Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఉచితముగా సేవ చేస్తున్న వారి దగ్గర నే ఎదురు ధనం తీసుకుంటారు భోజనము నకు మరియు ఉండటానికి అంటే? మరి మనం దానం ఇచ్చి, మరలా 6 రోజులు ఉండి సౌకర్యాలా, నీతి ఉందా? నిజమా?*
From those who serve for free, they take money in return for food and lodging? If we give charity and convenient stay for 6 days again, is it ethical?
మనము 9 ఏళ్ళు గా అమ్మతో కలసి ఎన్ని గుడులకు వెళ్ళి నా, మన సాధన, మన పని చూసుకొని రావడమే కానీ, వారి కార్యకలాపాలలో ఏరోజూ వేలు పెట్టలేదు. ఎందుకంటే వారి ఉద్దెశ్యాలు వేరు, మన ఆశయాలు వేరు. చిత్తశుద్ది ముందు పెంచుకోవాలి, అర్హత సాధించాలి అది మాత్రమే మన ధ్యేయం. దానికి దైవం ప్రేరణ ఇస్తుంది, గుడిలో కానీ, మనలో కానీ, బడిలో కానీ, ప్రక్రుతి లో గానీ. మధ్య వారితో పని ఏముంది?
ప్రతి గుడి/ మఠము/ ఆశ్రమం కు, ఒక ధర్మ కర్త లేదా సమూహము ఉంటారు. అతని/వారి కి ఎంత నీతి ఉంది, ఎన్నాళ్ళు ఉంటారు 1 ఏడు 2 ఏళ్ళు అలాగా, ఎంత సజీవ గురువు సేవ ఉంది, ఎంత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ ఉన్నది, అని మనము చూసామా? నిరూపణ ఉందా?
వారి పిల్లలు సంస్కార వంతులేనా? తండ్రి ధర్మ కార్యాలతో నటిస్తుంటే, పిల్లలు పబ్ ల వెంట, దందాల వెంట, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో తిరుగుతున్నారా? అది నిరుపణ లేకుండా, ఎలా స్థలాలు ధనాలు ఇస్తున్నాము?
మనము ఇచ్చిన వాటితో, కొంత ఉపయోగించి, ఇతరులకు భోజనాలు సౌకర్యాలు చేయవచ్చు. కానీ మొత్తముతో చేస్తున్నారో, పాక్షిక ధనముతో చేస్తున్నారో మనకు తెలీదు కదా? తెలీకుండా, ఎలా ఇచ్చాము?
ఇప్పుడు నీతి నియమాలు లేని, బాబాయి మందిరాలలో దోపిడీ అదే కదా, జనం మానసిక బలహీనత తో?
తిరుపతి లో వేసిన ధనమే, బంగారమే ఏమైందో అని, నాటి మరియు నేటి పాలక ప్రతి పక్షాలు తిట్టుకోవడం లేదా?
మనం ఇచ్చిన స్తలాలు, ఎవరికి వేలం లో గాలం లో వెళ్ళాయో, మనకు తెలుసా? గతములో ధర్మ కర్తలు చేసే, అరాచకాలను ఆపడానికి ప్రభుత్వం, దేవాదాయ శాఖను తెచ్చింది. ఇప్పుడు వీరు అదే పని చేస్తున్నారు, వారికి సహకరిస్తూ. తప్పు ఎవరిది? నాయకులది కాదు, అధికారులది కాదు, ధర్మ కర్తలది కాదు.
ఆ పాపం మొత్తము, బాధ్యత సంస్కారం లేని అమ్ముడుబోయే ఓటరుది, అంటే మనది. ఎందుకంటే, మన కుసంస్కార బుద్దికి సరిపోయే, మేక పులి పాముకు, ఓటు వేస్తే, అవి మంచి చేస్తాయా? ఇప్పుడు మరలా ధర్మ కర్తల చేతిలో పెడితే, మరలా పాత అరాచకము.
ఇతర మతాలలో అదే జరుగుతుంది కదా ఇప్పుడు. అసలు ఇతర మతాలకు, ఈ కొలతలు అంటే సజీవ గురువు సేవ, గురు పరంపర, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ, తెలుసా? వారి దేశాల పరిస్తితి ఏమిటి?
అసలు మనము దానం ఇచ్చినాక, మరలా వారి సౌకర్యాలు విహార యాత్ర గా వాడుకోవచ్చునా? కర్ణుని కవచ కుండలాల దానం, వ్రుధా కాలేదా, ఆయుధము తీసుకుని దానికి బదులుగా? మనకు నీతి నిబద్దత లేదు, అని ఇక్కడ తేలిపోయింది కదా?
వాళ్ళ కు స్ధలం/ ధనం ఇచ్చిన సమయములో, పండుగ వేళ లేదా ఖాళీ దొరికిన రోజు మాత్రమే గది మరియు ఇతర సౌకర్యాలు ఇస్తామని, ఎక్కువగా జనం ఉంటే, ఇద్దరు ముగ్గురు సర్దుకోవాలి అని, లేదా బయట హోటల్ లో ఉండాలి, అని చెప్పారా?
ఎందుకంటే మీకంటే ఎక్కువ ధనం, స్ధలం ఇచ్చిన వారిని గౌరవించాలి కదా అని కూడా చెప్పారా? అంటే ధనం, ఆస్తి, అధికారం, పలుకుబడి ముఖ్యం అంతేనా?
మరి ఊరక వచ్చిన, ఇంత స్థలము/ ధనం లెక్కలేకుండా దానం ఇచ్చిన మనము, బయట హోటలో నో, ఇంకో చోట నో ఉండలేమా? అది పిసినారి తనమా? ఇచ్చిన దానికి, మరలా ఫలితం పొందాలి, అన్న స్వార్ధ ఆరాటమా? అంటే ముదుసలి అమ్మ అయ్యను కూడా, పించను ఆస్తి లేకుండా చూడరా?
స్ధలం/ ధనం ఇచ్చిన వారికి లేదా గుడి కి సేవ చేస్తున్న వారికి అంటే షాప్ లో కూర్చోవడం మరియు బండి నడపడం లాంటివి, లేదా ఇతరులకు, ముదుసలి తనంలో మేము అండగా ఉండి, వైద్యం చేయించి, చేయూత నిచ్చి, చివరలో దినం కూడా చేస్తామని చెప్పారా? మనము అడిగామా?
వారు చెప్పనప్పుడు, ఆ ధనం/ స్ధలం వారికి ఇవ్వడం వృధా కదా? జనము ఇచ్చిన దానికి, జాలి దయ క్రుతజ్ఞత లేకుండా, ఉచితముగా సేవ చేస్తున్న వారి దగ్గర నే ఎదురు ధనం తీసుకుంటారు భోజనము నకు మరియు ఉండటానికి అంటే, అక్కడ మానవత్వం విశ్వసనీయత క్రుతజ్ఞత లేదు, మనకు బుద్ధి జ్ఞానం లేదు అనే కదా అర్ధం.
మనకు ధనం ఎక్కువ ఉంది అన్న అహంకారం, మదం అంతే నా? ఇదే కదా అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం అంటే? కడుపు కు ఆకలి అనే వాడికి, రూపాయి ఇవ్వం. వ్యాపారం తో, బోల్తా కొట్టించే వారికి, వృధాగా ధనం/ స్ధలం, అవ్వ, దీనికి పుణ్యం వస్తుందా?
తెలుగు గురువులు వేమన, బ్రహ్మం, రాఘవేంద్రలను నమ్మం, అసలు తెలుగు రాయలేము ముందు, అయినా పరాయి మత భాషా బాబాయిల చుట్టు తిరుగుతాం. ఇది స్వయం పాపం కాదా?
మాలాంటి వారు, ఆ గుడి/ ఆశ్రమ/ మఠం వారిని అడిగినా వారి సమాధానం - మేము బలవంతం చేయలేదు, వారంతట వారే వచ్చి, తోటి బంధులువు స్నేహితులు మనుషులలో ఉత్తములను మేము గత 10 ఏళ్ళు పట్టుకోలేని మూర్ఖులము, మాకు తోటి నర వాసన సజీవ గురువు సేవ పిల్లల సంస్కార పెంపకం అంటే పడదు, కాబట్టి మాచే ఉచితముగా రాబడిన/ దోచుకోబడిన ధనం/ ఆస్తి తీసుకుని, మాతో ఉచితము గా సేవ చేయించుకుంటూ ఉంటే, దొరికిన రోజున మేము ఏడాదికి 6 రోజులు గది సౌకర్యాలు భోజనము అందుకుంటూ, ముదుసలి తనములో మా దోవ మేము చూసుకుంటాము, అన్న ఒప్పందం మీదనే వారు ఇచ్చారు అంటే? మన సంతక కాగితం చూపితే? మన మొఖము ఎక్కడ పెట్టుకోవాలి?
దేవుడు చెప్పాడా, ఇలా దోచుకుని దాచుకుని, ఎవరికో ఒకరికి అర్హత బాధ్యత లేకుండా, కళ్ళు మూసుకుని మత్తులో ఇచ్చి, చేతులు దులుపుకుని, ముదుసలి తనములో రోడ్ మీద పడమని?
అదే ఓ నీతి, నియమము, 5+ ఏళ్ళ సజీవ గురువు సేవ గల వ్యక్తి ని, 10 ఏళ్ళు దేవులాడి, అతనిని బతిమాలి, మన అర్హత నిరూపించి ఇస్తే, వాళ్ళు కొంతైనా మనల్ని ముదుసలి తనములో చూసేందుకు అవకాశం ఉంటుంది కదా?
ముందు మనం మోహం వీడితే కదా, ఇతరుల లో నీతి అర్థం అయేది, మనసుకు ఎక్కేది? అందరూ దొంగలే, మనమూ అందులో దుంగలమే/ బండలమే/ నీచులమే అని, ఎవరికి వారు త్రుప్తి పడుతున్నారు కదా?
మేము 2020 కరోనా నుంచి, 10 వేలు ఇద్దాము, మన శనివార సాధనలు చేసే వారిని, తెలుగు రాష్ట్రాలలో పట్టుకోండి అంటే, పట్టుకున్నారా? అది మా కోసం అని మీరు అనుకున్నారు. కానీ అది మీకు ఉపయోగం, అని మీకు అర్ధము కాదు.
మనిషి ని నమ్మలేక, గుడి కి పోతే, మనలాంటి మనుషులే వాళ్ళు, అది తప్పకుండా వ్యాపారం అయితే, మనకు తెలిసిన మనిషే నయం కదా. అందుకే మంచి ని పంచు, పెంచు, వారికి సహాయం చెయ్యి, వారితో సహాయం పొందు. 5+ ఏళ్ల సజీవ గురువు సేవ ఉన్నవారిని, అరిషడ్వర్గ అష్ట వ్యసన బానిసత్వం లేని వారినే, నమ్మాలి కదా. ఒకవేళ వీరే మోసం చేసిన, మిగతా వారు ఇంకా ఎక్కువ ద్రోహం చేయరా?
మరి మన మతములో నే, కొందరు మూర్ఖులు ఇన్ని తప్పులు ఉంటే, అసలు మహిళను దేవతగా కొలచని, అసలు గురు పరంపర సజీవ గురువు సేవ అంటే తెలియని, ఎడారి మతాలలో ఇంకెంత ఘోరాలు ఉంటాయో కదా? ఈ మత మార్పిడి అంటే, వారి గొయ్య వారు తీసుకున్నట్లు కదా?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,322,088; 104 తత్వాలు (Tatvaalu) and views 252,237 Dt : 20-Aug-2023, Upd Dt : 20-Aug-2023, Category : General
Views : 437
( + More Social Media views ), Id : 1884 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
serve ,
free ,
money ,
return ,
food ,
lodging ,
donation ,
assets ,
money Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments