తెలుగు సంఘాల వింత సంత పోకడ - తానా కొత్త ఎన్నికల సమాచారం 2023-25 - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,227; 104 తత్వాలు (Tatvaalu) and views 226,409.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Strange Santa trend of Telugu Sanghams - TANA new election information 2023-25*

ముందుగా అందరికి అభినందనలు. లాలూచి పడి పాద దాసులు గా, సెలెక్షన్ తో వెలిగే కుసంస్కార పెంపకం ఆత్మాద్రోహం వదలి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ముందుకు వచ్చిన, వీరులకు వందనాలు. మరి ముఖా ముఖి డిబేట్ ధైర్యం వీరికి ఉందా? కాలమే నిర్ణయిస్తుంది.

TANA Election 2023-25 తానా ఎన్నికలు - Jay Talluri Group జయ్ తాళ్లూరి వర్గం, Kodali-Lavu Group కొడాలి-లావు వర్గం, సొంత వర్గం, బాకప్ వర్గం, ఇలా వివిధ రకాలుగా ఉన్నాయి అంటున్నారు. ప్రధాన పోటీ కొడాలి, వేమూరి మధ్యనే అంట.

Final Draft 12/6/2023 Executive Vice President Have contest to the following - Gogineni, Kodali, Nalluri, Vemuri. Nomination Fee: Executive Vice President US $5,000, Regional Coordinator US $1,500 and all other positions US $2,500. Only 50% of the nomination fee will be refunded in case of withdrawal before the deadline.

1. Naren Kodali నరేన్ కొడాలి 2. Sateesh Vemuri సతీష్ వేమూరి 3. Sreenivasa Gogineni శ్రీనివాస గోగినేని 4. Prasad Nalluri ప్రసాద్ నల్లూరి.

తానా కొత్త ఎన్నికల, లోతైన సంస్కార సమాజ సమాచారం, ఉంటే పంచుకోగలరు. ఇప్పుడు పోటీలో ఉన్నది, ఇద్దరా, ముగ్గురా, నలుగురా? ఆ మిగతా వారి టీం లిస్ట్ కనపడుటలేదు.

బాకప్ నా, పోటీలో ఉన్నారా, ఇతరులతో కలసి పోయారా, అలసి పోయారా, లేదా మొత్తం ఆపడానికి/ మార్చడానికి కోర్ట్ కు వెళుతున్నారా?

కొడాలి, వేమూరి టీం లిస్ట్ మాత్రమే కనపడుతుంది - తప్పులు ఉంటే చెప్పగలరు, సరి చేసుకుందాము.

ఈ ప్రశ్నలు అన్ని తెలుగు సంఘాలకు సుమీ - అందరూ ఆ తాను ముక్కలే, ఏ ఒక్కరిపై పక్షపాతము లేదు, అందరు మన బంధువులే, స్నేహితులే, అవసరానికి మనకూ సహాయం చేసేవారే. కానీ వారికి భవిష్యత్ పతనము వద్దు అని, పంచభూతాలు ఎవరినీ వదలవని, అర్ధం చేసుకోమని ప్రార్ధన, విన్నపము మాత్రమే.

తెలుగు పార్టీలలోనే ఎన్నో ఉదాహరణలు మన అందరికీ తెలుసు. నాటి రాక్షసులు నీతి నియమాలు పాటించి, తమ అంత రంగాన్ని స్పష్టముగా చెప్పారు నిండు సభలో - నేను సూది మోపినంత భూమిని కూడా ఇవ్వను అని. మరి వారి కన్నా దిగజారి, కపట నాటకాలు ఎందుకు? అలా చెప్పినా కూడా, కౌరవుల వెంట 3 వంతుల జనం ఉన్నారు. మన దాసులు మన వెంటే ఉంటారు కదా, తప్పులు ప్రశ్నించకుండా, ఇంక భయమేల?

1. ఎవరికి ఎవరు గాడ్ ఫాదర్, ఎందుకు ధైర్యముగా పాంప్లెట్ లో చెప్పుకోలేరు? దాపరికము, చాటు, నాటకం ఎందుకు? మాకు స్పాన్సర్ ఫలనా వారు, మాలో ఈ గుణాలు నచ్చి వారు మమ్మల్ని నిలబెట్టారు, ఆత్మాభిమానంతో మేము రేపు పాద సేవ చేయ బోయేది, ఈ దొరగారికే మొదటి కొబ్బరి కాయ అని లేదా ఒంటరిగా మాలాగా 20 ఏళ్ళ పోరాటం అనో, ఎందుకు ధైర్యముగా, క్రుతజ్ఞత, విశ్వసనీయతతో చెప్పలేరు?

2. ఎవరు ఎవరిని విడిచారు, వలచారు? ఎందుకు కలిసారు, ఎందుకు విడిపోయారు? ఎందుకు ఇన్ని రోజులు వారి మంచి/ చెడు గుణాలు తెలీలేదు? ఎందుకు చాటుగా పదవులు పంచుకున్నారు, ఎందుకు ఇక కలసి బతకలేమన్నారు? ఎందుకు ఎన్నికలంటే భయం? కుటుంబం లోనే ఏకాభిప్రాయం లేకపోతే, సంఘములో ఏకాభిప్రాయం ఎలా కుదిరింది? ఎక్కడ లాలూచీ పడ్డారు, తలవంచారు? ఎందుకు సంస్కార పెంపకాన్ని ఎలుగెత్తి చాటారు?

3. బాలెట్ కలెక్షనా? లేక ఆన్లైన్ వోటు అందుబాటు నా, మన గ్రూప్ వీకెండ్ పార్టీలో? ఆత్మాభిమానముతో ఓటర్లు ఓటు వేస్తున్నారా? ధనం విందు మందు చిందు పొందు అవసరం అవకాశం కు లొంగిపోతున్నారా?

4. వీరికి ముఖా ముఖి ఎదురు ప్రశ్నల మీటింగ్ కు హాజరయ్యే ధైర్యం ఎందుకు లేదు? గాడ్ ఫాదర్, ఎందుకు అనుమతి ఇవ్వరు? తమ అనుచరుల గొప్పతనము ప్రపంచానికి తెలియనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు డిబేట్ పెడితే, మిగతా సభ్యులు అనవసరముగా తిరగడం, ఖర్చు పెట్టడం ఉండదు కదా? పిల్ల పాపలతో ఇంట్లో ఉంటారు కదా? ప్రజలకు అన్ని విషయాలు మీ నోటి ద్వారానే తెలుస్తాయి కదా, మేము ఊహించి రాయకుండా?

5. ఫోన్ నంబర్లు ఎందుకు దాచుకున్నారు? నేరుగా సభ్యులకు మరియు తెలుగు ప్రవాసులకు మీరు ఫోన్ లో దొరకరా, జవాబులు చెప్పరా? ఇదేనా సేవ అంటే?

6. మనకు అండ ఏ తెలుగు పార్టీ ఉంది? ఏ నాయకుడు మనకు అండ? ఏ పార్టీ, ఏ అస్సెంబ్లీ సీటు కు, మన ఆశ? ఎందుకు ధైర్యముగా చెప్పలేము?

7. మన 20 ప్రశ్నల కు వీరు జవాబులు రాసి పంపగలరా? లేదా గత పిరికి మానసిక బలహీన నాయకులు గా, గమ్మున ఉంటారా?

నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్/లాభాపేక్ష లేని సంస్థ ను విలేఖరులే కాదు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే, నిస్వార్ధ సేవకు, కపటం, నాటకం, 2 నాల్కలు, దాపరికం, పెత్తనం, కోప తాపాలు పగలు ఉండవు. కానీ వీరు వీలైతే చాటుగా పదవులు పంచుకుంటారు, లేదంటే కోర్టులకు పోయి తగవులాడుతారు. నీకింత నాకింత, నచ్చితే ఉండు, లేదంటే పో.

* * *

డిసెంబర్ 12,2023 సమాచారం - ప్రజాస్వామ్యం అంటే, తానాలోనే, మంచైనా, చెడైనా.

మిగతా తెలుగు సంఘాలు చాలా వరకు, గాడ్ ఫాదర్ బానిసత్వములో, వరుస ఏడాది పదవుల పంపకాలలో, చాటుగా మునిగి తేలుతూ, ఎన్నికలు పెట్టే, ముఖా ముఖి పోరాడే, ధైర్యం, పెంపక సంస్కారం లేక, గుట్టుగా తమ వ్యాపారాలు/ సామ్రాజ్యాలు సాగిస్తున్నాయి.

ఏకాభిప్రాయం మనకు ఏనాటికీ కుదరదు, ఒక ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలో అలాగే పిల్లల మధ్యలో లేదు. మరి సంఘాలలో ఏకాభిప్రాయం ఎలా కుదురుతుంది, లాలూచి పడకుండా? అది ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.

ఈ రోజు మనకు అనుకూలముగా జరిగినా గెలిచినా అనుకూలముగా మార్చుకున్నా, భవిష్యత్ లో, మనల్ని తన్నే వాడు ఇంకొకరు వస్తారు. కాంగ్రెస్ కు రామన్న జవాబు చెప్పారు, రామన్న కు సరైన జవాబు చంద్రన్న చెప్పారు. చంద్రన్న సరైన జవాబు జగనన్న చెప్పారు. రేపు జగనన్నకు ఇంకొకరు.

మన ఆరాధ్య దైవాలు రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్య, మీ ఇంట్లో మా ఇంట్లో లాంటి మహానుభావుల, చివరి పేజీలు చదివాము. అయినా ఎవరికీ బుద్ది రాదు. ఈ మహానుభావులు కన్నా, మేమే గొప్పవారం, ఏదో ప్రపంచాన్ని మార్చేస్తాము అంటారు.

అమెరికా అధ్యక్షులే ముఖా ముఖి ప్రశ్నల తో పోరాడుతుంటే, అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు, అబ్బే మాకు అంత ధైర్యం లేదు, ఎందుకంటే, మేము గాడ్ ఫాదర్ దాసులము, అని చాటు మాటుగా, ఎవరి గుంపుతో వారు ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నారు, ఊరక వచ్చిన ధనం ఊరి పాలు అన్నట్లు. పై నాయకులు 3 మీటింగ్ లు పెట్టి, దులుపు కుంటే పోదా, ఎందుకు మిగతా సభ్యులు దేశమంతా/ రాష్ట్రమంతా తిరగడం?

రాజ్యాలు/ సంఘాలు/ పార్టీలు మంచివే, ఉద్దేశ్యాలు మంచివే, కానీ సంస్కారం ధైర్యం నిబద్దత గుండె ధైర్యం గలిగి బానిసత్వం లేని నాయకుడు మచ్చ లేని మనిషి దొరక్క అవి కుళ్ళి కునారిల్లి పోతున్నాయి.

కొత్త తానా ఎన్నికలు/ ఫలితాలు రాబోతున్నాయి 2023/ 2024 లో బాలెట్ పంపిణీ డిసెంబర్ 15 2023 సర్టిఫికేషన్ జనవరి 14 2024.

గతము లో ముగ్గురు పోటీ, తర్వాత ఇద్దరు పోటీ. గోగినేని-తాళ్లూరి మరియు కొడాలి-లావు.

తర్వాత ఎన్నికలు పక్కన బెట్టి, అందరూ కలసి భాయీ భాయీ నీకింత నాకింత పదవుల పంపకం. మరలా కోర్టు, మరలా అక్షింతలు.

మరలా ఎన్నికలు. ఛీ ఛీ మీరు వద్దు మీ గుంపు వద్దు, మన పంపకాలు వద్దు, మరలా మీరో మేమో ఎన్నికలలో బాలెట్ పంపీణీలో లేదా ఆన్లైన్ ఓటింగ్ లో తేల్చుకుందాం, అని బాహాట యుద్దం మొదలు, కొత్త నాయకులు తో.

అయ్యో నేను మీ గ్రూప్ తో కలసి, పాతి వ్రత్యాన్ని వదిలితే, నాకు చెప్పకుండా, ఓ పదవి విసిరి ఇవ్వకుండా, నన్ను నట్టేట ముంచుతారా అని పెడబొబ్బలు. నీతి గా ఉంటేనే జవాబు దిక్కు లేదు, ఇంక నీతి తప్పినాక, జవాబు ఉంటుందా? ఉంటే అటు లేదంటే ఇటు, అంతే గాని జంపింగ్ లు ఉండరాదు, అదే 2 నాల్కల ధోరణి. అందితే జుట్టు లేదంటే కాళ్ళా?

మరలా కొంత మంది మీద అనర్హత, మరలా కోర్ట్. అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఎన్నికలు ఎందుకు తీసేసారు? పదవులు ఎందుకు పంచుకున్నారు? మరలా ఎందుకు తన్నుకుంటున్నారు?

ష్ష్ గట్టిగా అరవకు. మిలియన్ డాలర్ల ప్రశ్న. మీరు విజయవాడ/ హైదరాబాద్/ న్యూయార్క్/ చికాగో/ డల్లాస్/ శాన్ ఫ్రాన్సిస్కో/ బోస్టన్ లో చిలక ప్రశ్న అడిగినా కూడా, అవి జవాబు చెప్పలేక గిల గిలా కొట్టుకుంటాయి, ఎగిరి పారిపోతాయి. మరి వీరు కూడా, బీహార్ నుంచి పీకే లేదా ఇతర సహాయం తీసుకుంటారేమో చూడాలి.

మరలా తమ అద్రుష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందరూ పెద్ద మనుషులే, అందరికీ అధికార దాహం, సామరస్యం లేక, కోర్టుల కు ఎక్కారు, ఇంకేదో చేసారు. ఏకగ్రీవ బానిసత్వం కన్నా, ఇది కొంత నయం. వీరిని అభినందిస్తున్నాము. తెలుగు నేల ఎన్నికల కన్నా, ఎన్నో ఎత్తులు జిత్తులు మత్తులు కత్తులు సుత్తులు వత్తులు.

మరిన్ని విషయాలు, రాబోయే రోజుల్లో, కాల చిత్రములో చూద్దాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,227; 104 తత్వాలు (Tatvaalu) and views 226,409
Dt : 10-Dec-2023, Upd Dt : 10-Dec-2023, Category : General
Views : 198 ( + More Social Media views ), Id : 1961 , Country : USA
Tags : strange , santa , trend , telugu , sanghams , tana , election , information , 2023 , 25
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content