APLatestNews.com top Banner
         
వడ్డీ లు చీటీలు బినామీలు, గురు శిష్యులు సంవాదం 1 వ భాగం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
స్వామి, వడ్డీ వ్యాపారం లో ఇబ్బందులు శాపనార్థాలు లాభాలు చూసాను. మనశ్శాంతి లేదు, నిద్ర లేదు. తరుణోపాయము చెప్పి, మనశ్శాంతి కలిగించండి.

శిష్యా , ప్రభుత్వ పరంగా ప్రైవేటు వ్యక్తులు, ప్రవేటు వ్యక్తుల దగ్గర, ఇలా చీటీ పాటలు, వడ్డీ లు అంటూ వ్యాపారం చేయడం, నిషిద్ధం, నేరం. ఆ మధ్యలో, కాల్మనీ అని బెజవాడలో పెద్ద గొడవ జరిగింది, గుర్తు ఉందా? కాకపోతే, సామాన్యులు , బతుకు తెరువు కోసం అవి వాడుతుంటారు, వారినేం అనలేం.

మరి దాని మీద ధర్మం గా సంపాదించావా? ధర్మ వడ్డీ తో?

లేదు స్వామి, రూపాయ నుంచి 3 దాకా ఇస్తున్న డబ్బు తీసుకుని , బయట 3 నుంచి 10 దాకా అప్పు కు ఇస్తున్న. అత్యవసరానికి 20 కి కూడా.

మరి బాగానే వస్తున్నాయి కదా సమస్య ఏమిటి? మొన్న మోడీ నోటు రద్దు వలన నల్ల ధనం పోయింది, ఇచ్చిన వి వెనక్కి రావడం లేదు. జనం వచ్చి డబ్బు వెనక్కి అడిగి తే , లేవని అంటే బండ బూతులు, శాపనార్థాలు. నష్టం వచ్చినపుడు వారూ సర్దుకోవాలి కదా. ఇచ్చినంత కాలం వడ్డీ ఇచ్చాను , ఇప్పుడు ఇలా చేసిన, ఇంక మాకు మనశ్శాంతి ఉంటుందా.

నాయనా, జవాబు నీ దాంట్లో నే ఉంది. వడ్డీ ఇచ్చిన ది 3 లోపు. వడ్డీ తీసుకున్నది 3 పైన . అంటే రెట్టింపు లాభాలు. మరి లాభాలు జనానికి పంచావా? పోనీ కనీసం ఉద్యోగుల కు పంచావా, జీతం కాక? కేవలం మీ వారి ఆస్తులు పెంచుకున్నావు. కంపెనీలు లాభాల లో డివిడెండ్లు పంచుతాయి అని తెలుసా? ఇంతవరకు సరే , లాభాలు అన్నీ మీకే, వాటి వలన వచ్చిన ఆస్తులు మీకే.

మరి నష్టం వచ్చినా, లాభం లా అది కూడా, నువ్వే మొత్తం భరించాలి కదా? అది జనం మీద తోసి , వారిని ఇబ్బందులు పెడితే, వారి శాపనార్థాలు మనకు మన వంశానికీ మంచిది కాదు. నువ్వు వ్యాపారం లో నష్టపోయినా , వ్యక్తి గతం గా కొన్న ఆస్తుల కొన్ని అయినా పణంగా పెట్టి, జన ఘోష తగ్గించుకో, వంశానికి మంచిది. ఒకవేళ అన్ని పోగొట్టుకుని రోడ్డు మీద ఉంటే , తప్పు ఒప్పుకుని క్షమాపణ అడుగు. జనం క్షమిస్తారు సానుభూతి తో. షాపు యజమాని మాత్రమే, లాభ నష్టాలకు బాధ్యత వహించాలి , లేకపోతే అలాంటి వ్యాపారం నడపకూడదు శక్తిని మించి.

వడ్డీ వ్యాపారం లో బాగు పడినా , జనాలను ఇబ్బంది పెట్టినా, వారి జీవితాల్లో చివరకు మనశ్శాంతి కరువే. ఒక కుటుంబం లో 5 గురు పిల్లల లో , ముగ్గురిని ని కోల్పోయారు. తర్వాత తరాలు కు, ఏ వ్యాపారం లోను కలసి రాలేదు. ఇంకా ఎన్నో దుర్ఘటన లు పేపర్లో చూస్తున్నాము టీవీలలో వింటున్నాము.

నీకు మనశ్శాంతి రావాలి, తర్వాత తరాలు సుఖసంతోషాలతో ఉండాలి, అనుకుంటే మాట ప్రకారం, నష్టపోయినా , జనం ని సంతృప్తి తో పంపించి, వదిలించుకో. లేదా భరిద్దాము అనుకుంటే కొనసాగించు.

అందరూ అదే తప్పులు కదా చేస్తున్నది అనుకుంటాము , కానీ అందరిలా మన కుటుంబ తరాల పతనం, ఆశించము గదా. దానికి మనం కారణం కారాదు నాయనా , యోచన చేయి. మనశ్శాంతి వస్తుంది.

Dt : 03-May-2019, Upd Dt : 03-May-2019 , Category : General, Views : 73 ( id : 98 )
Tags : interest , cheetee , binaamee , guru , sishya
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments