ముదుసలి తల్లి దండ్రుల అనాధాశ్రమాలు అండా, గుది బండ వ్యాపారం? అది సేవ నా? విరాళం పుణ్యమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,561; 104 తత్వాలు (Tatvaalu) and views 266,163.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

క్రుతజ్ఞతలు విశ్వసనీయత లేని, సంస్కారం నేర్పని బిడ్డలు ఉండి, ముదుసలి తల్లి దండ్రులను దూరంగా వదిలిన వారికి, అనాధాశ్రమాలు అండా, గుది బండ వ్యాపారం? అది సేవ నా? విరాళం పుణ్యమా?

No Gratitude, untrustworthy, No samskara, Children left their old parents far away in orphanages, is it support or trouble business ? Is it a service? Is donation virtuous?

అనాధాశ్రమాల కు ఎవరో ఒకరు, విరాళాలు ఇస్తారు. మానసిక మరియు శారీరక సేవ కన్నా, ధనము విదిలిస్తే పుణ్యము అని వీరు, మూర్ఖముగా నమ్ముతారు. దాని ఫలితాలను గమనించలేరు.

కొన్ని అనాధాశ్రమాలు, ముదుసలి పెద్దలు ను ఉచితంగా చేర్చుకోరు. కొంత మంది చేర్చుకోవచ్చు, కానీ వారి వెనక అంతరంగాలను గ్రహించాలి. కని పెంచిన సొంత బిడ్డలే వదిలేస్తే, ఇతరులను ఉచితముగా గౌరవముగా ఆదరించే వారు ఉంటారా? ఉంటే ఎంత శాతం?

మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నే, పదో ఇరవో తీసుకున్నారు, లేకపోతే మాకు వద్దు గాక వద్దు, మీ ముదుసలి పెద్దలు అన్నారు.

ఇదొక ధన సంపాదన వ్యాపారం. ఆధ్యాత్మిక మానసిక నిస్వార్ధ సేవ వేరు, దానికి ఇరువైపులా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడి ఉండాలి. బతకడం కు ఇదొక దోవ గా చూస్తున్నారు, అన్ని వైపులా విరాళాలు అందుకుంటూ.

అందుకే జాగ్రత్తగా ఉండాలి, అర్హత తెలిసి దానం ఇవ్వడం, తీసుకోవడం చేయాలి. లేదంటే అదీ పాపమే. అందుకే నేరుగా మానవ సేవ ఉత్తమం. మన ఇంటి చుట్టుపక్కల, రోడ్డు మీద నిర్భాగ్యులకు అండ మంచిది, వారు నేరుగా మనకు తెలుసు. ఎక్కడి వారు అక్కడనే సేవ చేస్తుంటే ఇంక ఇబ్బంది ఏముంది?

రోడ్డు న అడుక్కునే వారిది వ్యాపారం నే, బెగ్గింగ్ మాఫీఅ అని కూడా అంటున్నారు. ఏదీ నమ్మకం లేని పరిస్థితి, ఆఖరికి గుడులే/ ప్రార్ధనా స్థలాలే, వ్యాపార కేంద్రాలు అలా ఉన్నాయి.

బాబాయి మందిరాలు అన్ని మోహ వ్యాపార కేంద్రాలు. ఎంతో మంది అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసలు వీటి మాయలో పడి, సొంత కుటుంబం పిల్లల ను, మానసిక బలహీనంగా, ప్రాపంచిక బానిసలుగా చేస్తున్నారు.

బ్రహ్మంగారు వేమన రాఘవేంద్ర స్వామి అంటే గిట్టదు, తెలీదు, నమ్మకం కుదరదు. సొంత ముదుసలి అమ్మ నాన్న కూడా అసలు గిట్టరు. పిల్లలకు సంస్కార పెంపకం అసలు తెలీదు. గుణం అంటే తెలీదు.

ఒక ఆశ్రమములో 140 మందిలో, కనీసం 100 మందికి అయినా పెళ్లి అయి, కుటుంబం సంతానం ఉండదా? ఉండి కూడా, వాళ్ళు నిర్ధాక్ష్యిణ్యముగా వదిలి వెళ్ళి పోతే, కేసు పెట్టి, బిడ్డల ఇంట్లో ఎందుకు ఉంచరు, ఇవే విరాళాలు తో?

సొంత వారి ప్రేమ ను పోరాడి అయినా ఇప్పించకుండా, వ్యాపార అనాధాశ్రమం లు పెంచడం, పుణ్య మా పాపమా? వాటిని పెంచినా, సొంత బిడ్డల మనుమల ప్రేమలు దక్కుతాయా? ఇంక ఎందుకు వారిని కన్నది పెళ్ళితో? ఇదేనా వంశ సేవ? దైవ సేవ? మనల్ని మనము తెలుసు కోవడం?

పోనీ ధనం ఇచ్చే వారు, ఈ 140 మంది అభాగ్యుల బాధలు కన్నీళ్ళు, ఓపికగా 140 గంటలు లేదా రోజులు వినగలరా? ఇది మన చేతి పనే కదా, తేలిక?

ఒకవేళ వారు, పెళ్ళి కాని లేదా సంతానం లేని, ఒంటరై తే ఇక ఏమీ చేయలేము. వీరికి అనాధాశ్రమాలు కావాలి.

మనకు తెలిసిన వారు పూరింట్లో ఉంటు, దోసెలు ఇడ్లీ అమ్ముతూ బతుకుతున్నారు. ముగ్గురు పిల్లలు. ఖర్చు కష్టం, బారెడు, సంపాదన మూరెడు. తండ్రి కి పిచ్చి పడితే అనాధాశ్రమం లో చేర్చుకోమని అడిగితే, ఉచితం గా తీసుకోం అన్నారు, నిర్మొహమాటముగా.

ఈ ఆశ్రమము చిన్నది సౌకర్యాలు ఉండవు కాబట్టి, 20 వేలు అడిగారు, పదిహేను ఏళ్ళు ముందు. ఎలాగో అప్పు చేసి మరీ కట్టారు. తర్వాత మరలా మూడో నాలుగో ఏడుకో వచ్చి, మరలా డబ్బు ఇస్తారా తీసుకుపోతారా అని బ్లాక్ మెయిల్ చేసారు, వీరు మరలా కట్టారు దిక్కు లేక.

వీరిని చూపించి మరలా, కొత్త జనం దగ్గర విరాళాలు, అన్ని వైపులా వ్యాపారమే.

ఏది నీతి, అవినీతి, సేవ, మోసం, ద్రోహం? ఇప్పుడు మనం ఇచ్చే ధనం సేవకా, ద్రోహం కు అండనా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,561; 104 తత్వాలు (Tatvaalu) and views 266,163
Dt : 10-Nov-2023, Upd Dt : 10-Nov-2023, Category : General
Views : 380 ( + More Social Media views ), Id : 1945 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Gratitude , untrustworthy , samskara , Children , old , parents , orphanages , support , trouble , business , service , donation , virtuous
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content