, అధికారులు, సామాన్య జనం, అందరి గురించి మంచి చేయమని, మంచిగా మారమని, సుతిమెత్తగా సామాన్య భాషలో, 5 వ తరగతి వారికి కూడా అర్ధం అయ్యేలా, రోజూ కోరుతున్నారు.

యోగా, జలనేతి, ధ్యానం చేస్తున్నారు, ఆ పరిణితి మీ ప్రతి మాటలో కనపడుతున్నది. 3 ఏళ్ళ పైగా ఆదాయం లేకపోయినా గోఫండ్ కు పోలేదు, దేనినీ అమ్మలేదు, అప్పులేదు, అమ్మ సౌకర్యాలు ఆపలేదు. సజీవ సాక్ష్యముతో, ఆశ్రమానికి కావలసిన అన్ని హంగులు/ అర్హతలు/ సాధన మీకు ఉన్నాయి. మీరు ఆశ్రమము పెడితే, మేము మొదట వస్తాము. మీరు కఠిన నియమాలతో సాధన చేస్తూ, మాకు నేర్పుతారు.

ఇప్పుడు ఉన్న పేరెన్నికగన్న ఆశ్రమాలు అధిపతులకు, ముందు చరిత్ర సాధన స్తిరత్వం త్యాగం సేవ స్తితప్రజ్ఞత ఆచరణలో, చాలా మందికి సాక్ష్యం తో తెలీదు. ఎవరో చెప్పిన మాటలు విని, గుడ్డి గా వెళ్ళిపోతున్నారు. తెలుగు గురువులు వేమన బ్రమ్మం రాఘవేంద్ర స్వాములను వదిలి, పాత రోత కొత్త వింత అన్నట్లుగా, ఊరుకో 4 వ్యాపార మందిరాలతో, పరాయి భాష బాబాయిల చుట్టు తిరిగే మూర్ఖ మానసిక బలహీన జనం, ఇలాంటి గురువుల దగ్గరకే వెళతారు.

మానసిక నియంత్రణ బలం లేని జనము లక్షలతో/ లక్షలలో ఉన్నారు, ఈ గురువులకు. ఆ కలియుగ మోహ గురువులు, ఈ లక్షల తమ శిష్యులను ఇలా అడిగితే - మీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం, ఎంత వరకు వదిలారు? ఎన్నేళ్ళ సజీవ గురువు సేవ చేసారు, మీ సాధన పరిపక్వత నిరూపణ ఏది అని అడిగితే, సాక్ష్యం చూపించండి అంటే, మీలాగా శనివారం లిస్ట్ రాయమంటే, ఇంక, ఆ ఆశ్రమ/మఠం లలో ఆ దరిదాపుల్లో కూడా, ఒక్క శిష్యుడు కూడా మిగలడు.

ఇతర మతాల వారికి, మీ శనివారం లిస్ట్, అసలు అర్ధం కాదు. అర్ధం అయితే, ఆచరణలో వారు చేస్తే, ఇతర మతాలు అనవసరం అని, సనాతన ధర్మం వైపే వస్తారు. మానవ సేవ మాధవ సేవ అని, నరుని సేవ నారాయణ సేవ అని, 78 ఏళ్ళ తూలి పడే తల్లి ని, సొంత కూతురులా ప్రేమ అభిమానం క్రుతజ్ఞత విశ్వసనీయత, అలాగే గురువులా రోజూ 9 ఏళ్ళుగా చేయిపట్టి, పడకుండా ఓ మైలు నడిపిస్తూ, ఆయుర్వేదం సొంతగా ఇస్తూ, ప్రపంచ ప్రఖ్యాత వైద్యం ఇప్పిస్తూ, పళ్ళు ఫలహారాలు మందులు సమయానికి ఇస్తూ సజీవ గురువు సేవ చేస్తున్నారు. అత్యవసర పరిస్తితిలో ఒకటి రెండు కూడా ఎత్తిపోసారు, నిద్ర లేని రాత్రు ఉన్నారు, చాప వేసుకుని, ఈనాటికీ అమ్మకు దగ్గర లో కింద పడుకున్నారు, యముడు రాకుండా కాపలా.

మేము మీ వాట్సాప్ స్టేటస్ లో అన్ని ఫోటోలు వీడియోలు చూసాము, అవి మాకు పంపకపోయినా, రీడ్ రిసీప్ట్ తో, మీకు కూడా తెలుసు. కన్నీళ్ళు కారిపోయాయి అవి చూసి, ఎందుకంటే మా భాగస్వామి, పిల్లలు అలా మాకు సేవ చేస్తారు అని ఒక్క శాతం కూడా నమ్మకం లేదు, మా తల్లి దండ్రులకు మేము చెయ్యలేదు. మా పాపాలకు, పంచభూతాల శిక్షణ తప్పదు.

ఏదో భజన చెయ్యి, అభిషేకం/ కల్యాణం చూడు, కాషాయం కట్టు, ప్రసాదం తిను, ప్రవచనం విను, పూలు కట్టు, బండ తుడువు, కాయ కొట్టు, పూజ వ్రతం దీక్ష దీపం నైవేద్యం చెయ్యి అంటే తండోపతండాలు గా వస్తారు కానీ, సాధన ఆత్మ జ్ఞానముతో, మీరు ఆచరణలో చేస్తున్న దానికి లాగా, వారిని కూడా సాక్షం చూపించమంటే, జనము మరలా రారు సుమీ, అంటే అంతా కపటం నాటకం బూటకం.

ఆ మోహ గురువులకే, సజీవ గురువు సేవ సాక్ష్యం లేదు. వారు ఆర్భాటాలు హంగులు వదలరు. వారి నేల మీద నిద్ర గురించి మేము వినలేదు. శాఖాహారం, ఆయుర్వేదం, జలనేతి, కన్న ముదుసలి తల్లి తండ్రి సేవ గురించి వినలేదు. 200 వారాల 108 ప్రదక్షిణల ఓర్పు సహనం వారికి ఉందా? లక్షల ఆదాయ పించను వచ్చే, జిల్లా ప్రభుత్వ ఉద్యోగం వదిలే, సాహసం వారు చేయగలరా? ఇంక వారికి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేదని సాక్ష్యం ఎక్కడ ఉంది? ఓ వైపు, కోట్ల రూపాయల ఆశ్రమ వ్యాపారము జరుగుతు ఉంటే? నాయకులు అధికారులతో కలసి ముందుకు సాగుతుంటే?

మీ కొత్త ఆశ్రమ ధన సహాయం కూ అసలు అనుమానమే లేదు, మేము వారిని పట్టుకుని వస్తాము. 50 ఏళ్ళు పైగా వ్రుధాగా జీవితం నాశనం చేసుకుని, కబ్జాలు కన్నీళ్ళు లంచాలు మంచాలు తో, 6 చేతులా సంపాదించి, ఇప్పుడు అదే ధనం ఆస్తి వారి మెడకు గుదిబండ గా చుట్టుకుని, రోగాలు రొప్పుల పాలయి, ఇంట్లో వారు బయట వారు చీదరించుకుని, ఎప్పుడు వారి పీడ విరగడ అవుతుందా, అంతా దోచేసుకుందామా అని ఇంట్లో వారు ఎదురు చూస్తున్న, ఆ విషయాలు బయటకు చెప్పుకోలేక మింగలేక కక్కలేక, ఇన్నాళ్ళు ఏమి సాధించామో తెలీక, మనశ్శాంతి లేని నిర్భాగ్యులు/ దౌర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారు.

మీ శనివారం లిస్ట్ చూసారు అంటే, వారు వెంటనే వచ్చేస్తారు, ఆల్రెడీ చూపించాము, ఆశ్చర్యపోయారు ఇది నిజమేనా అని. మీ ఇంటి చుట్టు పక్కల కూడా అడిగాము, తన పేరు మీద రూపాయ ఆస్తి మరియు పించను లేని (అన్ని ముందు రాశారు కాబట్టే, మిగతా వారు అమ్మను వద్దు అన్నారు, ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు, 80 శాతం ఇలాగే ఉన్నారు) అమ్మ మీతోనే 9 ఏళ్ళు గా ఉన్నారు అని అందరూ చెప్పారు. ఈ ఒక్కటి చాలు, మీ ముందు ఎవరైనా, తల దించి నమస్కరించడానికి.

అప్పుడు మీకు ఎంతో ఫాలోయింగ్ వస్తుంది. జగనన్నను/ చంద్రన్నను ముద్దులు పెట్టుకున్న పీఠాధిపతి, అలాగే కేసీయారు చుట్టూ ప్రదక్షిణలు చేసే సీతానగరం అధిపతి లాగా కాకుండా, మందుతో కూడా వామాచార పూజ చేస్తా సినిమా రాజకీయ వారికి అనే మానసిక పిచ్చి వారిలాగా కాకుండా, అలాగే అనంతపురం లో అధిపతి పోయాక గదిలో మంచం కింద అన్ని దొరికినట్లు కాకుండా, మీరూ ఇలాగే నీతి నిజాయితీలతో, నాయకులకు ఆధ్యాత్మికముగా బోధనలు చేయవచ్చు.

9 ఏళ్ల పట్టు ఉంది అంటే, దానికి ముందు 10 ఏళ్ళ పైగా శ్రమ ఉంటుంది, కాబట్టి వచ్చే 10 ఏళ్ళు పైగా కూడా మీరు ఇదే నిబద్దతతో ఉంటారు. దాని వలన వారికి మరియు ప్రజలకు మనశ్శాంతి ఉంటుంది. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు, అప్పు అనే భూతాల నుంచి వారిని రక్షించాలి.

మీతో, మీ స్నేహితులు బంధువులు గతము లో ఇలా అని ఉండవచ్చు నవ్వుతూ, కానీ మేము నిజముగా చెపుతున్నాము. మీకు ఇష్టము అయితేనే సుమా.

భగవద్గీత లో ఒక శ్లోకం ఉంది - కోటికి ఒకరు నా వైపు చూస్తారు, అందులో ఒకరు మాత్రమే నన్ను చేరుతారు అని ఉంది. ఆ కోటిలో ఒకరు మీరు కూడా అని మా నమ్మకం.

*జవాబు* - మీ అభిమానానికి ధన్యవాదాలు. గతములో చాలా మంది మిత్రులు అన్నారు, నవ్వి ఊరుకున్నాము. ఇప్పుడు మీ ప్రశ్నలోనే జవాబు ఉంది.

కొన్ని కోట్లమందికి, ఎవడో ఒకడు, నా తత్త్వం కొఱకు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నిస్తారనే జిజ్ఞాసువులనబడే వారిలో కూడా, వాస్తవంగా గ్రహించేవాడు ఎవడో ఒక్కడుంటాడు, అని భగవద్గీత చెప్పింది కదా?

అంటే 100 కోట్ల మందిలో, 100 మంది మాత్రమే దేవుని వైపు చిత్తశుద్ది తో ఆత్మార్పణతో నడుస్తారు. వీరికి, మనము చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వారూ అదే దోవలో ఉన్నారు. మరి ఆ 100 మంది కోసం, ఆశ్రమము/ మఠము మాకు మీకు అవసరమా? ధన ఖర్చుతో, ఇతరుల పాప డబ్బుతో అవసరము లేదు కదా? ఆ ధనం ఇవ్వబోయే వారు, తమ అర్హతను కూడా నిరూపించుకోవాలి కదా? అది వారికి చాలా కష్టం.

ఇప్పుడు మనకు ఆశ్రమము/ మఠం లేదు అని ఎవరు చెప్పారు? సంచార గ్రంధాలయం, ఆసుపత్రి, పోస్ట్ ఆఫీసు లాగా, మనది సంచార ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞాన బోధక ఆశ్రమము ఎప్పటి నుంచో ఉంది కదా, రూపాయ ఖర్చు లేదు, ఇతరులపై ఆధారం అవసరము లేదు. మనము ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణాలో ఉన్నా, దేశ రాజధానిలో ఉన్నా, విదేశం లో ఉన్నా, మనము అందరికీ అందుబాటులోనే ఉన్నాము కదా? మన సందేశాలు, సోషల్ మీడియా ద్వారా ఆ 100 మందికి అందుతాయి కదా?

ఆ 100 మంది కి అలాగే మాకు, సాధన పక్వ స్తితికి వస్తే, అప్పటి వరకు మేము జీవించి ఉంటే, తప్పక ఒకరినొకరు కలుస్తాము. కలుసుకోవాల్సిన అగత్యము లేదు. ఎందుకంటే ఎవరికి అప్పగించిన పనులు, వారు చిత్తశుద్దితో చేసిన చాలు కదా.

ఎందుకంటే అమ్మ సేవ ముగియగానే లేదా మధ్యలో నే, భూకంపముతో దేవునిలో ఐక్యము అయ్యే అవకాశం ఉండవచ్చు, ఎందుకంటే ఇంకో చోట ఇవే సజీవ సాక్ష్యాలు ఇవ్వాలి కదా? లేదా ఆనాటి దైవ సంకల్పం చూడాలి.

దీపం తో దీపం వెలిగించడం వరకే మన పని, గీత లో చెప్పింది అదే, తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి మనము అని. అందరితో నూ అందరిలో నూ ఉన్నది ఆత్మే, అంటే మనము ఉన్నాము అందరితో అందరిలో, కాని మనతో ఎవరు ఉండరు, ఆత్మ జ్ఞానం లేనిదే, ఉండలేరు, ఎంతో సాధన ఓర్పు నేర్పు త్యాగం ఉంటే తప్ప. మన్నించాలి, మీకు జవాబు వచ్చింది అనుకుంటున్నాము. నమస్కారములు, ధన్యవాదములు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,339; 104 తత్వాలు (Tatvaalu) and views 253,852
Dt : 27-Aug-2023, Upd Dt : 27-Aug-2023, Category : General
Views : 507 ( + More Social Media views ), Id : 1891 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 100 , crore , people , God , side , ashram , mutt , arishadvarg , Ashtavyasan , sadhana
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content