పిల్లల తప్పులు స్పష్టము గా చెప్పి, మనసు మార్చే విధముగా ప్రయత్నాలు, దాపరికము వలన - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1226 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1256 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పెద్దలకు జరిగిన అన్యాయము కు సంబంధించి, మనసు తో స్పందించిన గురువు ల కు వందనములు. ప్రతి ఇంట్లో ఉన్న భాగొవతమే, అది కులమతాలకు సంబంధం లేదు, కొన్ని బయటకు రావు.

ధనం అధికారం హోదా పదవి అహంకారం ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు, అవి లేనప్పుడు ప్రపంచనికి మనమూ కనపడము. అందుకే, సర్వే జనా సుఖినో భవంతు అని, సనాతన ధర్మ చెప్పింది, చూట్టూ సంతోషము గా ఉంటేనే, మనము సంతోషము గా ఉంటాము. పక్క ఇల్లు తగలపడితే, తర్వాత ఇల్లు మనదే అని మరుస్తున్నాము స్వార్ధముతో.

ఎందుకంటే, రేపు మనము అంతా, పిల్లల చేతి లో ఈతి బాధలు పడటమో, వదిలివేయడమో, అనాధలు గా ఉండటమో తప్పదు, ఎందుకంటే, మనమూ అదే పని చేస్తున్నాము, అదేవిధముగా రాళ్ళ గుండెలు గా ప్రేమ అభిమానం క్రుతజ్ఞత విశ్వసనీయత లేకుండా పెంచుతున్నాము కాబట్టి.

పిల్లల లక్షణాలు ప్రతి 5 ఏళ్ళకు, మనకు స్పష్టము గా అర్ధము అవుతాయి. వాళ్ళ తప్పులు దాచి పెడితే, మనల్ని కూడా చివరకు పాతర వేసి, అలాగే దాచి పెడతారు పెడుతున్నారు, ఎన్నో వార్తలు విన్నాము, నిన్నటి కధ అదే కదా? చివరకు, ఆ పిల్లలూ చెడిపోతారు.

పిల్లల తప్పులు స్పష్టము గా చెప్పి, బంధువులు స్నేహితుల తో చెప్పి, పిల్లల మనసు మార్చే విధముగా ప్రయత్నాలు చేయాలి. దాపరికము వలన, వారు కళాశాలలో లేదా స్నేహితులతో నేర్చుకున్న తప్పులను కూడా, మన దగ్గర అదే విధము గా దాస్తారు.

రేపు వారే అధికారులు నాయకులు అవుతారు, ఇంకో లక్ష మంది ని, రాచి రంపాన పెడతారు. కాబట్టి, మనము మారనిదే, ప్రభుత్వము మారదు.

అందుకే, మా నినాదము మొదటి నుంచి, ఏనాడూ తప్పు అధికారులు నాయకులది కానే కాదు, తప్పు కేవలం ఎప్పుడూ వారిని ఎన్నుకున్న ప్రజలదే, అంటే మనదే సుమా. అందుకే ఫలితాలు మనకే. మనము ఎంత కుట్ర పూరిత మోస అవకాశ అవసర దొంగల మైతే, మన నాయకులు అంత కన్నా ఉత్తమ దొంగలు అవుతారు కదా?

* కోట్ల విలువ చేసే 40 ఎకరాలలో, 20 ఇద్దరికీ ఇచ్చి, ఇంకో 20 తనతోనే పెట్టుకుంటే, తనను చూసిన వారికే ఇస్తాను అంటే, ఈ పరిస్థితి దాపురించేదా?

* కొడుకుల బుద్ది తెలిసి కూడా, వారి మీద ఆధారపడటం, మన తప్పు కాదా? కనీసం కూతురు కూడా, దగ్గర పెట్టు కోవడానికి, అక్కరకు రాలేదు. పిల్లల నీతి తెలిసి, బయట వారి సహాయం అండ అయినా, కోరి ఉండాలి కదా?

అందరికి చెప్పి, ఎందుకు నిలదీయలేదు? దూరం పెట్ట లేదు, తల్లి తండ్రులు? ద్రుత రాష్ట్ర మోహము లో ఉండి, తమ పతనం, తామే కోరి తెచ్చుకున్నారా? అలాంటి వారు ఎందరో ఉన్నారు, మనలో కదూ?

* ఇంటి వెనక షెడ్ లో పెట్టి ముద్ద వేస్తుంటే, మనకు ఉన్న బలగం, బంధువులు స్నేహితులు, అందరూ సిగ్గు నీతి మాలిన వారై, నోరు కట్టేసుకుని ఉన్నారా ఇన్ని రోజులు? అంటే, మనకు సమాజ బాధ్యత లేదా? మనకు నీతి ఉంటే కదా, ఇంకొకరికి చెపడానికి?

అవసరానికి, కొడుకుల వెంట తిరుగుతూ, వారి తో పనులు చేయించుకుంటూ, అవసరాలు తీర్చుకుంటూ, ముదుసలి వారి గురించి గాలికి మనము వదిలేస్తే, రేపు మన బతుకూ అంతే కదూ? మన నిక్రుష్ట అనాధ బతుకు కాపాడేది ఎవరు?

* కాకులు, తోటి కాకి చని పోతే, కావు కావున గుంపు గా అరుస్తాయి. బహుశా కుక్కలు కూడా అంతే నేమో. కానీ నీతి లేని మనుషులము, అంత కన్నా దిగజారి పోయి, తోటి మనుషులు ముదుసలి వారు, షెడ్ లో ఉండి, ముద్దలు తింటుంటే, అడిగే నాధుడు కాపాడే నాధుడు ఒక్కరూ లేరు.

ఒకవేళ అడిగే వారు వచ్చినా, ఆ పిచ్చి తల్లి దండ్రులు వింటారో లేదో కూడా తెలీదు.

పిల్లలకు తల్లి దండ్రుల మీద దయ లేనప్పుడు, తల్లి దండ్రూల కు పిల్లల మీద దయ ఉండాలా? రేపు తమ మనవడు కూడా, తమ బిడ్డను అదే విధము గా పతనం చేయడా? గుడ్డి ప్రేమతో, తమ బిడ్డ బతుకును కాలరాయడం కాదా?

అందుకే మనము మారందే, మన సమాజం, మన ప్రభుత్వం మారదు. పాపము పెరగడం లేదు తన సొంతముగా, మనము పెంచుతున్నాము అరిషడ్ వర్గాలకు బానిసలమై. ఇంకా ఎన్ని కరోనాలు రావాలో, మనల్ని పూర్తిగా మార్చడానికి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1256 General Articles, 47 Tatvaalu
Dt : 12-Jun-2021, Upd Dt : 12-Jun-2021, Category : General
Views : 134 ( + More Social Media views ), Id : 1200 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , children , kids , mind , behavior , mistakes , secrecy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content