అరిషడ్వర్గ అష్టవ్యసన, కపటం, నాటకం, 2 నాల్కల తో, మేము బంధువులు స్నేహితులు, బాగానే ఉన్నాము? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2186 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2221 General Articles and views 2,493,485; 104 తత్వాలు (Tatvaalu) and views 267,400.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ అరిషడ్వర్గ అష్టవ్యసన, కపటం, నాటకం, 2 నాల్కల తో, మేము మా బంధువులు స్నేహితులు అందరమూ, బాగానే ఉన్నాము కదా?*

With Arishadvarga Ashtavyasana, hypocrisy, drama, 2 words, we all our relatives and friends are fine, arent we?

*ప్రశ్న/ స్పందన - ఏవండీ కపటం, నాటకం, 2 నాల్కల తో మేము మా బంధువులు స్నేహితులు అందరమూ బాగానే ఉన్నాము కదా? బాగానే సంపాదించాము, ఆస్తులు కూడపెట్టాము. ఎందుకు జనాలను అనవసరముగా భయపెడతారు, మేము పార్టీలు ఫంక్షన్లు అంటూ, ప్రతి వారం కలుస్తాం, పైకి తెచ్చిపెట్టుకున్న నవ్వులు మేకప్పుల మాటలు మావి. అవి లేకపోతే మా కొన్న ఇళ్ళ అప్పు గురించి, మేము తెలివిగా చేసిన మోసాల గురించి చెప్పిన అబద్దాల గురించి, బట్టల నగల కార్ల గురించి, అమ్మ నాన్న అత్త మామలను దూరంగా ఉంచి పెట్టిన టార్చర్ గురించి, రీల్స్ వీడియోలు సోషల్ గురించి, మా మానసిక బలహీనతల గురించి, రేపు కట్నం వీసా పదవి ఆస్తుల కోసం, సంస్కార హీన సంతానమును సేల్ గురించి, ఎవరితో చెప్పాలి, ఎలా? అంతా మాకు బాగానే ఉంది. మాకో సర్కిల్ కూడా ఉన్నది. మీరు పిలిస్తే ఒకరూ రారేమో, మేము పిలిస్తే మా సర్కిల్ మొత్తము వస్తుంది. మీ సందేశం కూడా మా గ్రూప్ లో పెట్టాము, ఏ ఒక్కరికీ నచ్చలేదు మత్తు మాయ నుంచి బయటకు రమ్మనడం, మా సొమ్ము మా సంతోషం మా గొయ్యి మా పతనం మా ఇష్టం, ఇలాంటివి మేము చదవకూడదు అని నిర్ణయం చేసుకున్నాము.*

*జవాబు* ముందుగా, ఇంత ఓపెన్ గా ధైర్యముగా, మీ పద్దతులను నిర్ణయాలను, చెప్పినందుకు ధన్యవాదములు. ఇంక మేము భయపెడుతున్నాము అన్నది నిజము కాదు కదా. భయపడితే, ఇలా చెప్పరు కదా మిత్రమా.

మీకు కపటం నటన ఉన్నట్లు గా మాకు అనిపించడము లేదు, ఎందుకంటే ఇలా 80 శాతం మంది ఉన్నవి ఒప్పుకోరు, తమ గురించి తాము, ఏనాటికీ. కానీ మీకు మంచితనం కొంతైనా ఉంది, ఎప్పటికైనా, మత్తులో నుంచి బయటకు వస్తారు అన్న ఆశతో, మీరు చదవకపోయినా, ఇంకా పంపుతాము, మా దైవ రాత నైవేద్యం, స్వీకరించడం తిరస్కరించడం మీ ఇచ్చ, మీ ఇష్టం.

మాయలో బాగా ఇరుక్కున్నప్పుడు, ఆటో డిలీట్ లేదా బ్లాక్ చెయ్యండి, పర్లేదు. అది దిగినాక, మరలా అన్ బ్లాక్ చేద్దురు హాయ్ అందురు, క్షణం లో పని, పంచభూతాల శిక్షణ త్వరగా ఉంటుంది కదా.

మీరేమో ఐడెంటిటీ బయట పెట్ట వద్దు అంటారు, విలేఖరిగా మేము మీ అనుమతి లేకుండా బయటకు చెప్పకూడదు. కానీ మీ ఈ గొప్ప సామాజిక చైతన్య లక్షణాలు తెలిస్తే, క్షణములో మీకు లక్షమంది ఫాల్లోయింగ్ వస్తారు.

మా మాటలను ఎటూ మీరు పట్టించుకోరు ఆచరణలో పెట్టరు, మీ దోవలోనే వెళుతూ, మధ్యలో ఇలా స్పందిస్తూ ఉండండి, మిగతా వారైనా కళ్ళు తెరుస్తారు ఏమో చూద్దాము.

పెద్దలము మనమే ఇలా ఉంటే, ఇంక మన సంతానం, ఎంత మంది బంధువులు స్నేహితులతో, ఆట పాటలతో, ఉల్లాసముగా వాట్సాప్ సందేశాలతో, దూరం దూరంగా లేదా దగ్గర దగ్గరగా ఉంటారో, కదా ముందు ముందు? ఇదే కపట నటన 2 నాల్కలతో, తమ పెద్దలను చూసి, అదే నేర్చుకుంటారు కదూ?

మనము ఏది పంచ భూతాలకు/ ఇతర ప్రాణులకు ఇస్తే, అవే అనుభూతుల ఫలితాలను, అవి మనకు తిరిగి వడ్డీతో ఇస్తాయి. వద్దు లే వద్దు లే అని మోహమాట పడినా, ఊరుకోవు.

అదే సైన్స్ లో యాక్షన్ = - రియాక్షన్ అంటారు, ప్రాక్టికల్ గా నిరూపించారు. మీ పిల్లలను అడగండి, న్యూటన్ 3 వ సిద్దాంతం అంటారు పాశ్చాత్యులు. కానీ మన వేదం ఎప్పుడో చెప్పింది - చెడపకురా చెడేవు, కర్మ విడువదు, వెంటపడుతుంది అని. అయినా, మనకు బుద్ది రాదు.

చిన్న తనములో, చక్కెర చాలా తీపి అంటాము, ఎంత తీపి అంటే, ఓ 30 ఏళ్ళు దాటినాక, రోజు కో బిళ్ళ మింగుతూ, ఆ తర్వాత ఇన్సులిన్ ఇంజక్షనులు వేయించుకుంటూ, ఆసుపత్రులకు మందులకు, నిత్య సుంకం చెల్లిస్తూ, నిత్య బాధను దిగ మింగిస్తుంది, నరాలను రక్తమును పరుగులు తీయిస్తుంది, అడ్డుగోడలు కడుతుంది.

కానీ పెద్దలు ఏమంటారు, అమ్మాయి ఇంకో స్పూన్ వేసుకోమ్మా, చాక్లెట్లు కేకులు తినమ్మా, సోడాలు తాగమ్మా, పిజ్జా తినమ్మా, మాంసం లాగించు అమ్మా అంటారు. ఇది పిల్లల మీద, ప్రేమ నా, నటన నా, కపటమా, 2 నాల్కలా, కావాలని వారిని పతనము చేయడమా?

రామన్న రాజన్న జయలలితమ్మ శ్రీదేవమ్మ కోడెలయ్య కాఫీడేఅయ్య - వీరు సహాయం పూజ వ్రతాలు దాన ధర్మాలు యాత్ర సేవలు చేశారు. సంతానం బలగం బంధువులు స్నేహితులు అధికారం ఆస్తులు అన్ని ఉన్నాయి. వీరు మనకు ఎన్నో జీవిత పాఠాలను చెప్పారు. మా మాటలకు అంటే వేదం మాటలకు విలువ ఇవ్వకపోయినా, కనీసం ఈ పెద్దల జీవిత విలువను అర్ధం చేసుకోరా?

మా ఊళ్ళో నాటకాల రామన్న, ముందు అదే అనుకున్నారు, నటించడం ఒక కళ అని, ముందు బాగానే అవార్డులు రివార్డులు వచ్చాయి. ఊహాలోకాల్లో విహరించారు, అంతా నేనే, సర్వస్వం నాదే, అనుకున్నారు - తనను తాను మరచిపోయారు. పిల్లల సంస్కార పెంపకం, మానసిక బల నియంత్రణ సాధన వదిలేసారు.

ఇక పంచ భూతాల క్రమశిక్షణ, తమ కర్మ/ఖర్మ ఫలితాల రూపములో బయలు దేరింది. ఎన్నో ఏళ్ళు తర్వాత. 27 ఏళ్ళకైనా, ఏలినాటి శని దశ తప్పదు. మీ లాగనే, మాలాంటి వారి మాట లెక్క చేయరు, మీరు ఊరక భయపెడతారు, ఏమి కాదు లే, అని అనుకున్నారు మనలో 80 మంది లాగా.

తర్వాత ఇంట్లో అందరూ నటించారు, ఆయనకన్న ఎక్కువగా జీవించారు. అప్పుడు జీవిత సత్యం అర్థం అయింది. తెర/ స్టేజీ మీద నే, నేను నటుడు ని. ఇంట్లో అందరూ నా కన్నా, మహా పెద్ద నటులు అని, వీరికి ఆస్కార్ ఇవ్వాలని.

ఇన్నాళ్ళు అభిమానించిన వందలాది జనాలు, బంధువులు, స్నేహితులు, అధికారులు, నాయకులు, అధికారం, ఆస్తులు, కపటాలు, నటనలు, ఒక్కరు ఒక్కరు కూడా వచ్చి ఆదుకోలేదు. ఏ కపటం నటన 2 నాల్కల తో అయితే, ఇతరులను తన సొంత ఇంటి వారు బాధించారో, దానికి తాను ఇష్టం అయిష్టముగా అయినా అంగీకరించారో, అదే కపట బుద్ది తో ఇంట్లో వారు, తనను కూడా నిర్దయగా భూస్తాపితం చేసారు. అప్పుడు అర్ధం అయ్యింది, తాను చేసిన తప్పు ఏమిటో. కానీ అప్పటికే పతనం పూర్తి స్థాయిలో అయిపోయింది.

దుర్యోధన, రావణ, కీచక, తాటకి, కైక, పూతన, శూర్పణక, ఇవన్నీ మనలో ఉన్న అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు, కట్టు కధలు కావు, కమ్మటి జీవిత పాఠాలు. వారు ఇలాగే కపట నటన 2 నాల్కలతో ఆనందించారు ముందు, కానీ ఫలితాలు కూడా అనుభవించారు మిత్రమా.

అందుకే కపటం నాటకం, ఒంట్లో ఇంట్లో, ఏ రూపాన కూడా వద్దు. ముందు బాగానే ఉంటాయి, చివరకు మన సమయం దగ్గర పడే సరికి, రక్త కన్నీరు, చింతామణి నాటకాలు గా మన ఎదుట ప్రత్యక్షం అవుతాయి.

ప్రేమను పంచు, మంచిని పెంచి, అవి నిన్ను కాపాడతాయి. కపటం, నాటకం, 2 నాల్కలను పెంచి పోషించితే, చివరకు మనల్నే కాటువేస్తాయి.

నమ్మరా, 20 ఏళ్ళు గా నక్క, పాము, పులి బుద్దితో వారికే ఓటు వేసాం, తిరపతి చైర్మన్ గా సనాతన ధర్మం విలువ, తెలియ లేని వారిని, కూర్చో బెట్టే పాపంలో, భాగం అయ్యాం.

మనకు పంచభూతాల శిక్షణ తప్పదు కదా, దానికి తోడుగా, ఈ ఇంట్లో ఒంట్లో కంట్లో పంట్లో కపటాలు నటనల కు ఫలితాలు ఇంకా ఎక్కువ సుమీ. కాల నాగు కాటేస్తుంది మనలాగే కనికరం లేకుండా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2221 General Articles and views 2,493,485; 104 తత్వాలు (Tatvaalu) and views 267,400
Dt : 28-Aug-2023, Upd Dt : 28-Aug-2023, Category : General
Views : 438 ( + More Social Media views ), Id : 1894 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : arishadvarga , ashtavyasana , hypocrisy , drama , 2 , words , relatives , friends , fine
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content