మాకు పట్టణ ఇంఛార్జి పదవి చాలు, పిచ్చి జనం హార్బర్ చేనేత పార్కు అభివృద్ధి తర్వాత - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,848; 104 తత్వాలు (Tatvaalu) and views 226,206.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* ఆమంచి, కరణం, నోటి నుంచి వచ్చాయా?
* జగనన్న వచ్చి, వీరిద్దరి చేతులు పట్టుకుని
* వేరే జిల్లా మేక ను తెచ్చి నిలబెట్టిన
* 10 సాధించడానికే, వైసీపీ కండువా, బాలినేని
* ఆమంచి భవిష్యత్తు లో, ప్రజల నమ్మకం
* మొద్దు నిద్ర బిజెపి, జనసేన, తెదేపా
* ఎమ్మెల్యే ఊళ్ళో ఉండరు, ఏమి సాధించారు?
1 min read time.

గత సంవత్సరం గా, మనము అనుకుంటున్న ఈ 10 చీరాల (చివరలో కింద చూడండి) అభివృద్ధి కార్యక్రమాలు, ఆమంచి అన్న, కరణం బాబాయి, నోటి నుంచి వచ్చాయా? వస్తాయా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీరు చూస్తే లేదా వింటే పేపర్ కటింగ్, దయచేసి పంపగలరు. Old article link.

నేటి పరిస్థితి ఎలా ఉంది అంటే, జగనన్న చీరాల వచ్చి, వీరిద్దరి చేతులు పట్టుకుని బాబూ బాబూ ప్లీజ్, చీరాల అభివృద్ధి కి ఏమైనా చేయగలను ఏమైనా ఉంటే మీరు చెప్పండి అంటే కూడా, మాకు లేదా మా అబ్బాయి కి పట్టణ ఇంఛార్జి పదవి చాలు అన్నా, పిచ్చి జనం సంగతి తర్వాత చూసుకుందాము, వేరే జిల్లా మేక ను తెచ్చి నిలబెట్టిన కూడా, కళ్ళు మూసుకుని ఓట్లు వేస్తారు, అంటారు లాగా ఉంది.

ఇప్పుడు ఆ అభివ్రుద్ది బాధ్యత ఎక్కువగా, నియోజకవర్గానికి దూరంగా ఒంగోలులో ఉండే, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం గారి మీద ఉంది. ఈ 10 సాధించడానికే, నేను వైసీపీ కండువా కప్పాను కుమారుడితో, ప్రజలను వంచించి, తెదేపా చంద్రన్న కు ద్రోహం చేసి, అని సమర్ధన కు ఉపయోగపడుతుంది. పార్టీలోకి తెచ్చిన బాలినేని గారి మీద కూడా, ఈ బాధ్యత ఉంది. లేదంటే ఇద్దరూ కలసి, జగనన్న పరువు తీస్తున్నట్లే గదా.

ఆమంచి అన్న భవిష్యత్తు లో, ప్రజల నమ్మకం పొందాలని ఉంటే మరలా గెలవాలి అంటే, ఈ 10 పనులు కోసం ధర్నాలు చేసిన, కొన్ని అయినా వస్తాయి. నోరు ఎత్తకుండా గమ్ముగా లోన కూర్చుంటే, అందుబాటులో ఉండి కూడా, ఉపయోగము లేదు. విజయసాయి గారి, సలహా అండ ఉండాలి.

లేదా మొద్దు నిద్ర మత్తు వదిలి వీరన్న బిజెపి, పవనన్న జనసేన, చంద్రన్న తెదేపా నుంచి, కొత్త నాయకులు ఈ 10 నినాదాలతో వెలుగులో కి రావాలి. ప్రతిపక్షాలు కి ఉన్న నిబద్ధత, స్ధానిక సమస్యలు పై ప్రజలకు తెలుస్తోంది.

ఎమ్మెల్యే ఊళ్ళో ఉండరు, ఇంతవరకు ఏమి సాధించారు, అని అడగలేని, స్థానిక ప్రతిపక్షాలు మనకు దొరకడం సిగ్గు చేటు కాదా? ప్రజలు గా మనం, జనానికి జరుగుతున్న అన్యాయం ను పదిమంది కి చెప్పలేమా, పంచుకోలేమా?


ఈ క్రింది అభివృద్ధి పధకాలు తెచ్చే, చేవ కృతజ్ఞతలు ఉన్న ఉత్తముడు, ఎప్పుడు దొరుకుతాడో?

అలాంటి ఉత్తములను, ఎన్నుకునే బుద్ది ఉన్న ప్రజలు, ఎప్పుడు పుడతారో, ఓట్లు వేస్తారో దేవుడా?

చీరాల తో బంధం ఉన్న ప్రజలకు, ఇవి పంపగలరు, ఉత్తములు కన్నభూమి అభివృద్ధి కోరేవారు ఎవరైనా ఉంటే.

చీరాల బంధం, చుట్టుపక్కల మండలాలు, అంటే ప్రతి సారి చెప్పక్కరలేదు కదా.

హైదరాబాద్ అంటే కూకట్పల్లి, బాలా నగర్ కూడా వస్తుంది.

అలాగే చీరాల బంధం, చుట్టుపక్కల మండలాలు అంటే, బాపట్ల, కారంచేడు, యెద్దనపూడి, మార్టూరు, జనకవరం పంగులూరు, పర్చూరు, వేటపాలెం, అద్దంకి, ఇంకా కొన్ని మండలాలు.

వీరందరికీ సినిమా, సముద్ర, ఉద్యోగ, రైలు, బస్సు, షికారు, పెళ్లి, స్ధలాల, బట్టల, విద్య, వైద్యం, వ్యాపారం లాంటి, ఏదో ఒక బంధం సంబంధం ఉంటుంది, సుమా.

వీరు అందరి తరపున, అందరి కోసం, కనపడిన వారు అందరి ని, ప్రార్ధిస్తున్నాము. రాష్ట్రం లో ఉన్న ఒక్క ఉత్తముడైనా, బాధ, గోడు విని సహాయం చేయరా అని ఓ ఆశ, ఈ కింది పధకాలు కు. మా ఉత్తమ జనానికి, నాయకులు కు పంపుతారు కదూ.


ఆంధ్రరత్న దుగ్గిరాల స్వాతంత్ర్య పన్ను నిరాకరణ ఉద్యమ క్షీరపురి, వస్త్ర సామ్రాజ్య చినబొంబాయి, చీరాల చుట్టు మండలాల ప్రజలు ఆశగా 1980 నుంచి, ఇవి తెచ్చే చేవ, కృతజ్ఞతలు, ఆత్మాభిమానం, ఉన్న ఉత్తముడు కోసం, ఎదురు చూస్తూనే ఉన్నారు - 1. చీరాల జిల్లా, 2. చీరాల పార్లమెంటు స్ధానం , 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, 4. నేతన్నల చేనేత పార్కు, 5. స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్,7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,848; 104 తత్వాలు (Tatvaalu) and views 226,206
Dt : 04-Oct-2020, Upd Dt : 04-Oct-2020, Category : Politics
Views : 812 ( + More Social Media views ), Id : 733 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , ysrcp , in charge , post , karanam , amanchi , people , town , development , fishing harbor , handloom park
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content