పిల్లల కు దోవ చూపాల్సిన మనమే, మోహం మాయ లో ఉంటే, పిల్లల్ని కాపాడేది ఎవరు? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 989 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కొంతమంది కి నా మాటలు కటువుగా బాధగా ఇబ్బందిగా అహంకారముగా ఉంటాయి, మోహం లో అపార్ధం చేసుకుంటారు. కోపముతో అలిగి దూరం అవుతారు, మరలా దెబ్బ తిన్నాక, వెనక్కి వస్తారు.

అర్థం చేసుకున్న వారు, ఎన్ని తిట్టినా వదలి పోరు. ఎదురు చెప్పరు, చెప్పినవి పాటించకపోయినా, గమ్ముగా దగ్గర లోనే ఉంటారు. వారికి తెలుసు అవి నూరు శాతము వాస్తవం అని, వారి బలహీనతా వారికి తెలుసు కాబట్టి.

మంచి ఎప్పుడూ చేదుగా కషాయంగా ఉండి నచ్చదు, గభాల్న ఎదగలేము లేదా ఎప్పుడూ కిందే ఉంటాము, కానీ మనశ్శాంతి ఇస్తుంది, దైవముకు దగ్గర చేస్తుంది. నిజం నిదానంగా, నిలకడ మీద తెలుస్తోంది.

అమ్మ బడి కెళ్ళు అంటే, నాన్న చెడు సావాసాలు సినిమా లు వద్దు అంటే, వారి పిల్లల కు చేదుగానే కష్టం గానే ఇబ్బంది గా ఉంటాయి. ఎందుకంటే భవిష్యత్తు లో అవి అవసరం అని వారికి అప్పుడు తెలీదు, ముందు చూపు ఉండదు. అమ్మా నాన్న ల నే, విసుక్కుని కోపం తెచ్చుకుని, అలుగుతారు. కాని పెద్దల మాట విన్నవారు బాగుపడతారు. వినని వారు? చెడిపోతారు. అలాంటి వారు, నాలాంటి వారి మాట మాత్రము వింటారా? వినరు. ఒక ఉదాహరణ చూడండి.

ఒకాయన 2015 లో, వాళ్ళ వాళ్ళ పిల్లల పెళ్లి గురించి, సలహ అడిగారు. ఆయన పెళ్ళి పెద్ద కూడా, మొత్తము ఆయనకు తెలుసు. అన్ని వివరాలు దాచకుండా చెప్పమన్నా. కొన్ని దాచి 50 శాతం విషయము చెప్పారు. మన గుచ్చి గుచ్చి ప్రశ్నలు తో, మిగతా 50 శాతం, బయటకు లాగాను. మొత్తం కధ అర్థం అయింది, భవిష్యత్తు కళ్ళ ముందు సినిమా లాగ కనపడుతుంది.

ఇది కేవలం మోహం లో, ధనం కోసం జరిగే పెళ్లి మాత్రమే అని. గుణం పిల్లల సౌఖ్యం భవిష్యత్తు ఆనందం, ఇరువైపులా ఇద్దరు కూ అవసరం లేదు అని. కొన్ని ప్రశ్నలు కు, ఆయన జవాబు చెప్పలేక పోయారు, అంటే తప్పు ఒప్పుకోలేక పోయారు. మొఖం ఎర్రబడింది కోపంతో ఊగిపోయి, ఎప్పుడూ ఇలాగే కాలికీ వేలికీ వేలికి కాలికీ వేస్తారు, వంద అనుమానాలు, అని నొచ్చుకున్నారు.

ఇది పిల్లల భవిష్యత్తు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు అన్నా. పిల్లలు ఇద్దరూ నాకు తెలీదు, మనకు వచ్చిన లాభం ఏముంది, అబద్ధం చెపితే. తెలిసీ నీతి చెప్పకుండా గమ్ముగా ఉంటే, భీష్ముని గతే పడుతుంది. కేవలం మంచి మాత్రమే, ఇక్కడ ఆలోచన చెయ్యాలి అన్నాను, వినరని గౌరవించరు అని తెలిసినా. మన ధర్మము మనము చెప్పాలి.

తర్వాత 5 ఏళ్ళు మాటలు లేవు, ఇంక ఫొన్ లేదు ఆయన దగ్గర నుంచి. మొన్న ఫోన్ చేశారు, నాకు శని దిగిన తర్వాత, బహుశా వారికి మొదలు అయ్యింది ఏమో. ఆ రోజు మీరు అడిగిన ప్రశ్నలు, నేను అవతల వారిని అడిగి, పెళ్ళి ఆగిపోయినట్లు అయితే, ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు మాకు అని బాధపడ్డారు. మనశ్శాంతి లేదు. అంతా గందరగోళం గొడవలు, లాయర్లు చుట్టూ తిరుగుతూ ఉన్నాము అన్నారు.

జాగ్రత్తలు మరి, విషయము మంచి కాదు అన్నా ముందుకు వెళితే , ఏదో ఒక రోజు ఫలితం అనుభవించాలి. కష్టం ఉంటే చెప్పు , మార్గం ఉంటే చెపుతాను అన్నా. లాయర్లు చేతుల్లో కి పోయాక , మనమేం చేయగలము.

అందుకే మన తల్లి దండ్రులు, మన మంచి కోరేవారి మాట కష్టం గా ఉన్నా, దాటకూడదు. ఈ రోజు నష్టం 5 లక్షలు/ కోట్లు కావచ్చు, అందగత్తె అనుష్క అందగాడు పవన్ సంబంధము తప్పి పోవచ్చు.

కానీ రేపటి నష్టం 50 లక్షలు/ కోట్లు కావచ్చు, వారు దూరము కావచ్చు, కోర్టు కు పోవచ్చు. పిల్లల కు దోవ చూపాల్సింది మనమే అంటే పెద్దలమే, మోహం మాయ లో ఉంటే, పిల్లల్ని కాపాడేది ఎవరు? హర హరా అని రాము, గోపీ తో చెప్పాడు నీతి బోధ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1017 General Articles, 46 Tatvaalu
Dt : 26-Jan-2020, Upd Dt : 26-Jan-2020, Category : General
Views : 352 ( + More Social Media views ), Id : 292 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : parents , elders , illusion , listen to parents
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content