స్థానిక బీజేపీ, జనసేన, తెదేపా లకు జగనన్న పాలన భేషా? పార్టీ నిబద్దత పటిష్టత శూన్యమా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,518; 104 తత్వాలు (Tatvaalu) and views 226,273.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* జనసేన రాష్ట్ర నాయకుల నంబర్లు
* చంద్రన్న లోకేష్ లో చేవ లేదు
* వీరన్నకు నాయకులు ద్రోహం
* రఘురామ రాజును, వైసీపీ
* 3 పార్టీల దారుణ దుస్థితి
* జవాబుకు 1000 బహుమతి
* మూసేస్తున్నాము 3 పార్టీల
* స్థానిక పార్టీ అధ్యక్షుడు సెక్రటరీ ఎవరో
* సమస్యలు అభివ్రుద్ది ధర్నాలు
* ప్రభుత్వాసుపత్రి పనితనం
* కరొనా లాక్డౌన్ జాగ్రత్తలు
* మున్సిపల్ ఎన్నికల్లో, వార్డ్ మెంబర్లు
* ఫేస్బుకు లో పోస్ట్ పెట్టడం రాని
* జిల్లా, చేనేత పార్కు, ఫిషింగ్ హార్బర్
2 min read time.

ఈ 3 పార్టీల, రాష్ట్ర నాయకులు ఏదో ఒకటి చెపుతుంటారు, విమర్శిస్తూ ఉంటారు జగనన్నను లేదా చంద్రన్నను.

కాని స్థానిక పట్టణ మరియు గ్రామ నాయకులు కూడా దానిని, తమ మాటల్లో చెప్పి, స్థానిక ప్రజలకు అర్ధమయ్యే భాష లో రీతి లో చెపుతూ, వారిని వారం వారం కలుస్తూ వివరిస్తూ, స్థానిక అభివ్రుద్ది కోసం చెమటలు కక్కుతూ పాటుపడుతున్నట్లు గా కనీసం నటించాలి, వారికి మనసులో లేకపోయినా.

అలా నటించడము కూడా రాని, స్థానిక డమ్మీ నాయకులను పార్టీ అధ్యక్షులు గా కార్యకర్తలు గా, దిక్కులేక ఏళ్ళు గా బతిమాలి పెట్టుకుని, పార్టీ ని అతి కష్టము మీద మొక్కుబడిగా నెడుతూ ఉంటే, ఇంక ఎమ్మెల్యే సీటు ఎన్నాళ్ళకు గెలుస్తారు, ఓ 50 ఏళ్ళకా? ప్రభుత్వము ఎలా ఏర్పాటు చేస్తారు?

ఇప్పటి వరకు, జనసేన రాష్ట్ర నాయకుల నంబర్లు దొరకలేదు అంటే, వారు మీడియాకు ప్రజలకు ఎంత దగ్గర గా ఉన్నారో, పార్టీ పటిష్టతకు ఎంత క్రుషి చేస్తున్నారో, అర్ధము అవుతుంది అనవచ్చా?

చంద్రన్న లోకేష్ లో చేవ లేదు, ఇక మార్పు రాదు అని అర్ధమా? వీరన్నకు నాయకులు ద్రోహం లో భాగం ఇదా? ఇవి చదివి మీరే చెప్పండి.

మీకు తెలిస్తే తప్పు ఒప్పు వారికి మాకూ చెప్ప గలరు, దీనిని వారికి పంప గలరు.

జగనన్న ఏమి చెపితే, ఆ స్థానిక వైసీపీ నాయకులు అదే జనానికి చెప్పాలి, జగనన్న మాటగా.

అలాగే, వీరన్న, పవనన్న, చంద్రన్న తరపున మాటలు కూడా, స్థానిక పార్టీ నాయకులు అలాగె తమ ఊళ్ళలో చెప్పాలి, బొమ్మలు వీడియోలతో.

స్థానిక ప్రతి పక్ష నాయకులు ఎక్కువ యాక్టివ్ గా ఉండి, అధికార పక్ష నాయకుల మీద విమర్శలు చేస్తూ, ప్రజల నోళ్ళ లో నానాలి కదా?

రఘురామ రాజును, వైసీపీ తెలివితక్కువ తనం తో, దేశ స్థాయి నాయకుని గా, ప్రమోట్ చేసినట్లు, మిమ్మల్ని కూడా చేయాలా? కానీ, రాజు గారు చేసిన ఆరోపణల వలన కదా, ఇంత పేరు వచ్చింది? మరి మీరు, సొంత బుర్ర తెలివి వాడరా?

సొంత పార్టీని బాగుచేసుకోవడం రాని వారు, ఇంక ఊరిని, జిల్లాను, రాష్ట్రాన్ని బాగు చేస్తారా?

గతము లో ఎన్నో సార్లు చెప్పాము, లోపాలు సరిచేసుకోండి అని 2 ఏళ్ళుగా, 3 పార్టీల నాయకులకు, వీరు మారరు. ఈ కింది ప్రశ్నలకు మీరే జవాబు చెప్పండి. link.

అన్నము ఉడికిందా లేదా అని, ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలు కదా. 175 అస్సెంబ్లీ సీట్లలో, ఒక ఊరు చీరాల భాగోతము చూద్దాము, 2 ఏళ్ళుగా ఈ 3 పార్టీల అయోమయం, దారుణ దుస్థితి.

ఈ ఒక్క పట్టణం లో నే, ఇంత నిద్ర మత్తు లో ఉంటే, ఇంక 175 అస్సెంబ్లీ ల లో ఒక్కోటి చెప్పాలా?

TDP BJP Janasena

ఆ పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు, కనీసము ప్రతి ప్రశ్న జవాబుకు 1000 రూపాయల బహుమతి ఇవ్వచ్చును ఎవరైనా, వీటికి, వారి స్థానిక శాఖ ఫేస్బుకు పోస్ట్ సాక్ష్యం చూపిస్తే సుమా.

1. ఇప్పుడు మమ్మల్ని విలేఖరిగా, మేము పరిచయం చేసుకున్నామా? లేక నాయకులు లేదా మా పెద్దలు బంధువులు పరిచయం చేసారా?

ఆ కనీస తెలివి జ్ఞానం నిబద్దత, ఓడిపోయి మరలా గెలవాలి, జనం నెత్తిన ఆడాలి అనుకున్న, గ్రామ, పట్టణ, జిల్లా, నాయకులకు ఉండదా? 2 ఏళ్ళుగా జనం కు తెలియని వారు, స్థానిక ప్రజలకు ఎప్పుడు పరిచయం అవుతారు?

పై లింక్ ల లో, ఒక్క పోస్ట్ చూపించ గలరా, జనము తో, వారం వారం ఈ స్థానిక నాయకులు తిరిగేది?

2. స్థానిక తెదేపా నుంచి వైసీపీ తో నడుస్తున్న ఎమ్మెల్యే కరణం మీద లేదా జగనన్న మీద, స్థానిక నాయకుల విమర్శ ఒకటి అయినా, పై లింక్ ల లో మీరు చూప గలరా?

అంటే, జగనన్న పాలన భేష్ అన్ని ఒప్పుకున్నట్లేగదా?

కరణం బాగా చేస్తుంటే, ఇంక, ఈ 3 పార్టీల స్థానిక నాయకుల అవసరము ఏమిటి? ఎందుకు గెలిపించాలి?

దండగ ఖర్చు అని, మేము చీరాల శాఖ మూసేస్తున్నాము అని ఈ 3 పార్టీల రాష్ట్ర నాయకులు చెప్ప గలరా? మూయకపోయినా 2 ఏళ్ళు గా ఉపయోగం ఉందా?

3. పై 3 లింక్ ల నుంచి, స్థానిక పార్టీ అధ్యక్షుడు సెక్రటరీ ఎవరో, ఫోటో, పేరు, ఊరు, నంబర్ మీరు చెప్ప గలరా?

స్థానిక ప్రజలు సమస్యలకు, ఎవరిని ఎలా సంప్రతించాలి స్థానికముగా, ఎలా తెలుస్తుంది? జిల్లా నాయకులకు పట్టదా ఈ చిన్న విషయం?

జిల్లా నాయకులైనా రోజూ, ప్రతి పట్టణం యొక్క సమస్యలు పోస్ట్ చేస్తున్నారా?

4. 2 ఏళ్ళుగా, ఈ స్థానిక నాయకులు సాధించినది ఏమిటి? సమస్యలు అభివ్రుద్ది గురించి ధర్నాలు ఎక్కడ?

ఎక్కడైనా ఒక్క ఫొటో ఆ లింక్ ల లో చూప గలరా? వ్యక్తిగత లింక్ లు వేరు, పార్టీ పరముగా లింక్ లు వేరు. అంటే, మీ వ్యక్తిగతము గా పోస్ట్ లు పెట్టుకుని, పార్టీని చంపేస్తారా?

5. స్థానిక ప్రభుత్వాసుపత్రి పనితనం సమస్యలు, కోవిడ్ తొ చీరాల జనాల పాట్లు, ప్రవేట్ ఆసుపత్రుల అరాచకాల గురించి ఒక్క పోస్ట్ ఉందా?

వీళ్ళకు ప్రజల బాగోగులు తో పని ఉందా? రేషన్ అందుతుందా లేక ఇతర సమస్యలు చెపుతున్నారా? ఒక్క పోస్ట్ ఉందా?

6. కరొనా లాక్డౌన్ గురించి జాగ్రత్తలు, స్థానిక నాయకుల నుంచి ఉన్నాయా, వీడియోలు ఫోటోలు?

ఇది మన స్వయంక్రుతాపరాధం అసమర్ధత అందామా?

లేక ఇది కూడా జగనన్న కుట్ర కింద తోసేసి, మనము ఇంట్లో నిద్ర పోదామా?

7. మున్సిపల్ ఎన్నికల్లో, ఎందుకు వార్డ్ మెంబర్లు కూడా దొరకలేదు పోటీకి అని ప్రశ్నించారా?

సున్నా లేదా తక్కువ ఫలితాలకు, ఎవరిని బాధ్యులు గా చేసారు, పార్టీని భూస్థాపితం చేసినందుకు? లేక శభాష్ అని పూల దండ వేశారా, పూర్తి గా కప్పి పెట్టమని?

పార్టీ అధ్యక్షుడుని నాయకులను మార్చారా? యువ నాయకత్వం కు బాధ్యత ఇచ్చారా?

వేరే దిక్కులేదు, దొరికిన లేదా ఉన్న నిద్రపోతు నాయకులతోనే, వచ్చే 3 ఏళ్ళు మమ అని నెట్టెస్తారా?

8. ఫేస్బుకు లో పోస్ట్ పెట్టడం రాని, అధ్యక్షులు సెక్రటరీ కార్యకర్తల తో, ప్రజల సంక్షేమము చూడగలరా?

ఈ అస్సెంబ్లీ స్థానాన్ని వచ్చే 50 ఏళ్ళ లో గెలవగలరా? ఇలాగే, మిగతా అస్సెంబ్లీలు అంతేనా?

9. చీరాల జిల్లా, చేనేత పార్కు, ఫిషింగ్ హార్బర్ లాంటి పెద్ద పనులు తీసుకు రావాలి అని, తమ నాయకులను అలాగే ప్రభుత్వాన్ని అడిగే, పోస్ట్ ఒక్కటి చూపగలరా?

ఇదేనా, 40 ఏళ్ళ చంద్రన్న అనుభవం, లోకెష్ యువ నాయకత్వం పనితనమా? మాకు నాయకులను తయారు చేయడం వచ్చు అంటే, సాక్ష్యం ఇదేగా?

ఇవేనా, వీరన్న మరియు పవనన్న తెలివి తేటలు ఇవేనా, పార్టీ పటిష్టతకు?

తమ పార్టీల స్థానిక నాయకులను నిద్ర లేపలేని వారు, ప్రజలకు మంచి ఎలా చేస్తారు?

అంటే, వారు ఒప్పుకున్నట్లే గదా, జగనన్న పాలన బాగుంది అని?

మరి జగనన్న కు తిరుగు లేదని, ఆయన పై జరిగే వన్నీ కుట్రలు అని జనాలకు, ఈ 3 పార్టీల స్థానిక నాయకులు చెపుతున్నారా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,518; 104 తత్వాలు (Tatvaalu) and views 226,273
Dt : 07-Jun-2021, Upd Dt : 07-Jun-2021, Category : Politics
Views : 890 ( + More Social Media views ), Id : 1196 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bjp , janasena , tdp , happy , jagan , rule , party , commitment , strengthening , null , chirala , chandranna , pawan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content