APLatestNews.com top Banner

Social Media links
ఉపసభాపతి ఎమ్మెల్యే, కోన రఘపతి గార్కి, చీరాల మండల చుట్టుపక్కల అభివృద్ధి విన్నపము - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

గౌరవనీయులు ఆంధ్రా డిప్యూటీ స్పీకర్ మరియు బాపట్ల ఎమ్మెల్యే, కోన రఘపతి గార్కి,

నమస్కరించి, చీరాల పర్చూరు కారంచేడు వేటపాలెం మండల చుట్టుపక్కల, ప్రజల అభివృద్ధి (ఫిషింగ్ హార్బర్, చీరాల పార్లమెంట్ స్ధానం, చీరాల జిల్లా, చేనేత పార్కు, అత్యుత్తమ సాగరతీర బీచ్, ఇతర అభివృద్ధి మరియు పరిశ్రమ లు) తరపున సవినయముగా వ్రాయు విన్నపము.

మొదటగా, మీరు తొందరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం తో, ప్రజల దగ్గరకు రావాలి. యాధ్రృశ్చికంగా అమ్మవారి అండ కోసం, పూజ దీపం ఫోటో పంపాము, కానీ ఇప్పుడే వార్త తెలిసింది, మీరు కూడా తాడేపల్లి ఎన్నారై ఆసుపత్రిలో (Video), వైద్యం తీసుకుంటున్నారు అని. ఇతరుల వలె, హైదరాబాద్ వెళ్ళకుండా, మన రాష్ట్రంలో నే వైద్యం పొందుతున్నారు నమ్మకముగా అంటే చాలా గొప్ప విషయము. జగన్ గారి ఆశయాలు ను పాటిస్తున్నారు. అభినందనలు. ప్రజలకు మన రాష్ట్రం మీద నమ్మకం పెరగటానికి ఇది దోహదం చేస్తుంది. మీ ఫేస్బుక్ పేజీ కూడా, రోజూ అప్డేట్ చేస్తున్నారు.

మీ నాన్న గారు, కోన ప్రభాకర రవు గారు కూడా, స్పీకర్ గా, గవర్నర్ గా, మా అందరికీ తెలుసు. మా నాన్న గారు కూడా, వారి గురించి, మంచిగా చెప్పేవారు. ఉప్పు సత్యాగ్రహం లో కూడా పాల్గొన్నారు అనుకుంట.

బాపట్ల పెద్దాయన ముప్పలనేని శేషగిరిరావు రావు గారు ఎంతో కృషి చేశారు, బాపట్ల చదువుల సామ్రాజ్యంగా ఎదగడానికి. ఆయనంటే ఎంతో మాకు గౌరవం. మేమూ ఆయన విద్యార్దులమే. ఆయనలా ప్రతి ఒకరు కూడా, మనస్పూర్తిగా తమ ఊరి కోసం, కొంతైనా కృషి చేయాలి, కనీసం ప్రయత్నం చేయాలి, పక్క జిల్లా ల లో కూడా మాట్లాడేటట్లుగా.

మీకు ఉప సభాపతిగా రాష్ట్రం మొత్తానికి మరియు పక్కన నియోజకవర్గం గా, చీరాలకు విడదీయరాని ఆత్మీయ బంధం ఉంది. సహాయం చేసే మంచి మనసూ గుణం కూడా ఉంది. మీకు మంత్రి పదవి యోగం ఉందని మా అందరి ఆకాంక్ష, కష్ట జీవులకు దేవుని అండ ఎప్పుడూ ఉంటుంది కదా.

ఎప్పుడు నుండో అభివృద్ధి లో, అనాధ గా అందరు వదిలేసిన ప్రాంతం మాది, కేవలము గెలుపుకే అందరు వాడుకున్నారు. చీరాల ప్రజలు, ఫిషింగ్ హార్బర్, చీరాల పార్లమెంట్ స్ధానం, చీరాల జిల్లా, చేనేత పార్కు, అత్యుత్తమ సాగరతీర బీచ్, ఇతర అభివృద్ధి మరియు పరిశ్రమ లు కోసం, ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఒంగోలు తర్వాత పెద్ద ఊరుగా, ఎప్పుడు నుంచో ఉన్న స్ధాయి దాటి, ముందుకు పోవడం లేదు.

కేసీఆర్ గారిలా, స్ధానిక పరిస్థితి ని ఆశలను బట్టి, జిల్లా లు మారవచ్చు, ఎక్కువ కావచ్చు. ఈ అవకాశం అన్నా, ఇప్పుడు మాకు వస్తే ఆనందమే కదా. కేవలం ప్రకాశం ఉనికి ప్రాంత మండలాలతో మాత్రమే చాలు, సాంస్కృతికంగా దగ్గర ఉంటుంది. పక్కన జిల్లా మండలం మీద, ఆశ లేదు. మా అభివృద్ధి కోసం, ఇతర జిల్లా ప్రజలకు, అన్యాయం మేము చేయము, కావాలంటే మేము నష్ట పోతాము కాని. బాపట్ల కూడా, ఇంకో గొప్ప జిల్లా లా ఎదగాలి, గుంటూరు జిల్లా మండలాలతో.

గత ఎన్టీఆర్ గారి, నారా వారి పాలనలో లేదా దగ్గుబాటి వారి అండతో, ఏవీ సాధ్యం కాలేదు అభివృద్ధి లో. అది ఎందుకో ఇంతవరకు కూడా, కారణము తెలీదు. అందరూ కూడా, చీరాల, బాపట్ల పార్లమెంటు పరిధి లో ఉందని, ఎన్నికల అప్పుడు గుర్తింపు తప్ప, ఆ తరువాత అందరూ మరచారు. కృతజ్ఞతలు మరచిన వారికి, దేవుడు అండ ఎల్లవేళలా ఉండదు, అది ఎన్నోసార్లు నిరూపితమైంది.

మీరైనా, నాన్న గారిలా పెద్ద మనసు మంచి మనసు చేసుకుని, వీటిలో కొన్ని అయినా, ఒక్కొక్కటిగా జగన్ గారి పాలనలో సాధ్యమైనంత వరకు పూర్తి చేసి, తెదేపా తో కానిది వైసీపీ తో నే అయిందని, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారిని, చీరాల వేటపాలెం పర్చూరు కారంచేడు ఇంకా చుట్టూ మండలాల, ప్రజల హృదయాలలో కలకలం నిలిచేటట్టు చేస్తారని ఆశిస్తున్నాము.

మీరు జగన్ గారితో మాట్లాడితే ఇటు, ఇంకోవైపు మన పెద్దాయన విజయసాయిరెడ్డి గారు, సజ్జల గారు, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు, జిల్లా ఇంఛార్జి వేమిరెడ్డి గారు, మా జిల్లా మంత్రివర్యులు బాలినేని గారు, విద్యామంత్రి సురేష్ గారు, ఇతర పెద్దలు కూడా తలో ఒక చేయి వేసి వారు కూడా, మా పట్టణం ను కూడా, అభివృద్ధి చెందిన జాబితాలోకి నెడతారు అని ఆశిస్తున్నాము.

కష్టపడి పైకి వచ్చిన, బాపట్ల ఎంపీ సురేష్ గారు కూడా, పార్లమెంటు పరిధిలోని చీరాల అసెంబ్లీ అభివృద్ధి కి కృషి చేసి, గత ఎంపీలు లాగా అలంకారప్రాయం కాకుండా, చేతలలో అభివృద్ధి చూపించి, జగన్ గారి నమ్మకం నిలబెడతారని ఆశిస్తున్నాము.

మా ప్రాంత ఎమ్మెల్యే కరణం గారు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి గారు కూడా, మీలాగే పరిపూర్ణ మనసుతో చీరాల అభివ్రుద్దికి క్రుషి చేస్తారు అని ఆశిస్తున్నాము.

మీరంతా బాగుండాలి, దేవుని అండ ఉండాలి, మీరూ చీరాలకు అండగా ఉండాలి.

Note :

మిత్రులారా దేవుడు కృష్ణుని సూచన, ప్రయత్నం చేయి, ఫలితం ఆశించకు, అది నా కొదిలేయి. మీ వంతు మీరు చేయండి.

అధికారులు, నాయకులు అందరికీ పంపాము, పరి విధాలుగా. ఏ మంచి బాధ్యత గల , అధికారులు నాయకులు వ్యక్తులు అయినా, తప్పు మరియు పాపం తమ మీద ఉంచుకోరు. న్యాయబద్ద మైన కోరిక, పై వాళ్ళ కు తెలుపుతారు. అప్పుడు పాపం, పై వారిదే కదా.

ప్రజలను పట్టించుకోని గత మంత్రులు ను అధికారులు ను చూసాము, ఏమి జరిగిందో. తర్వాత, సర్వేశ్వరుని దయ. మనం నిమిత్త మాత్రులం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 744 General Articles, 46 Tatvaalu
Dt : 09-Aug-2020, Upd Dt : 09-Aug-2020, Category : Request
Views : 142 ( + More Social Media views ), Id : 640 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : andhra , deputy , speaker , bapatla , mla , kona raghapati , chirala , karamchedu , vetapalem , parchur , mandal , development , request
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content