సంవత్సరం తర్వాత, సమస్యలు ఏకరవు పెట్టి, సహాయం అడిగితే, వారికి నమ్మకం కలగదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1392 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1424 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

పాత రోజుల లో, మనిషి కనపడ్డప్పుడు లేదా అవసరమైనప్పుడు ఫోన్ లో, గత సమస్యలు చెప్పుకునేవారు, సహాయం అడిగే వారు. కానీ ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత, అందరూ పక్కన ఇళ్ళు వారు అయ్యారు, దూరముగా అంతరిక్షంలో ఉన్నా కూడా.

అలా 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత, మన సమస్యలు చెప్పి ఏకరవు పెట్టి, సహాయం అడిగితే, వారికి నమ్మకం కలగదు. ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, అని సహాయం చేయలేరు అండగా ఉండలేరు. మనకు ధర్మం కాదు.

కాబట్టి, ఎప్పుడుది అప్పుడు, మన అనుకున్న వారికి నమ్మకం ఉన్న వారికి, మన సమస్యలు, మన మార్పులు, కష్ట సుఖాలు, అన్ని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండాలి. వారు సహాయం చేస్తారా లేదా అనేది అనవసరం, ఎవరి కష్టాలు వారివే కదా. మనం చెబుతోంది సహాయం కోసం కాదు అని నిర్ణయం చేసుకుని, కేవలం నమ్మకం కోసం బంధువు స్నేహితుడు గురువు అన్న గౌరవం తో చెప్పాలి.

ఏళ్లుగా మన ఇల్లు ఖాళీగా ఉంది, గడ్డి కోసేవారూ దొరకడం లేదు, ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతూనే ఉన్నాము. ధనం ఎగకొడుతున్న, ఇంటి పక్కన చెత్త వేస్తున్న సమస్యలు చెప్పాము. ఎవరూ ముందుకు రాకపోయినా, సహాయం చేయకపోయినా, మన సమస్య చెపడంలో నష్టం, విలువ తక్కువ ఏముంది?

ఏ సమస్యలు ను అయినా దాచిపెట్టుకుని, లోపల కుళ్ళి, ఎవరూ నమ్మక, ఆ తర్వాత బయటపడి, నలుగురు నవ్వుతూ ఉంటే, అప్పుడు మానసిక స్ధితి అవమానం ఆవేదన, మరీ ఘోరం కదా? అదే ముందే తెలిసిన చెప్పిన, మన నిజాయితీ ఉంటుంది, గుర్రం ఎగరవచ్చు లేదా మానసిక బలం పెరగవచ్చు.

ఓ చిత్రం చెప్పేదా, మన స్ధాయిలో ఓ చిన్న సాయం చేద్దాం అని ఇద్దరు వెంట పడుతుంటే, వారు అది అర్థం చేసుకోకుండా, తీరిక లేదని వెనక్కి పోతున్నారు. విధి విచిత్రం అయినది, అనేందుకు ఇదే ఉదాహరణ. అందుకే మన బుద్ధి, వ్యక్తిత్వం తెలిసినందు వలన, లాభం లేకపోయినా, నష్టం లేదు.

అందుకే ఎన్నోమార్లు గురువు లకు గుర్తు చేశా నిరంతరం ఏదైనా పంపు తెలియచెప్పు మీ వారికి. అది, పిల్లికి పాలు పోసినా, పిల్ల కు పద్యం చెప్పిన కూడా, పిచ్చుకకు గింజలు వేసిన కూడా, అందులో నీ వ్యక్తిత్వం బుద్ధి గుణం సాంప్రదాయం మర్యాద ఉంది కదా? ఇది నీ గొప్ప కోసం కాదు, నీ స్నేహితులు లో ఆ సేవా భావం, ఆ మంచి గుణం, పెంచడానికి అనుకో, తప్పు ఏముంది?

కాగితం పై రాయి ఫోటో తీయి, టైపు చేయి, గొంతు మెసేజ్ పెట్టు, గుండె బరువు గోప్యత, మానసిక వేదన తగ్గించుకో.

చిత్తూరు మదనపల్లి సంఘటన విన్నాం కదా, బయట ప్రపంచం తో, మనకు తెలిసిన అనుభవజ్ఞులతో మాట్లాడుతూ ఉంటే నే, లోక జ్ఞానం వస్తుంది.

సమస్య మనకు పెద్దగా ఉంటుంది, కానీ వారికి చిన్నగా ఉండవచ్చు, పరిష్కారం లేదా మనశ్శాంతి కలగవచ్చు. కానీ ఎంతవరకు బయటకు చెప్పాలి అనేది, నమ్మకం ను బట్టి, జాగ్రత్తగా తెలుసుకోవాలి సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1424 General Articles, 48 Tatvaalu
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 388 ( + More Social Media views ), Id : 958 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : after year , issues , problems , ask help , believe , whatsapp
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content