తమ ఉనికిని కాపాడుకునే ఆమంచి కరణం, చీరాల ప్రతిష్ఠ కాపాడగలరా? వీరు గాక ఇంకెవరు మంచి చేస్తారు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,845; 104 తత్వాలు (Tatvaalu) and views 243,929.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీ ఊళ్ళో, జిల్లా లో ఇవే సమస్యలు ఉంటాయి. పార్టీ పెద్దలు దృష్టికి తీసుకుపోండి , ఒక మంచి మనసు గల మనిషి అయినా ఉంటారు. మంచి చేస్తారు.

మేము రాసేవాటిలో తప్పులు చెప్పిన, సరిచేసుకుంటాము. ఉదాహరణకు, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, ఎప్పుడో వచ్చేసాయి లాగ.

తమ ఉనికిని కాపాడుకునే పోరాటము చేసే ఆమంచి కరణం, చీరాల ఉనికిని గౌరవం ఆత్మాభిమానం ప్రతిష్ఠ చిత్తశుద్ధి తో కాపాడగలరా? మరి ఇంకెవరు చీరాలకు మంచి చేస్తారు? ఎందుకు చేస్తారు?

ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూ తెలుసు, ప్రతిష్ఠ కాపాడలేరు, వీరిద్దరూ కూ అసాధ్యం. ఎందుకంటే ముందు తమ పరిస్థితే అయోమయంలో ఉంది. ఎవరిది ఆధిక్యతో తేల్చుకోవడానికి, సంవత్సరం దాటిపోయింది. కాబట్టి ప్రజలే కళ్ళు తెరిచి, తమ అభివృద్ధి గురించి, తామే అడగాలి, గట్టిగా ప్రయత్నం చేయాలి. లేదా అధిష్టానము చేయాలి, తమ పరువు నిలపడము కోసము.

గత సంవత్సరం గా, ఇద్దరు లో ఎవరు కూడా, చీరాల జిల్లా, చీరాల పార్లమెంటు, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, జీడి పరిశ్రమ అభివృద్ధి, పేరొందిన బీచ్, పరిశ్రమ, దేని గురించి అయినా అందోళన, ధర్నా లు, కాళ్ళు అరిగేలా, గొంతు వినపడేలా ఉపన్యాసాలు ఉన్నాయా? ఉంటే పేపర్ కటింగ్, లింకు పంపగలరు. ఊరక వెళ్లి, విన్నపము ఇచ్చారు, అందరము చూసాము. ఇప్పుడు మేము కూడా ఇచ్చాము కదా విన్నపము, రెండు ఒకటేగా? నాయకులు గా, గట్టి ప్రయత్నం ఏది వారిది?

ముందు గా బాధ్యత, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం గారిది. ఆయన అసలు ఊళ్ళో నే ఉండరు, చీరాల కే వచ్చి పోయే అతిధి, ఒంగోలు లో నివాసం.

చంద్రబాబు గారు, పెద్ద వి పై వాటిలో ఏమీ చేయకపోగా చీరాలకు, కనీసం ఊళ్ళో ఉండని, వ్యక్తి ని ప్రజల నెత్తిన పెట్టారు, బలవంతంగా తన రాజకీయ క్రీడలో, ఆమంచి ని ఎలాగైనా అణగదొక్కాలి అని. ఈ స్ధానం గెలిచినా, తన కుట్రలో తానే నష్టపోయారు రాష్ట్రంలో బాబు గారు. చంద్రబాబు గారు, హార్బర్ కి ఇచ్చిన 400 కోట్లు ఉత్తుత్తి ప్రకటనా లేక పసుపు కుంకుమ కింద వాడేసారా లేదా ఏమైందో చెప్పాలి. మీకు గతంలో లింక్ పంపాను, పేపరు కటింగ్.

కరణం గారి ప్రధాన కర్తవ్యం అన్ని విషయాలు కన్నా కూడా, ఆమంచి తలనొప్పి ని వదిలించుకోవటం, ఆయన పరపతిని తగ్గించడం, తన కుమారుడు వెంకటేష్ కు చీరాల ఇంఛార్జి పదవి ఇప్పించుకుని, రాజకీయ వారసుడు గా నిలబెట్టి, చీరాల పై పూర్తిగా, తన అధికారం పట్టు హస్తగతం చేసుకోవడం. ఆమంచి కి ఏ అధికార విషయంలో, ఏ పాత్ర ఉండకూడదు. మరి ఇక తీరిక ఉంటుందా, చీరాలకు జిల్లా హార్బర్ చేనేత పార్కు తేవడానికి? అభివృద్ధి కి? ప్చ్, ఉండదు. అద్దంకి లో కూడా, ఇలాగే దెబ్బ తిన్నారు.

ఆమంచి గారు, మాజీ ఎమ్మెల్యే, ఒకనాడు సొంతంగా పార్టీ పెట్టి గెలిచిన వ్యక్తి, జగనన్న ప్రభంజన ప్రభావం లో కూడా, నేడు ఓడిపోవడం ఓ విచిత్రం. తన పయనం, తాను నేల మీద నడుస్తూ, ఆత్మ విమర్శ చేసుకోవడానికి, తగిన సమయం దొరికింది. ఇన్నాళ్లు తను పైన చెప్పిన, అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆవేశం తగ్గించుకుని, ఆలోచన పెంచుకుని, అందరినీ కలుపుకుని పోవడం, నేర్చుకోవాలి. అయితే, మొదటి నుంచి కూడా, తన వారికి కష్టం వస్తే స్ధానికంగా అందుబాటులో ఉంటూ, వెంటనే సోదరులు ప్రత్యక్షం అవుతారు. అదే వారి విజయ రహస్యం. చంద్రబాబు గారిని లేదా ఎవరినైనా, అలా ఇష్టం వచ్చినట్లు విమర్శించకూడదు.

ఇప్పుడు, తన ప్రధాన కర్తవ్యం, కరణం ఎమ్మెల్యే అధికార బలాన్ని ఎదుర్కొంటూ, తన స్ధానం ను మరియు పట్టణ ఇంఛార్జి పదవి పదిలం చేసుకుంటూ, తర్వాత ఎలక్షన్ కు రెడీ అవడం. దీనికే, సమయం చాలడం లేదు.

ఇద్దరు కూ ఉన్న ఇంకో ప్రధాన సమస్య, తమపై ఉన్న కేసులు. గట్టిగా, నోరు ఎత్త నీయవు.

ఈ పోరాటం కు, ఓ ముగింపు లేకుండా, సాగుతూనే ఉంది తెలుగు సీరియల్ లా గా, ఎత్తుల పై ఎత్తులతో. ఇక అభివృద్ధి గురించి, పోరాడతారా? ఆరాటపడతారా?

మరి ఇప్పుడు, జగనన్న వారిని పిలిచి అభివృద్ధి కావాలా లేక అధికారం ఇంఛార్జి పదవి కావాలా అంటే? ఇద్దరూ జవాబు ఒకటే కదా, ఇంఛార్జి పదవే కదా, తమ సొంత పట్టు మరియు అభివృద్ధి కి.

మరి చీరాల జిల్లా, పార్లమెంటు స్ధానం, చేనేత పార్కు, స్మార్ట్ సిటీ, జీడి పరిశ్రమ, మంచి బీచ్, ఇతర పరిశ్రమ లు తెచ్చే మొనగాడు ఎవరు?

ఇవి సాధ్యం చేసే వారు, వీరి తరపున, విజయసాయిరెడ్డి, బాలినేని గార్లు, ఇతర పెద్దలు, ఈ ప్రాంతము లో పార్టీకు జరుగున్న నష్టాన్ని వివరించి, ఈ ప్రాంతము పై పట్టు నిలబెట్టుకోవాలి అంటే, వీరే సహాయము చెయ్యాలి జగన్ కు వివరించి.

ఎందుకంటే, ఇది తెదేపా ఇన్నేళ్ళ పాలన పై జగనన్న గెలుపు కాబట్టి. మనదే ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చాటుతారు కాబట్టి, జగన్ ను ఈ ప్రాంత దేవుని గా నిలబెట్టడానికి ఉపయోగం కాబట్టి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,845; 104 తత్వాలు (Tatvaalu) and views 243,929
Dt : 12-Aug-2020, Upd Dt : 12-Aug-2020, Category : Politics
Views : 1069 ( + More Social Media views ), Id : 645 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amanchi , karanam , fights , existence , protect , prestige , chirala , vijaysaireddy , balineni , jagan , chandrababu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content