హైదరాబాద్ ఎన్నికలు మార్పు, ఆంధ్రా లో? జగన్ చంద్రన్న పవన్ వీరన్న మంచి కోరమా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,393,366; 104 తత్వాలు (Tatvaalu) and views 258,747.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

హైదరాబాద్ ఎన్నికలు మార్పు, ఆంధ్రా లో? జగన్ చంద్రన్న పవన్ వీరన్న మంచి కోరమా?

రోజులు అన్నీ మనవి కావు, తెలంగాణాలో, దుబ్బాక హైదరాబాద్ ఎన్నికలు, బీజేపీ గెలుపు. అలాగే గత వైసీపీ గెలుపు, ఆంధ్రాలో. కానీ 151 తో, మనదే రాజ్యం అనుకుంటే, రేపు మనదీ అదే పరిస్తితి అని, శ్రేయోభిలాషుల అభిప్రాయం. 50 స్థానాలలో జనసేన దెబ్బతీసిందని, తేదేపా వాళ్ళు ఒప్పుకున్నారు, అప్పుడే.

500 నుంచి 2000 ఓట్లు అటు ఇటు మారితే చాలు కదా? జనసేన గెలుస్తుందా లేదా కాదు, మనకు నష్టం చేస్తుందా లేదా? తిరుపతి స్వర్గీయ దుర్గారావు గారి వారసులకి, ఎంపీ స్థాయి నుంచి రద్దు చేసిన ఎమ్మెల్సీ స్థాయి కి ప్రమోషన్ ఇచ్చారు, విశ్వసనీయతకు తిలోదకాలు, ఇది చాలా అన్యాయం.

బీజేపీ, జనసేన, తెదేపా ఎలా ఓట్లు చీల్చుకుని, వైకాపాను గెలిపిస్తారో ఓడిస్తారో చూడాలి. జన బలం లేని బీజేపీ ముందుకు దూకుతుంది. అందరూ విడివిడి గా పోటీ చేసి, తమ బలం తేల్చుకుని, వైకాపాను గెలిపిస్తారేమో? అస్సెంబ్లీ లో లేదా సోషల్ మీడియాలో, ప్రజా సమస్యలపై, ఎక్కువగా నిరంతరం తెదేపా తప్ప, బీజేపీ జనసెన పోటీ పడటం లేదు, జగనన్న వైఫల్యాలతో.

మన చుట్టాలకే స్నేహితులకే, ఊరక డబ్బు పంచి గౌరవం తెచ్చుకుంటే, పంచని రోజున మనల్నే తిడతారు లేదా ఎదో విషయం దగ్గర అలిగి, మనల్నే ముంచుతారు. డబ్బు మింగిన చుట్టాలు, ఫోన్ ఎత్తడం లేదు. అప్పుతో, తాకట్టుతో, సంక్షేమ పధకాలు అంతే. సరైన దోవలో, ఆదాయము పెంచి, ప్రజలకు పంచు, తప్పు లేదు.

* మైళ్ళు పాదయాత్ర చేసిన జగనన్న అంటే ఇష్టము, అంత మాత్రాన, అన్ని నియంత లాగా చేసుకొని, మరలా గెలిచే అవకాశం లేకుండా చేసుకుంటే, బాధగా ఉండదా, మనకైనా? అడగవద్దా? లోపాలు, పొరపాట్లు సరి చేసుకోమని? అప్పుల పప్పుకూడు అన్న, చెడ్డ పేరు అవసరమా? కొడాలి లాంటి వారి నోరు, అలా వదిలేయడం కరెక్టేనా?

మన సొంత కొడుకు, అప్పులు చేసి, స్థలాలు తాకట్టు పెట్టి, దిగజారుతూ జనాలకు పంచుతుంటే, చెయ్ చెయ్, అని ప్రొత్సహిస్తామా ఈలలు వేసి? బుద్ది చెప్పమా? జగనన్న చంద్రన్న మన వాళ్ళు కాదా? చంద్రన్న పసుపు కుంకుమ కింద ఇచ్చింది, ఓటుగా వెనక్కి వచ్చిందా?

* హైటెక్ సిటీ తో ఐటీ ని అందరికీ దగ్గర చేసి, హైదరాబాద్ కి అమెరికా నాయకులను తెచ్చి, అమరావతిలో తాత్కాలికం గా అయినా, కట్టుబడి కట్టి చూపించిన, చంద్రన్న అంటే ఇష్టము. అంత మాత్రాన, ఆయన చేసే ప్రతి పని సమర్దిస్తామా? సింగపూర్ వాళ్ళకి తనకు నచ్చిన వారికి, ఎకరాల ఆధిపత్యం ఇచ్చి, వాళ్ళు వేసిన అభివ్రుద్ది అంటామా? చింతమనేని ని అదుపు చేయలేక పోవడం, కరెక్ట్ అందామా? మరలా పార్టీని అధికారం లోకి తేవడానికి, వాస్తవ పరిస్థితులు చెప్పి, అమరావతి లోనే ఉండమనడం, లోపాలు చూపడం తప్పా?

* బీజేపీ సిద్దాంతాల ను అవపోసన పట్టిన ఆరెసెస్ వీర్రన్న అంటే ఇష్టం, అంత మాత్రాన, స్థానిక నాయకుల ఫోటోలు పనులు సేవలు, స్థానిక ఫేస్బుక్ పేజీలలో పెట్టించలేని, అసమర్ధతను, సమర్ఢన చెద్దామా? నాయకులు, వైకాపా తేదేపా వైపు వంగుతుంటే, సమర్ధన చేద్దామా? బీజేపీని రాష్ట్రం లో ఎదగనీయకుండా చేస్తుంటే, చోద్యం చూద్దామా? వీరు అధికారంలోకి రావడానికి, తెలిసిన విషయాలు మార్గాలు చెప్ప వద్దా?

* పవనిజం తో వచ్చి, సామాన్య కార్యకర్తా లాగా, గుండెలలో నుంచి వచ్చే మాటలను, చెప్పి చేస్తున్న, ఉద్దానం వంటి సమస్యలను పైకి తెచ్చిన, పవనన్న అంటే ఇష్టము. తర్వాత అవకాశం, పవన్ కే అని జనం అనుకుంటే, వీరు అధికారంలోకి రావడానికి, తెలిసిన విషయాలు చెప్ప వద్దా?

మరి ఇప్పుడు మేము ప్రజల కు, జగనన్న కు, చంద్రన్న కు, వీరన్న కు, పవనన్న కు, సోషల్ మీడియా కార్య కర్తలము కాదా? అందరూ బాగుండాలి అని కోరడం తప్పా? మన రాష్ట్రం చల్లగా ఉండాలి అనుకోవడం తప్పా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,393,366; 104 తత్వాలు (Tatvaalu) and views 258,747
Dt : 04-Dec-2020, Upd Dt : 04-Dec-2020, Category : Politics
Views : 890 ( + More Social Media views ), Id : 837 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hyderabad , elections , results , change , andhra , care , our leadars good , jagan , chandranna , pawan , veeranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content