APLatestNews.com top Banner

Social Media links
ఎవరు వచ్చినా ప్రజలకు ఏమున్నది ప్రయోజనం, నాయకులకు గెలుపు ఓటములు ఆట తప్ప - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఎన్నాళ్ళో ఎదురుచూసిన ఫలితాల రోజు వచ్చేస్తుంది/వచ్చేసింది. సంబరాలు చేసుకోవటానికి గెలిచిన వారు, బాధ పడటానికి మరియు గందరగోళం/ఆరోపణలు చేయడానికి, ఓడిన వారు సిద్దంగా ఉన్నారు. బీపీ పెరిగి ఏమౌతుందో, అన్న ఆత్రుతతో అందరూ నాయకులు ఉన్నారు.

మరి ఓటు వేసిన, ప్రజలు ఏమి చేస్తున్నారు? ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారు, పెరిగే పన్నులు మరియు చార్జీలు సంతోషంగా చెల్లించటానికి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నారు కదా.

ఓటు వెయ్యని వారు కూడా, ఈ పన్నులు భరించాలి. ధర్నాలు, సమ్మెలు చెయ్యకూడదు మరి తర్వాత, మనం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం ఇది. అలాగే కులానికి, వర్గానికి, అవసరాల బానిసలకు కూడా తప్పదు, పన్ను చార్జీల పోటు.

ఎందుకు పెంచారు ధరలు/పన్నులు అని ప్రశ్నించకూడదు. ఎందుకంటే గెలిచింది మన ప్రియతమ నాయకుడు, గెలిపించింది తెలివైన మనం కాబట్టి.

వారి దగ్గరా సమాధానం ఉంటుంది కదా. 1. ముందు ప్రభుత్వం చేసిన తప్పులు సరి చెయ్యాలి కదా. నిధులు మింగేసారు ప్రగతి లేదు కాబట్టి, పన్నులు భరించాలి మంచి పురోగతి కొరకు, అంటారు కదా. 2. ఒకవేళ పాత ప్రభుత్వం వస్తే, జీతాలు మరియు మరిన్ని అభివ్రుద్ది పనులకు పన్నులు తప్పవు అంటారు.

అన్నిటికీ గంగిరెద్దు లాగా, తందనానా అని తలవూపే, అనుచర గణం మరియు బినామీ గణం ఎటూ ఉంటుంది రెడీ గా.

అనుచరుల గొప్పతనం ఏమిటంటే, తమ పిల్లలకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, తమ ఇంట్లో వాళ్ళకు వైద్యం అందక పోయినా పర్లేదు, తమ తిండి ఖర్చులు పెరిగినా పర్లేదు, తమ పిల్లలకు మంచి చదువు లేకపోయినా పర్లేదు. కానీ, మా నాయక కుటుంబమే 30 యేళ్ళు పరిపాలించాలి, మేము ఇలాగే ఉంటాం అనే త్యాగమూర్తులు నాయకుల అనుచరులు.

ఓటు అమ్ముకున్న వారు, వచ్చే 5 ఏళ్ళు, ఆ డబ్బుతోనే ఈ క్రింది, అన్ని అవసరాలు తీర్చుకుంటారేమో.

1. బియ్యం, కూరలు, పప్పులు దినుసులు లేదా అన్ని వస్తువుల రేట్లు ఆకాశం వైపు. హోటల్ ఇడ్లీ, అట్టు , భోజనం, గది రేట్లు అందుబాటులో ఉండవు. - పర్లేదు లే ఎప్పుడూ ఉండేదే అంటారా? ఓటుకు ఇచ్చిన 10 వేలు చాలదా అంటారా?

2. కరెంట్, బస్సు, రైలు, ఇంటి, సినిమా ,కేబుల్, టీవీ, ఫోన్, వస్త్రాలు ,పెట్రోల్, బండి అధిక ఖర్చులు పన్నులు గెలుపు కు మూల్యం - పర్లేదు లే ఎప్పుడూ ఉండేదే, మాకు ఆ ఖర్చులు ఒక లెక్క కాదు అంటారా?

3. ఉచిత నాణ్యమైన ప్రభుత్వ విద్య ఎల్ కేజీ టు పీజీ , వైద్యం. కోరుకొండ స్కూల్ లాగా, గీతం కాలేజ్ లాగ, నిమ్స్ లాగా, ప్రతి మండల కేంద్రంలో లేవు/రావు - 2070 లో చూద్దాం, మాకు లేనిది మా పిల్లలకు తొందరేంది అంటారా?

ఎంత మంది మన సొంతవాళ్ళు స్నేహితులు బంధువులు చనిపొయారో గుర్తుందా, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమంటే దోవలోనే, గుంటూరో, హైదరాబాద్, చెన్నై చేరే లోపు - పర్లేదు, ఇన్నేళ్ళు ఓర్చుకోలేదా అంటారా?

4. సినిమా హాలు అంత లైబ్రరీ , ఏసీ తో , కంప్యూటర్ ల తో‌, ఉచిత విజ్ఞాన పోటీ పరీక్షల పుస్తకాలతో, వార్తా పేపర్ల తో వార పత్రికలతో, లేవు/రావు మండల కేంద్రంలో, ఒక మోస్తరు పట్టణాలలో లేదా ప్రతి 15 కిలోమీటర్లకు - పర్లేదు, ఓయబ్బో మా ఊళ్ళో పని చాలు అంటారా?

5. నిరంతరం అంటే 24 గంటలూ మంచి నీరు, తక్కువ ధర కరెంట్, 5 ఎకరాల పబ్లిక్ పార్క్ పిల్లల ప్లేగ్రౌండ్ తో , పబ్లిక్ మరుగుదొడ్లు, ప్రతి గ్రామంలో లేదా పట్టణం లో లేవు/రావు? - పర్లేదు, ఇన్నేళ్ళు ఓర్చుకోలేదా అంటారా?

అసలు నీళ్ళు దొరకని, ఫ్లోరైడ్ నీళ్ళతో బాధపడే, రోజూ అరగంట మాత్రమే మంచి నీరు వచ్చే, ఊళ్ళు మీకు తెలుసు - పర్లేదు, మాకు దొరుకుతున్నాయి పక్కవాళ్ళు ఎలాపోతే మాకేమి అంటారా?

6. ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు జవాబు తనం ఎందుకు లేదు ప్రతి ఊరు లో మరియు గ్రామంలో. మామూలు వ్యక్తి ని ఎప్పుడు లెక్క చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగుల, నాయకుల జీత వివరాలు పబ్లిక్ గ్రామ, పట్టణ కార్యాలయాలు మరియు ఇంటర్నెట్ లో లేవు/రావు? - పర్లేదు, మధ్యతరగతి లేదా బీద వాళ్ళ సంగతి మాకెందుకు అంటారా?

మహిళా బిల్లు , లోక్పాల్ ప్రతి రాష్ట్రానికి, వీలైతే జిల్లాకి ఎప్పుడు? లంచం, అవినీతి, రౌడీ ఇజం లేని రాజ్యం - పర్లేదు, మధ్యతరగతి లేదా బీద వాళ్ళ సంగతి మాకెందుకు అంటారా అంటారా?

7. నాయకులు గెలవడానికి ఇచ్చే వరాలకు చేసే అప్పులు ? ప్రభుత్వ ఆస్తులు, గ్రామం, పట్టణం , జిల్లా, రాష్ట్రం, దేశం అమ్మా? ఆదాయం చూపకుండా ఎలా ? - పర్లేదు, మా ఇల్లు బాగుంది, దేశం ఎట్టపోతే మాకెందుకు అంటారా?

మన నాయక మనవడే చెయ్యాలి ఈ పనులు, మన మనవళ్ళే అనుభవించాలి ఆ ఫలాలు.

ఇప్పుడు మనకు వద్దు గాక వద్దు. సీరియల్ టైం అయ్యింది వెళదామా, బిర్యాని తింటూ చూద్దామా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 620 General Articles, 46 Tatvaalu
Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019, Category : Politics
Views : 445 ( + More Social Media views ), Id : 116 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , results
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content