పెళ్ళికి, ఉద్యోగానికి అర్హతలు ఉన్నట్లే, మంచి మఠాలకు పీఠాలకు ఆశ్రమాలకు, నియమాలు నీతి నిబద్దత - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,921,028; 104 తత్వాలు (Tatvaalu) and views 229,549.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

There are qualifications for marriages and jobs, similarly good matha, peetha, ashrama and people also have rules and ethics.

*మన పెళ్ళికి, ఉద్యోగానికి అర్హతలు ఉన్నట్లే, మంచి మఠాలకు పీఠాలకు ఆశ్రమాలకు, నియమాలు నీతి నిబద్దత ఉంటాయి*

మనంతటం మనం పిల్లలు, స్నేహితులు, బంధువులు కు తప్పుడు వారిగా, బాధ్యతలు తప్పించుకునే వారిగా, మానసిక బలహీనులు, కపట నటన 2 నాల్కలుగా, నిరూపించకూడదు.

ఎవరి కోసమో మనం తప్పుదోవ నడవకూడదు, సాంప్రదాయం, నీతి, నిబద్దత, విడువకూడదు.

అమలాపురం, ఆఫ్రికా, అమెరికా, అంతరిక్షంలో అయినా మన నీతి నియమాలు నిబద్ధత పాటించాలి, ఇష్టం అయిన 20 మందే మన వెంట ఉంటారు.

మిగతా 80 మంది ప్రాపంచిక వ్యామోహం లో, పరుగులు తీసి, అల్లాడి అల్లాడి, చివరకు మనశ్శాంతి పోయి, 60 ఏళ్ళ తర్వాత అయినా, పంచభూతాల శిక్షణ, ఇంట్లో వారితో ప్రారంభం అయినాక, ఒకవేళ పశ్చాతాపం కలిగితే, మన మార్గం లోకే కన్నీళ్ళతో వస్తారు.

కానీ ఈ జన్మలో ఏమీ ప్రయోజనము లేదు, ఫలితాలు అనుభవించాల్సిందే. మరు జన్మలో మరలా కింద నుంచి, లేమి తనము తో, సాధన మొదలు పెట్టాలి, అదీ పాత పాప కర్మ వడ్డీ మిగులు ను బట్టి. వీరు ప్రాపంచిక వ్యామోహం నుంచి బయటకు రాలేరు, అందరినీ అదే మాయలోకి తీసుకుని వెళతారు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ లాంటి గొప్పవారు, మన ఇంట్లో అలాగే మన చుట్టుపక్కల వారు, మనకు ప్రాపంచిక ధనము, పదవి, కీర్తి వలన, జీవితము చివరి పేజీలలో ఏమి లభిస్తుందో మనకు ప్రత్యక్ష సాక్ష్యం చూపించి వెళ్ళారు. కానీ ఈ 80 మందికి బుద్ది రాదు.

ధనం ఉంది కదా, ఏదో ఆశ్రమము లేదా ఎవరో ఒకరు చూడకపోతారా, అని 80 శాతం మందికి బ్రమ. మనలాగనే అందరూ కక్కుర్తే కదా, మనం పోతే ఏదో విధముగా అంటే మెట్ల మీద నుంచి జారో ఉంటాయి కదా ట్రిక్స్ వెన్నుపోటులు, వెంటనే ఆ ఆస్తి ధనం లాగేసుకోవచ్చు, మన దరిద్రం అనవసరపు సేవ వదిలించుకోవచ్చు అని.

ఏ ఆశ్రమాలను లేదా వ్యక్తులను పూర్తి గా నమ్మటానికి ఉంది ఈ రోజుల్లో, అనంతపురం ఆశ్రమములో, ఆ పెద్దాయన పోతే, ఆయన మంచం కింద, గోడలో ఎన్నో, అష్టవ్యసన బానిసత్వ శిధిలాలు దొరికాయి కదా. పేపర్లు అన్నిటిలో రాసారు. అయినా, ఇంకా పిచ్చి జనం అక్కడ ఏదో ఉంది అని వెళుతున్నారు.

అదే కలియుగ మహాత్యం. అందరికీ అది గొయ్య అని, తప్పుదోవ అని తెలుసు, కానీ వారి కుటుంబ/ వంశ మానసిక బలహీనత, పెంపక సంస్కార లోపం వలన, మేము కూడా ఆ గొయ్య లోతు కొలిచి వస్తాము, ఎందుకు చేయకూడదు, మాకు అర్హత లేదా అని మూర్ఖముగా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో కూరుకుపోతున్నారు.

నీతి నియమము గల ఆశ్రమాలు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రన సామర్ధ్యాన్ని, సజీవ గురువు సేవను, మానసిక బలం స్తిరత్వం ను, వాక్సుద్ది చిత్తశుద్దిని, పరీక్ష చేయనిదే శిష్యునిగా రానివ్వవు. మన ధనం పదవి, వారికి పూచిక పుల్ల లాంటిది.

మన పెళ్ళికి, ఉద్యోగానికి అర్హతలు ఉన్నట్లే, మంచి మఠాలకు పీఠాలకు, నియమాలు నీతి నిబద్దత ఉంటాయి. ఎవరిని పడితే వారిని చేరుచుకుని, మధ్యలో వారికి సత్ప్రవర్తన లేదని పంపడం, వీరు వామ్మో మనం ఏదో ఇంట్లో కష్టాలు అని వచ్చాము, ఈ త్యాగాలు సాధన మా వలన కాదు అని పారిపోవడం ఉండవు.

మన దగ్గరనే సజీవ గురువు సేవ, ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలి అంటే, ముందు మీ గురించి మీరు, మీ సాధన నిరూపణ చేసుకోవాల్సిందే కదా, ఎన్నో సార్లు చెప్పాము.

మిగతా వారు, వ్యాపారం ధనం అవసరం అవకాశం కోసం, రానిచ్చినా, కొన్నాళ్ళు హానీమూన్ గా గడచినా, మన వలన ప్రయోజనము లేదని తెలిసినప్పుడు, ఓ మూలన కూర్చోబెట్టి, పురుగులా చూస్తే, మనమే పారిపోయి వస్తాము.

మనకు తెలిసిన వారు, 10 ఏళ్ళ క్రితం నుంచి తిరుపతి దగ్గర ఆశ్రమం లో ఉన్నారు, రూపు రేఖలు మారిపోయాయి. పచ్చ బొట్లు కూడా పొడిపించారు భక్తులమని. మనము స్పష్టముగా చెప్పాము, మీ మనసు మార కుండా, కఠిన సాధన లేకుండా, ఎక్కడకు పోయినా ఉపయోగం లేదు, బంతి లా వెనక్కు వస్తారు అని. నవ్వుతూ వెళ్ళారు. ఈ 2 ఏళ్ళలో వెనక్కి వచ్చి, ప్రకాశం జిల్లాలో ఇల్లు తీసుకుని, ఇక్కడనే ఉంటున్నారు.

మరి ఈ 10 ఏళ్ళు ఎవరికి సేవ చేసినట్లు? ఆ సేవ ఫలితము ఏమిటి? ఎందుకు వెనక్కు వచ్చారు? అక్కడ ఏమి జరిగింది? ఇప్పుడు ఎవరు వారిని ఆదరిస్తారు? తమ ఖర్మను, తామే రాసుకున్నారు, మూర్ఖత్వముతో, ఇప్పుడు మనము వారిని నమ్మలేము. వారికి మన సజీవ గురువు సేవ భాగ్యం కూడా పోగొట్టుకున్నారు.

అమ్మ లేదా మనల్ని 5 ఎళ్ళు పైగా నమ్మిన వారు, ముదుసలి వయసు లేదా ఇతర లోపాలతో, ఎన్ని తప్పులు చేసినా, మనము సర్దుకుంటాము. వారు ఎందుకు సర్దుకుంటారు, వారు మనలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలే కదా?

దొంగకే దొంగ, వెన్నుపోటుకు వెన్నుపోటు, నక్క పులి పాము ఓటుకు అదే ఫలితము, తాగుబోతుకే తాగుబోతు, 2 నాల్కల కపట నటన కు, అదే బుద్ది వారు స్నేహితులు బంధువులు పిల్లలు బంధముగా రక్షకులుగా దొరుకుతారు. మనము ఇచ్చినదే, మనకు తిరిగి వస్తుంది కదా?

రేపు అనారోగ్యం లేదా ఇంకో ఇబ్బంది లేదా ముదుసలి తనం తో నడవలేనప్పుడు, అదే ఆశ్రమం వారు లేదా ఇతరులు మనల్ని వెళ్ళగొట్టవచ్చు. మీ వలన ఇతర భక్తులు కు, ఇక్కడ పరిస్తితులకు నష్టం అని చెప్పవచ్చు. అప్పుడు ఇంట్లో వారు రానీయరు, ఓపిక ధనం వయసు అంతా బయట పబ్బం గడుపుకుని, ఇప్పుడు మేం గుర్తు కు వచ్చామా, అతి గతి ఓపిక లేనప్పుడు అంటారు. చచ్చి ఏడ్చి గీపెట్టినా, రానీయరు.

అందుకే కనీసం 5+ ఏళ్ళు సజీవ గురువు సేవ ఉండి, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని వారి, అడుగు జాడలలో నడవాలి మిత్రమా. మీకు, వారికి భవిష్యత్ ఖచ్చితము గా తెలుసు. మీరు అలా జరగదు అని మత్తులో అనుకుంటారు, వారు వాస్తవం గ్రహించి, ముందే జాగ్రత్తలు చెపుతారు.

ఎందుకంటే వారు మన వయస్సు, ధనం, భోగాలు, పదవి, అధికారం చూడరు. కేవలం త్యాగం, సేవ, చిత్తశుద్ధి, వాక్సుద్ది, స్ధిరత్వం, సజీవ గురువు సేవ చూస్తారు. అవి అంత తేలికగా మనకు రావు, ఎక్కువ కాలం నటించలేము. ఎందుకంటే, మన ప్రతి అడుగు, అలాగే ప్రతి మాటలో, మన కుసంస్కారం బయటపడుతుంది.

అందుకే శని వారం సాధనలు, మనం 10+ ఏళ్లుగా చెబుతోంది. వయసు మళ్ళి నాక శరీరం, మనసు మాట వినవు. నేడు మన చేతిలో, రేపు కాలుని మరియు పంచభూతాల చేతిలో. ఏ ఒకరు కూడా తమ పాపాలకు శిక్షలు తప్పించుకోలేదు, నేడు రేపు మరుజన్మ, ఎక్కడ కు పోలేరు మిత్రమా. సకల భువనాలకు నీతి నియమాలు ఉన్నాయి. ఇప్పుడైనా కళ్ళు తెరుద్దాం, మనల్ని మనం తెలుసుకుందాం, చిత్తశుద్ది తో మారదాం.

మనం మంచిని షేర్ చేయకపోతే అంటే 10 మందితో మంచి పంచుకోకపోతే, రేపు మనకు, మన పిల్లలకు, మన మనుమలకు, మన వంశముకు మంచి తెలియదు, జరగదు, దొరకదు. మనం ధర్మం కాపాడకపోతే, మెచ్చకపోతే, పంచకపోతే, కొనసాగేటట్లు చేయకపోతే, నష్టం మనకే. మన పిల్లలు, స్నేహితులు, బంధువులు అదే అధర్మం మనకు రుచి చూపిస్తారు.

సజీవ గురువు సేవ చేయకపోతే, దాని గురించి 10 మందికి నచ్చ చెప్పకపోతే, నష్టం మనకే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,921,028; 104 తత్వాలు (Tatvaalu) and views 229,549
Dt : 19-Aug-2023, Upd Dt : 19-Aug-2023, Category : General
Views : 266 ( + More Social Media views ), Id : 1882 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : qualifications , marriages , jobs , good , matha , peetha , ashrama , people , rules , ethics
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content