పేరెంట్స్ పై క్రుతజ్ఞతలు లేని తనయులను దూరంగా పెట్టలేమా? పురాణ వ్యక్తుల మంచి చెడు లక్షణాలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2135 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2170 General Articles and views 2,200,842; 104 తత్వాలు (Tatvaalu) and views 243,929.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

భూదేవి, పుత్రుడైనా లోక కంఠకుడు నరకాసురుడిని వధించినది. తల్లి దండ్రుల, ప్రాణాలు తీసే లేదా అనాధలుగా ధనం విదిలించి దూరంగా వదిలే, క్రుతజ్ఞతలు లేని పెళ్ళైన కొడుకు కూతురిని, ఐశ్వర్యం అధికారం అమిత శక్తి ఇవ్వకుండా, పదిమందికి వివరముగా చెప్పి కనీసం దూరంగా పెట్టలేమా?

మొన్న సొంత కొడుకే (ఇంకో వార్త లో కూతురు కూడా) ఇంటివెనక షెడ్ లో కడుపు మాడ్చి, కరోనా తో పోయారు అని, ఖననం చేసిన కధనం చదివాము, కోట్ల ఖరీదు చేసే, 40 ఎకరాల ఆస్తి ఇచ్చినా కూడా, కనికరం చూపలేదు.

ఇలాంటి సొంత పిల్లల నిక్రుష్టపు చేష్టలు, వార్తలు ఎన్నో, ఇంకా బయటకు రానివి ఎన్నో ఎన్నో. అనాధాశ్రమం కధలు కూడా చూసాము వీడియో సాక్ష్యముతో. పట్టించుకునే ఓపిక ఎవరికీ లేదు, రేపు మన బతుకు అదే అని తెలిసినా. ఆ బాధల పరంపర ఇది.

అవసరాలకు కనపడేది, మోహం లో పిల్లల పై ప్రేమ, అది ధృతరాష్ట్రుడు గాంధారి లాంటి క్రమశిక్షణ లేని చెడగొట్టే ప్రేమ అయితే, అది ఎప్పుడు అయినా వికటిస్తుంది భవిష్యత్తు లో.

పెద్దలు తాము గోతులు తీసుకుని నాశనం అయేది కాక, పిల్లల ను నాశనం చేస్తూ ఇంకా అమిత శక్తివంతులను చేసి, ప్రజలకు కూడా కీడు చేయడం తో, ఎన్నో పాప ఫలితాలు వారి వెంట నడచి, వారి పతనానికి కారణమవుతున్నాయి.

అందుకే భగవద్గీత రామాయణ భారతాలను చదవమనేది. పాపాలు అవే పెరగడం లేదు, మనము చేతులతో పెంచుతున్నాము, వ్యామోహము లో.

అబ్బే మా యువతి యువకులు ఆత్మహత్య లు చేసుకున్న లేదా ఇతరుల చేతిలో మోసపోయిన లేదా ఆత్మ బలం లేకపోయినా లేదా మమ్మల్ని అనాధలుగా వదిలేసి నా పర్లేదు కానీ, భగవద్గీత రామాయణం భారతం నేర్పడానికి సమయం తీరిక లేదండీ అంటారు, సొంత పిల్లల కు కీడు చేస్తు, అదేదో గొప్ప పనిలా.

పిల్లల కు అవి అర్థం అయితే, వారికి బంధువులు స్నేహితులు ఇంట్లో వారిని ను చూపించి, ఇలా పోల్చవచ్చు లేదా బుద్ది చెప్పవచ్చు,

1. ఇతను విదురుడు లాంటి వాడు, నమ్మవచ్చు. ఆయనను విడువద్దు తిట్టిన కొట్టిన, అది నీ క్షేమం కే సుమా.

2. ఇతను కర్ణుడు లాంటి వాడు, తప్పుడు వారి దగ్గర ఆదాయం పొంది, తర్వాత దానాలు చేసినా మంచిగా పైకి కంపించినా, దుర్మార్గం తో ఎప్పుడూ స్నేహం చేస్తారు, దూరంగా ఉండాలి.

3. ఇతను శకుని, వెన్నుపోటు పొడుస్తాడు. పక్కన అస్సలు వద్దు

4. ఈమె మంధర లేదా కైక, పుల్లలు పెడుతుంది. నాశనం కు దారి. జాగ్రత్తగా ఉండాలి, నమ్మకుండా.

5. ఈమె శూర్పణక, మనసంతా మోహం. ఇతను రావణుడు, పరాయి మనిషి లేదా సొమ్ము పై దురాశ.

6. పాండవులు లాగా పెరగాలి నీతి గా బాధ్యత గా, దైవం కృష్ణుని అండతో ఎప్పుడూ ఉండాలి.

7. కౌరవుల లాగా, మదం అహంకారం అమిత ధనం అధికారం వద్దు, పతనమే చివరకు.

8. రారాజు రాముడు కందమూలాలు తిని అడవిలో నేల మీద పడుకున్నాడు. సహనం ఓర్పు మర్యాద మాట మీద ఉండటం సత్యం ధర్మం. అలా మనం ఉండాలి. అలాంటి వారిని విడువద్దు.

9. ఇతను హనుమంతునిలా కార్య దక్షత కలవాడు, నమ్మకస్తుడు.

బాధ్యత గల ప్రేమ, రోజూ బదులు ఇస్తుంది ఇస్తునే ఉంటుంది, మనం పిల్లల కు వంటబట్టిన సంస్కారం తో నేర్పగలిగితే. అది 10 ఏళ్ల కే అర్థం అవుతుంది.

ఉదాహరణకు, మన పిల్లల రంగు గురించి అనుకుందాం, నిఖార్సయిన సహజ మైన, పెద్దోడి/ పెద్దది నలుపు రంగు, చిన్నోడి/ చిన్నది ఎరుపురంగు అనుకుంటే, తిండి తినడం, నిద్రపోవడం,

పెళ్ళై భార్య/ భర్త వచ్చిన తర్వాత, మారిందా? మారలేదు. కానీ బుద్ధి మాత్రమే మారింది, ఎందుకు?

తన బలహీన మనసు తో, సంస్కారం వంట బట్టక, అవసర అవకాశ వాదిలా, ఆ తర్వాత మారితే, పేరెంట్స్ ని తూలనాడితే, మరి వారిని దూరంగా ఉంచాలి కదా?

భూదేవి, కొడుకు అయినా కూడా నరకాసురుడిని సంహరించినది కదా, ఎన్నోసార్లు ఎంతోమంది చెప్పిన మారకపోతే? మరి మనం, కనీసం దూరంగా పెట్టలేమా, శక్తి మంతులను చేయకుండా, మనల్ని మరియు ఇతరుల ను బాధించకుండా?

మేము దూరంగా పెట్టాము, చెడు కు మారారు విశ్వసనీయత కోల్పోయారు, అని స్పష్టంగా నిరూపితం అయిన తర్వాత, అని అందరికీ చెప్పలేమా జాగ్రత్తలు పడమని?

చెడు కు మారారు అని అంటూనే, వారితోనే కలసి తిరుగుతూ ఉంటే, మొన్న సూర్యాపేట వారి లాగా, ఇంటి వెనక షెడ్ లో తిండి లేక దీనాతి దీన చావు ఎందుకు, అన్ని ఇచ్చి?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2170 General Articles and views 2,200,842; 104 తత్వాలు (Tatvaalu) and views 243,929
Dt : 15-Jun-2021, Upd Dt : 15-Jun-2021, Category : General
Views : 917 ( + More Social Media views ), Id : 1206 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : married , son , daughter , grateful , harm , parents , epic , good , bad , features
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content