మీరూ చెప్పండి కొన్ని పధకాలు పేర్లు, జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న లకు - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,460; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కింద చెప్పిన ఇలాంటి పధకాలు పేర్లు, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రన్న కు తోచవు. విదేశాల్లో చదివిన లోకేష్ అన్న కూడా చెప్పరు. ఏంది తండ్రి, మన సొంత హెరిటేజ్ లేదా ఆస్తులు అమ్మి, మన పేర్లు పెట్టుకున్నా బాగుంటుంది. కానీ ఆ అమ్మిన ధనం తో, చిత్తూరు జిల్లా కూడా, బాగు చేయలేము. ఊళ్ళో జనం టాక్స్ సొమ్ము తో, మన పేర్లు వద్దు. మన వంశానికి ఇది అవమానం అంటారా? మనం ఆదర్శముగా ఉందాము నచ్చ చెపుతారా?

పోనీ, రాజన్న కుమారుడు యువకుడు, మాట తప్ప మడం తిప్ప అన్న, జగనన్న అన్నా, మంచి ఆలోచనతో చంద్రన్న ను మించిన ఆదర్శముతో, సంవత్సరం గా లోటస్ పాండ్ ఇడుపులపాయ ఆస్తులు తరగకుండా, మన కిందే ఉన్నాయి. చంద్రన్న లాగా విలువ తక్కువ, కక్కుర్తి పనులు, ప్రచారం చేయను అంటారా? మా కుటుంబం పేరు, ఫోటోలు వద్దు పధకాలు కు, స్వచ్ఛ భారత్ లాగా, రాయల్ గా స్వచ్ఛ ఆంధ్రా పధకాలు తో, మోడీ గారిని అనుసరిస్తాను అంటారా? మోడీ గారిని అనుసరిస్తే ఎంత ప్రచారం వస్తుంది, కేంద్రము లో పలుకుబడి పెరుగుతుంది.

చంద్రన్న జగనన్న ఇద్దరూ మోడీ ముందు, తలవంచి చిరునవ్వు ల తో ఉన్నప్పుడు, ఆయన అయినా కనీసం బుద్ధి చెప్పరే - తెలుగు అబ్బాయిలు, ఈ పేర్ల ప్రచార వెర్రి ఏమిటి. నా కేంద్ర పధకాలు కు ఎక్కడా నా పేరు లేదు, చెత్త కాంగ్రెస్ లాగా. మీ పధకాలు కు జనం టాక్స్ ల సొమ్ముతో, మీ పేరు సిగ్గు గా, అనిపించడం లేదా అని? సీబీఐ కి అనవసర పని ఎందుకు అని లేదా మన ఇద్దరి ఫోటోలు, వాటా శాతం తో వివరంగా, నిజాయితీ గా పెట్టమని.

చదువు తో ఉద్యోగాలు చేసే విదేశాల్లో ఉన్న, ఎన్నారై లేదా పక్కన రాష్ట్రాల లో పనిచేసే తెలుగు వారు కూడా, విడమరిచి తమ పార్టీలు కు నాయకులకు, ఊరి జనం కు చెప్పరే? అది ఊరి జనాల పన్ను సొమ్ము అని.

నిన్న ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. మా అన్న గతంలో 20 వేల కోట్లు అప్పు చేసి అభివృద్ధి చేశారు తెలుసా అని. వెంటనే, ఇప్పుడు ఉన్న అన్న అదనముగా 50 వేల కోట్లు అప్పు తో అభివృద్ధి చేయబోతున్నారు తెలుసా అన్నారు. మా అన్న మరలా ఎక్కితే, 80 వేల కోట్లు చేస్తారు తెలుసా అన్నాడు. అసలు, ఇక అప్పు దొరకనంత వరకూ మా అన్న, ఇప్పుడే ఎక్కువ చేస్తారు అన్నారు, ఇంకొకరు. ఇది అన్నల భక్తుల వాదన.

ఎన్నైనా చెప్పండి, ఈ ఇద్దరు అన్నలే ఉండాలా, అప్పు చేయాలా పప్పు కూడు తినాలా, ప్రభుత్వ మరియు దేవాలయ భూములు అమ్మాలా, మేము రోడ్డు న పడాలా, మా తర్వాత తరాలు బానిసలుగా ఉండాలా. మా వర్గం వారు, ఎలచ్చన్ అప్పుడు అవి చేతిలో పెడితే చాలు, అని ఇంకొకరు.

జూమ్ మీటింగ్ లు తో, సోషల్ మీడియా స్టేట్మెంట్ లతో, రోడ్డు మీదకు రాని, స్వచ్ఛ ప్రతిపక్ష బిజెపి జనసేన నాయకులు. మనం తిరిగేది ఏమిటి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో గెలుద్దాం, ఇప్పుడు కాక పోతే ఇంకో పదేళ్ళకు, అని వారి ఆశ. మేరా భారత్ మహాన్.

మీరూ చెప్పండి కొన్ని పధకాలు పేర్లు, జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న లకు,

1. దేశ రాష్ట్ర భక్త పన్ను దారుల ఆరోగ్యశ్రీ
2. పౌర పన్ను ల, విద్యా కానుక
3. ఉత్తమ పౌరుల, రైతు భరోసా
4. దేశ భక్త శ్రమ, మధ్యాహ్న భోజన పధకం
5. రైతన్నల 2 రూపాయల బియ్యం పధకం
6. పన్ను దాతల ఫింఛన్లు
7. పన్ను దాతల గౌరవ నిరుద్యోగ భృతి
8. పన్ను దాతల కళ్యాణ లక్ష్మీ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,460; 104 తత్వాలు (Tatvaalu) and views 226,431
Dt : 10-Oct-2020, Upd Dt : 10-Oct-2020, Category : Politics
Views : 809 ( + More Social Media views ), Id : 747 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : names , andhra , plans , projects , jagan , chandra babu , pavana , viranna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content