గౌరవ అన్ని జిల్లాల పట్టణ గ్రామ బీజేపీ, జనసేన, టీడీపీ అధ్యక్షులకు నమస్కారములు - 9 సూత్రాలు - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1200 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1230 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

దయచేసి ఈ సందేశాన్ని, మీ పట్టణ, జిల్లా, రాష్ట్ర, అభివ్రుద్ది కోరే మంచి మనసులు, ఆయా పార్టీల, స్థానిక పట్టణ, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు పంప గలరు. మీరు చెప్పలేని మాటలు మమ్మల్ని అయినా చెప్పనీయండి. సమస్యలు మరియు పరిష్కారము, ఎక్కడైనా ఏ ఊరు అయినా ఒక్కటే. జనము మిమ్మల్ని పట్టించు కోరు. మరి మోదీ గారి లేదా మీ పార్టీ నాయకుని, కలలు ఆశయాలు ఆంధ్రాకు అందేదెప్పుడు? ఉదాహరణకు చీరాల నాయకులను తీసుకుందాము.

ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన, ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం రిజర్వేషన్ల అమలుకు, చర్యలు తీసుకోవాలని కోరుతూ, స్థానిక చీరాల బీజేపీ మరియు జనసేన నాయకులు, అక్టోబర్ 21 బుధవారం నాడు, తాసిల్దారు గారికి వినతిపత్రం సమర్పించారు, ఫోటో 2 చూడండి. మరి రాష్ట్రస్థాయిలో అన్ని పార్టీలు ఎందుకు ఇవి అడగవో తెలీదు.

చాలా సంతోషము ఆనందము గా ఉంది, ప్రజలకు మన ఉనికి తెలియాలి. లేకపోతే, ఎలక్షన్ లో ప్రజలు గుర్తు పట్టరు. 2014 2019 ల లో, బీజేపీకి జనసేనకు ఒక్క సీటు కూడా రావడము లేదు? 10 ఏళ్ళు గా, చీరాల టీడీపీ కి బయట నుంచి మాత్రమే, అభ్యర్ధులను తెస్తుంది, ఎందుకు? అని సంవత్సరము గా ఆలోచన చేసారా? పరిష్కారము దొరికిందా? జనము మనల్ని ఎందుకు నమ్మడము లేదు, ఆదరించడము లేదు?

ఎందుకంటే, మనకు స్థానికము గా, జనము కు తెలుస్తూ కనపడుతూ తిరిగే, స్థానిక సమస్యలు గట్టిగా మాట్లాడే అడిగే, నాయకుడు ఒక్కరూ లేరు. కొత్త వాళ్ళను తయారు చేయము, చేతకాదు. నాయకులు ఉన్నా, వారి గురించి ప్రజలకు ప్రచారం లేదు. మీరు ఇచ్చిన అర్జీ గురించి, మీ స్థానిక ఫేస్బుక్ లో, కనీసము మాటలు ఫోటో కూడా లేదు. మా చీరాల లేదా ఇతర పట్టణం వారు ఇలా చేసారు అని, మీ పార్టీ జిల్లా మరియు రాష్ట్ర వెబ్సైట్ లో లేదు.

మేము అన్ని పార్టీల రాష్ట్ర నాయకత్వ నంబర్లు తెలుసుకున్నాము కానే, స్థానికము గా ఉన్న మీ నంబర్లు తెలుసుకోలేక పోయాము అంటే, ఎవరము సిగ్గు పడాలి? మేమా, మీరా? మీరు ఇక సామాన్య ప్రజలకు, ఎంత దగ్గరగా ఉన్నారో అర్ధము అవుతుందా?

అంటే, కేవలం స్థానిక పేపర్లో వేస్తే, కరోనా దెబ్బకి పేపరు ఎవరూ చూడకపోతే, ఇంక మీరు చేసిన పనికి గుర్తింపు ఏముంది? అందుకే మీ ఫేస్బుక్ లో సమాచారము పెట్టి, కనీసం మీ నాయకులు 4 గురు లైక్ కొట్టినా చాలు కదా, మీ జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వము తో పాటుగా.

మీ పార్టీ స్థానిక సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో

1. ఎక్కడ అయినా, మీ స్థానిక నాయకుల ఫోటోలు, కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయా, వారు చేసిన గొప్ప పనులు ఉన్నాయా? పట్టణ, వార్డు, డివిజన్, గ్రామ, సభ్యులు, సెక్రటరీలు అందరి ఫోటోలు నంబర్లు వివరాలు పనులు సేవలు ధర్నాలు అభివ్రుద్ది గురించి మాటలు ఫేస్బుక్ లో ఉండాలి, ఆ టీం అంతా షేర్ చెయ్యాలి వాటిని స్నేహితులతో.

2. మీరు కోవిడ్ 19 సమయములో గత మార్చ్ నుంచి, ప్రభుత్వ ఆసుపత్రి మరియు సంజీవిని బస్సు లోపాలు, స్థానికముగా చేసిన సేవలు, ధర్నాలు, సహాయము ఫోటోలు వీడియోలు ఏవైనా ఉన్నాయా?

3. స్థానిక చీరాల బీజేపీ మాత్రము, పై ఇతర నాయకుల పోస్ట్ లు షేర్ చేస్తుందే గాని, స్థానిక ఊరి సమస్యలు గురించి ఒక్కటి అయినా ఉన్నాయా?

4. మేము అడిగే 10 స్థానిక అభివ్రుద్ది పనులు విన్నారా? అలాంటివి మీ ఊర్లో మీకు తగ్గ అభివ్రుద్ది వద్దా? కింద సంతకము తర్వాత ఉన్నాయి దయచేసి చూడండి, మీ ఫేస్బుక్ లో కొన్ని అయినా పెట్టండి. అవి మీకు తీరిక దొరక్క వద్దా లేక ప్రజలకు వద్దా?

పోనీ వాటిలో, మీకు నచ్చిన ఓ 4 అభివ్రుద్ది పనులు అయినా, ఇప్పుడు ఎందుకు లేవు అని, ఎప్పుడూ అడగరా, నిలదీయరా? ధర్నాలు చేయరా? ప్రజలకు చైతన్యము కలిగించారా?

5. ఎవరికీ అంత ఓపిక లేకపోతే, ధైర్యముగా రాష్ట్ర నాయకులు, కొన్ని పట్టణాలలో మాకు కార్యకర్తలు లేరు అని ప్రకటించమనండి, కేవలము 5 పట్టణాలలోనే పార్టీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పండి.

6. కనీసము ఇలా ఫేస్బుక్ వాడుతూ, ఇలా జనము లో తిరగండి, అందుబాటులో ఉండండి అని, మీ జిల్లా రాష్ట్ర నాయకత్వాలు, ట్రైనింగ్ ఇవ్వవా? పట్టించుకోవా? చెప్పవా?

7. రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో, పై వారు పదవులు పంచుకుని, పండుగలు చేస్తునే ఉన్నారు, 10 ఏళ్ళుగా, కేంద్ర నాయకత్వాన్ని మోసము చేస్తూ అబద్దాలు చెపుతూ. పట్టణాలలో, ఒక్కరు అయినా సరిగ్గా మోదీ ఆలోచనలు అమలు చేసే వారు లేరు.

8. 2024 నిద్రమత్తు నుంచి బయటకు వచ్చి, ఎన్నికలలో మీ పార్టీ 175 స్థానాలలో ఏ ముఖం పెట్టుకుని పోటీచేస్తుంది? ఎలా గెలుస్తుంది, 4 ఏళ్ళు కనపడని వారితో?

9. ఊరి సంగతి దేవుడు ఎరుగు, మీరు చాటుగా ఎవరికీ తెలీకుండా ఉంటే, ఎప్పుడు జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అవుతారు? మీకైనా ఎదుగుదల ఉండాలి కదా?

ఇప్పుడు అయినా గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కళ్ళు తెరవండి, ప్రజలకు అండగా ఉండండి.

ఆంధ్రరత్న దుగ్గిరాల స్వాతంత్ర్య పన్ను నిరాకరణ ఉద్యమ క్షీరపురి, వస్త్ర సామ్రాజ్య చినబొంబాయి, చీరాల చుట్టు మండలాల ప్రజలు ఆశగా 1980 నుంచి, ఇవి తెచ్చే చేవ, కృతజ్ఞతలు, ఆత్మాభిమానం, ఉన్న ఉత్తముడు కోసం, ఎదురు చూస్తూనే ఉన్నారు. మీ ఊరి కోసము కూడా ఇవి దయచేసి. - 1. చీరాల జిల్లా, 2. చీరాల పార్లమెంటు స్ధానం , 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, 4. నేతన్నల చేనేత పార్కు, 5. స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్,7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1230 General Articles, 47 Tatvaalu
Dt : 21-Oct-2020, Upd Dt : 21-Oct-2020, Category : Request
Views : 333 ( + More Social Media views ), Id : 768 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : greetings , honble , state , urban , village , bjp , janasena , tdp , presidents , andhra , districts , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content